Fight Over Pet Dogs Indore Man Opens Fire At Neighbor's Kills 2 Men - Sakshi
Sakshi News home page

ముందు కుక్కలు గొడవపడ్డాయి.. తర్వాత ఏం జరిగిందంటే?

Aug 18 2023 1:52 PM | Updated on Aug 18 2023 2:58 PM

Fight Over Pet Dogs Indore Man Opens Fire At Neighbours Kills 2 Men - Sakshi

భోపాల్: ఇండోర్లో ఒక కాలనీలో కుక్కలను వాకింగ్ కోసమని తీసుకొచ్చారు ఇద్దరు వ్యక్తులు. కానీ ఆ కుక్కలు ఒక్కసారిగా కయ్యానికి కాలు దూశాయి. వాటి తరపున వకాల్తా పుచ్చుకుని వాటి యజమానులు కూడా గొడవపడ్డారు. అందులో ఒకరు ఆగ్రహంతో పక్కనే ఉన్న తన ఇంటిలోకి వెళ్లి తుపాకీతో కాల్పులు జరిపగా కాల్పుల్లో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.. ఆరుగురు గాయపడ్డారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ఇండోర్ కృష్ణ బాగ్ కాలనీలో రాత్రి 11 గంటలకు ఒక ఇరుకైన సందులో రజావత్, విమల్ అచల్ ఇద్దరూ తమ పెంపుడు కుక్కలతో వాకింగ్ చేయడానికి బయటకు వచ్చారు. ఆ సమయంలో రెండు కుక్కలు ఎదురుపడేసరికి పెద్దగా మొరుగుతూ తగువుకు దిగాయి. వాటికంటే గట్టిగా అరుపులతో రజావత్, అచల్ గొడవపడ్డారు. 

అంతలో ఏమైందో రజావత్ ఆగ్రహంతో పక్కనే ఉన్న బిల్డింగ్ మొదటి అంతస్తులోని తన ఇంటిలోకి ఆవేశంగా వెళ్లి బాల్కనీలోకి వచ్చి 12-బోర్ రైఫిల్ తో కాల్పులు జరిపాడు. కాల్పుల్లో అచల్ అక్కడికక్కడే చనిపోయాడు. అతడి తోపాటు అక్కడే ఉన్న మరో వ్యక్తి రాహుల్ వర్మ కూడా ప్రాణాలు కోల్పోయాడు. మరో ఆరుగురికి బులెట్ గాయాలయ్యాయి. 

రజావత్ కు గన్ లైసెన్స్ ఉన్నందున అతడిని ఒక ప్రయివేట్ కంపెనీ సెక్యూరిటీ గార్డుగా నియమించింది. మృతుడు అచల్ కు నిపనియాలో కటింగ్ షాపు ఉంది. రజావత్ క్షణికావేశంలో చేసిన పొరపాటుకు రెండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు రజావత్ ను, అతడి కుమారుడిని, వారి బంధువు శుభంను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. 

ఇది కూడా చదవండి: మసాజ్ కోసం కక్కుర్తి పడ్డ బెజవాడ కుర్రాళ్ళు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement