గొడ్డును కూడా అంత దారుణంగా బాదరు.. అలాంటిది కన్న కొడుకును దారుణాతి దారుణంగా కొట్టిన ఓ తల్లి మీద ఢిల్లీ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఏడాదిన్నర వయసున్న కొడుకును అలా కొట్టిన విషయం మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. మూడేళ్ల క్రితం తన కొడుకుతో ఆమెకు పెళ్లయిందని, వాళ్లిద్దరికీ ముగ్గురు పిల్లలున్నారని.. కానీ ఆమె మాత్రం తరచు భర్తతో పాటు ముగ్గురు పిల్లలను కూడా కొడుతూ ఉంటోందని సదరు మహిళ అత్తగారు షహానా ఢిల్లీ మహిళా కమిషన్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది చాలా షాకింగ్ ఘటన అని ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె తరచు కొడుతున్న ఆ విషయం నిరూపించడానికి తమ వద్ద సాక్ష్యాలు ఏమీ లేవని, చివరకు ఇంట్లో సీసీటీవీ కెమెరాలు అమర్చిన తర్వాత ఆమె విషయం బయటపడిందని షహానా తెలిపారు.