చెత్త విషయంలో తలెత్తిన వివాదం కాస్త పోలిస్టేష్టన్‌లో ఫిర్యాదు చేసేంత వరకు వెళ్లింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఇండోర్‌కు చెందిన వ్యాపారవేత్త, పెట్రోల్ పంప్ యజమాని మహేష్ పటేల్‌కి పారిశుధ్య కార్మికులకు మధ్య చెత్త విషయమై వివాదం తలెత్తింది. అతడి ఇంటి వద్ద చెత్తను సేకరిస్తున్నప్పుడూ ఈ ఘటన చోటు చేసుకుంది. పటేల్ భార్య పొడి, తడి చెత్తను వేరు చేయనందున గొడవ జరిగింది. దీంతో ఆమె భర్త పటేల్, అతడి కుమారుడు పారిశుధ్య కార్మికులతో వాగ్వాదానికి దిగారు.
ఇంతలో ఆ మహేష్ లోపలి నుంచి తుపాకీ తీసుకుని వచ్చి బెదిరింపులకు గురిచేశాడు. దీంతో అక్కడ నుంచి పారిశుధ్య కార్మికులు ఒక్కసారిగా పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసు అధికారి సంఘటనా స్థలానికి చేరకుని ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదర్చారు కూడా. గానీ చెత్త వ్యాన్‌లను నడుపుతున్న డ్రైవర్ల సంఘం సభ్యులు బెదిరింపులకు గురైన పారిశుధ్య కార్మికులతో కలిపి పోలీసులను ఆశ్రయించి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
ఆ వ్యాపారి బీజేపీ మాజీ శాసనసభ్యుడు మనోజ్ పటేల్ బంధువు కావడంతోనే పోలీసులు ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోలేదంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐతే అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడంతో స్పందించిన పోలీసు అధికారి ఆశిష్ మిశ్రా ఆ ఘటనపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ముందుగా అక్కడ అసలేం జరిగిందే నిర్థారించడానికి ఫిర్యాదుదారుణ్ణి సంప్రదించి తదుపరి దర్యాప్తు ప్రారంభిస్తామని చెప్పారు.
(చదవండి: పులి భయంతో హడలిపోతున్న గ్రామాలు..దెబ్బకు కర్ఫ్యూ, పాఠశాలలు మూసివేత)
Comments
Please login to add a commentAdd a comment