చిన్నారిపై కుక్కలు మూకుమ్మడి దాడి.. నిజంగానే దేవుడిలా వచ్చాడు! | 4 Year Old Girl Bitten Dragged By Dogs In Bhopal | Sakshi
Sakshi News home page

చిన్నారిపై కుక్కలు మూకుమ్మడి దాడి.. నిజంగానే దేవుడిలా వచ్చాడు!

Published Sun, Jan 2 2022 6:03 PM | Last Updated on Sun, Jan 2 2022 8:59 PM

4 Year Old Girl Bitten Dragged By Dogs In Bhopal - Sakshi

On CCTV 4 Year Old Girl Bitten: ఇటీవల కాలంలో కుక్కల దాడి చేసి పిల్లలను హతమార్చిన ఘటనలను ఎన్నో చూశాం. అంతెందుకు ఇటీవలే ఒక బాలుడిపై సుమారు 12 కుక్కలు దాడి చేస్తుండగా ఆ బాలుడిని కాపాడే ప్రయత్నంలో అడ్డుగా వెళ్లిన తల్లి పై కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటనలు గురించి విన్నాం. అచ్చం అలానే నాలుగేళ్ల బాలికపై కుక్కలు అత్యంత భయంకరంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి.

(చదవండి: ఫుడ్‌ కంటైనర్‌లో స్పై కెమెరా!)

అసలు విషయంలోకెళ్లితే...మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని ఒక కూలి కూతురు అయిన నాలుగేళ్ల బాలిక ఇంటి బయట ఆడుకుంటుండగా ఐదు కుక్కలు  ఆమెపై దాడి చేశాయి. పైగా ఆబాలిక తప్పించుకనే నిమిత్తం పరిగెట్టడానికి ప్రయత్నించినప్పటికి అవి చుట్టుముట్టి దాడి చేశాయి. ఈ క్రమంలో ఆ కుక్కలు తల, బొడ్డు, కాళ్లపై అత్యంత దారుణంగా కొరికాయి. అయితే ఇంతలో ఒక వ్యక్తి వచ్చి ఆ కుక్కలను తరిమి కొట్టడంతో ఆ బాలిక ప్రాణాలతో బయటపడింది. సదరు వ్యక్తి రాకపోయి ఉంటే ఆ చిన్నారి పరిస్థితి దారుణంగా ఉండేది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటన భోపాల్‌లో బాగ్ సెవానియాలోని సీసీటీవీలో రికార్డు అవ్వడంతో వెలుగు చూసింది. ప్రస్తుతం ఈ భయనకమైన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఆ వ్యక్తి నిజంగా దేవుడిలా రావడంతోనే ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడిందనే విషయాన్ని ఒప్పుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

(చదవండి:  ఫుల్‌గా తాగి సెక్యూరిటీ గార్డ్‌తో గొడవపడిన మహిళ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement