CCTV Camer
-
"అన్న మోసం చేశాడని.." తిరుపతిలో దారుణం
-
చిన్నారిపై కుక్కలు మూకుమ్మడి దాడి.. నిజంగానే దేవుడిలా వచ్చాడు!
On CCTV 4 Year Old Girl Bitten: ఇటీవల కాలంలో కుక్కల దాడి చేసి పిల్లలను హతమార్చిన ఘటనలను ఎన్నో చూశాం. అంతెందుకు ఇటీవలే ఒక బాలుడిపై సుమారు 12 కుక్కలు దాడి చేస్తుండగా ఆ బాలుడిని కాపాడే ప్రయత్నంలో అడ్డుగా వెళ్లిన తల్లి పై కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటనలు గురించి విన్నాం. అచ్చం అలానే నాలుగేళ్ల బాలికపై కుక్కలు అత్యంత భయంకరంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. (చదవండి: ఫుడ్ కంటైనర్‌లో స్పై కెమెరా!) అసలు విషయంలోకెళ్లితే...మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని ఒక కూలి కూతురు అయిన నాలుగేళ్ల బాలిక ఇంటి బయట ఆడుకుంటుండగా ఐదు కుక్కలు ఆమెపై దాడి చేశాయి. పైగా ఆబాలిక తప్పించుకనే నిమిత్తం పరిగెట్టడానికి ప్రయత్నించినప్పటికి అవి చుట్టుముట్టి దాడి చేశాయి. ఈ క్రమంలో ఆ కుక్కలు తల, బొడ్డు, కాళ్లపై అత్యంత దారుణంగా కొరికాయి. అయితే ఇంతలో ఒక వ్యక్తి వచ్చి ఆ కుక్కలను తరిమి కొట్టడంతో ఆ బాలిక ప్రాణాలతో బయటపడింది. సదరు వ్యక్తి రాకపోయి ఉంటే ఆ చిన్నారి పరిస్థితి దారుణంగా ఉండేది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటన భోపాల్‌లో బాగ్ సెవానియాలోని సీసీటీవీలో రికార్డు అవ్వడంతో వెలుగు చూసింది. ప్రస్తుతం ఈ భయనకమైన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వ్యక్తి నిజంగా దేవుడిలా రావడంతోనే ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడిందనే విషయాన్ని ఒప్పుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. (చదవండి: ఫుల్‌గా తాగి సెక్యూరిటీ గార్డ్‌తో గొడవపడిన మహిళ) Horrific! Stray dogs mauled a 4 year old girl in Bhopal a passerby threw stones at the dogs and chased them away. The child has been hospitalized with severe injuries. pic.twitter.com/X4EyruZxra — Anurag Dwary (@Anurag_Dwary) January 2, 2022 -
పశ్చిమలో ఫేస్ రికగ్నిషన్ కెమెరాలు
దాదర్: రైల్వేస్టేషన్లలో నేరాలను అరికట్టేందుకు ముఖాన్ని గుర్తించే ఆధునిక (ఫేస్ రికగ్నిషన్ సిస్టం) సీసీటీవీ కెమెరాలు పశ్చిమ రైల్వే ఏర్పాటుచేస్తోంది. ప్రస్తుతం రద్దీగా ఉండే, నేరాలు ఎక్కువగా జరిగే స్టేషన్లలో ఏర్పాటు చేయడానికి ప్రాధాన్యత ఇస్తోంది. ఆ తరువాత దశల వారిగా మిగతా లోకల్ రైల్వే స్టేషన్లలో కూడా ఏర్పాటు చేయనుంది. ఇప్పటి వరకు మొత్తం 207 ఆధునిక కెమెరాలలో 242 కెమెరాలు రద్దీగా ఉండే వివిధ స్టేషన్లలో ఏర్పాటు చేసినట్లు పశ్చిమ రైల్వే భద్రత దళాల ద్వారా తెలిసింది. ప్రస్తుతం రైల్వే పోలీసులు వీటిని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. ప్రయోగం సఫలీకృతమైతే ముంబైతోపాటు ఉప నగరాలు, శివారు ప్రాంతాల్లో ఉన్న మిగతా రైల్వేస్టేషన్లలో కూడా ఏర్పాటు చేయనున్నారు. నేరాలు అరికట్టడానికి.. ముంబై లోకల్ రైల్వే పరిధి 120–135 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. లోకల్ రైళ్లతోపాటు ప్లాట్‌ఫారాలపై, పాదచారుల వంతెనలపై, సబ్ వేలో, ఎస్కలేటర్లపై విపరీతంగా రద్దీ ఉంటుంది. తోపులాటలు లేకుండా ప్లాట్‌ఫారంపై నుంచి బయట పడలేని పరిస్థితి ఉంటుంది. దీన్ని అదనుగా చేసుకుని చిల్లర దొంగలు తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తారు. జేబులోని డబ్బులు, పర్సులు కొట్టేయడం, మహిళ ప్రయాణికుల బ్యాగులు, మెడలోని బంగారు ఆభరణాలు చోరీకి గురైతుంటాయి. కొందరు దొంగలు ప్రయాణికులపై దాడిచేసి దోచుకుంటారు. స్థానిక స్టేషన్లో ఫిర్యాదు నమోదైన తరువాత పోలీసులు దర్యాప్తుచేస్తారు. అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ముంబైలో అదృశ్యమైన సంఘటనలు అనేక ఉన్నాయి. ఇందులో పిల్లలు, వృద్దులు, మహిళలు ఉన్నారు. వీటితోపాటు టికెటు బుకింగ్ కౌంటర్ల వద్ద దళారులను, ఈవ్‌టీజింగ్ చేసే ఆకతాయిల సంఖ్య అధికమైంది టెక్నాలజీ సహకారం.. కేసులు చేధించాలంటే పోలీసులు సీసీటీవీ పుటేజ్‌ల సాయం తప్పనిసరి తీసుకోవల్సి ఉంటుంది. కానీ, ప్లాట్‌ఫారాలపై, స్టేషన్లలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలపై దుమ్ము, ధూళి పేరుకుపోవడంతో స్పష్టంగా దృశ్యాలు కనిపించవు. అనేక చోట్ల కెమెరాల డైరెక్షన్ తప్పుడు దిశలో ఉంటాయి. దీంతో నేరాలు జరిగినప్పుడు దొంగలను, నేరస్తులను పట్టుకోవాలంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ ఫుటేజ్‌ల దృశ్యాలు స్పష్టంగా కనిపించడం లేదు. కేసు పరిష్కరించడంలో రైల్వే పోలీసులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఆ«ధునిక పరిజ్ఞానంతో తయారైన ఫేస్ రికగ్నేషన్ సిస్టం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని పశ్చిమ రైల్వే నిర్ణయం తీసుకుంది. వీటివల్ల రాకపోకలు సాగించే సామాన్య ప్రయాణికులతోపాటు నేరస్తుల ముఖాలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. దాదర్‌లో అడుగడుగునా కెమెరాలు.. నగరంలో నిత్యం ప్రయాణికుల రాకపోకలతో రద్దీగా కనిపించే వివిధ వివిధ రైల్వే స్టేషన్లలో దాదర్ ఒకటి. దాదర్ స్టేషన్‌కు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ పశ్చిమ, సెంట్రల్ ఇలా రెండు రైల్వే మార్గాలు కలుస్తాయి. అంతేగాకుండా స్లో లోకల్ రైళ్లతోపాటు ఫాస్ట్ రైళ్లు కూడా నిలుస్తాయి. అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే, పోయే ఎక్స్‌ప్రెస్, మెయిల్ రైళ్లు కూడా ఇక్కడ ఆగుతాయి. దీంతో నగరంలోని వివిధ రైల్వేస్టేషన్లతో పోలిస్తే దాదర్ స్టేషన్‌పై ప్రయాణికుల భారం ఎక్కువగా ఉంటుంది. ప్లాట్ఫారం నంబరు ఒకటి ఆనుకుని హోల్‌సేల్ పూల మార్కెట్, కూత వేటు దూరంలో కూరగాయల మార్కెట్ ఉంది. దీంతో దాదర్ స్టేషన్ నుంచి నిత్యం ఐదు లక్షల మంది ఉద్యోగులు, వ్యాపారులు, సామాన్య ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. దీన్ని బట్టి ఈ స్టేషన్లో ప్రయాణికుల రద్దీ ఏ స్థాయిలో ఉంటుందో ఇట్టే అర్థమవుతోంది. ప్రయాణికుల సంఖ్యతోపాటు నేరాలు కూడా ఎక్కువగానే జరుగుతుంటాయి. దీంతో ఈ స్టేషన్ ఆవరణలో, ప్లాట్‌పారాలపై, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలపై, ఎస్కలేటర్ల వద్ద ఫేస్ రికగ్నిషన్ సిస్టం సీసీటీవీ కెమెరాలు అడుగడుగున ఏర్పాటు చేయాలని రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. -
గొడ్డును బాదినట్లు.. కొడుకును బాదేసింది!
-
అద్దెకున్న ఇంటికే కన్నం
రామగుండం : నిఘా నేత్రాలు ఎలాంటి దొంగలనైనా వదిలిపెట్టకుండా పట్టిస్తున్నాయి. గోదావరిఖనిలో ఇల్లు అద్దెకిచ్చిన ఓ యజమాని కిరాణా దుకాణానికే కన్నం వేశారు కిరాయికి ఉంటున్న దంపతులు. దుకాణం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే... గోదావరిఖని కల్యాణ్ నగర్‌లోని ఎఫ్‌సీఐ క్రాస్ రోడ్డులో నగునూరి వెంకటేశం-అంజలి దంపతులు నివాసముంటున్నారు. వారి ఇంటి కింద పోర్షన్లో వెంకటేశం కిరాణం షాపును నిర్వహిస్తున్నాడు. ఆ ఇంటి భవనంపై పోర్షన్లో ఓ వ్యక్తి నత భార్యతో కలిసి తొమ్మిదేళ్లుగా అద్దెకు ఉంటున్నాడు. చాలా నమ్మకంగా ఉంటుండడంతో వారిని పూర్తిగా నమ్మారు. రెండేళ్ల క్రితం దుకాణానికి వేసే తాళం చెవి పోవడంతో, ఎక్కడో పోయిందిలే అనుకున్న వెంకటేశం ఇంట్లోని మరో తాళం చెవితో దుకాణాన్ని తీస్తున్నాడు. ఈ నేపథ్యంలో అందులోని విలువైన వస్తువులు, నగదు మాయం కావటంతో అతను అయోమయానికి గురయ్యాడు. ఇంట్లోని 12 తులాల బంగారు ఆభరణాలు ఒక్కొక్కటిగా మాయమయ్యాయి. దీంతో వెంకటేశం తన భార్యపై అనుమానపడటంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. చివరకు తన స్నేహితుడి సలహాతో 20 రోజుల క్రితం సీసీ కెమెరా ఏర్పాటు చేయించాడు. ఈనెల 25న కరీంనగర్‌లోని బంధువుల ఇంట్లో జరిగిన వివాహ వేడుకకు వెంకటేశం తన భార్యతో కలిసి వెళ్లాడు. అదేరోజు సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చిన వెంకటేశం దుకాణం తెరిచి చూడగా నగదుతో పాటు విలువైన కిరాణ వస్తువులు, బంగారం కనిపించలేదు. దాంతో సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలను పరిశీలించగా, అద్దెకున్న దంపతులు చోరీకి పాల్పడినట్లు దృశ్యాలు నమోదు అయ్యాయి. అయితే నిందితుడిని పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి అనంతరం విడిచిపెట్టారు. దాంతో మరుసటి రోజు నుంచి దంపతులు కనిపించకుండాపోయారు. ఈ నేపథ్యంలో బాధితుడు డీఎస్సీకి ఫిర్యాదు చేశాడు. ఇక నిందితుడికి అధికార పార్టీ నేతలతో సంబంధాలు ఉండటంతో కేసులో రాజీ కుదిర్చేందుకు పోలీసులపై ఒత్తిళ్లు తెస్తున్నట్లు సమాచారం.