Mukesh Ambani Salary Details: భారతదేశంలో అత్యంత సంపన్నుడెవరు అంటే అందరూ ఏకకంఠంతో చెప్పే మాట 'ముఖేష్ అంబానీ' (Mukhes Ambani) అని, కావున ఇందులో ప్రస్తుతానికి ఎటువంటి సందేహం లేదు. అయితే ఈయన వార్షిక వేతనం ఎంత? ఇతర సౌకర్యాలు ఏవి ఉంటాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
రిలయన్స్ సంస్థకు చైర్మన్‌గా కొనసాగుతున్న 'ముఖేష్ అంబానీ' పదవీకాలం మరో ఐదేళ్లు కొనసాగటానికి వాటాదార్ల ఆమోదం కోరుతున్నట్లు సమాచారం. నిజానికి 224 ఏప్రిల్ 19 నాటికి ఆయన పదవి కాలం పూర్తవుతుంది. మరో ఐదేళ్లు పొడిగిస్తే పదవి 2029 వరకు కొనసాగుతుంది. ఆరు పదుల వయసులో కూడా అపర చాణక్యుడుగా కంపెనీ అభివృద్ధికి పాటుపడుతున్న ఈయన 2022లో ధీరూభాయ్ అంబానీ మరణానంతరం చైర్మన్ పదవి పొందారు. ఇప్పటి వరకు అది అలాగే కొనసాగుతూ ఉంది.
2022 నుంచి ఎన్నోన్నో కొత్త ఆలోచనలతో కంపెనీని అత్యన్నత శిఖరాలకు తీసుకెళ్లాడు. ఈ కారణంగా మరో ఐదేళ్లు కంపెనీకి చైర్మన్‌గా నిర్వర్తించనున్నారు. అయితే ఈ సమయంలో ఆయన వార్షిక వేతనం శూన్యం అని తెలుస్తోంది. అంటే మరో ఐదేళ్ల కాలం పాటు ఆయన జీతం సున్నా రూపాయలు.
ఇదీ చదవండి: సీఎం చేతుల మీదుగా గోల్డ్ మెడల్.. టాటా కంపెనీలో అది ఈమెవల్లే సాధ్యమైంది!
2019-20 వరకు వార్షిక వేతనం..
నివేదికల ప్రకారం, 2008-09 నుంచి 2019-20 వరకు ముఖేష్ అంబానీ వేతనం రూ. 15 కోట్లు ఉండేది, ఆ తరువాత కరోనా మహమ్మారి సమయంలో జీతం తీసుకోవడం పూర్తిగా మానేసాడు. అందులోనూ 2021లో అయన ఏ మాత్రం జీతం తీసుకోకపోవడం గమనార్హం. జీతం మాత్రమే కాకుండా 2021 నుంచి 2023 వరకు ఎలాంటి అలవెన్సులు తీసుకోలేదని తెలుస్తోంది. ఆ తరువాత శాలరీ అస్సలు తీసుకోనని బోర్డుకి రిక్వెస్ట్ చేసినట్లు.. అదే ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: ఎంతమంది ఉద్యోగాలు పోయినా వీరు చాలా సేఫ్.. జీతాలు కోట్లలో!
ఇతర అలవెన్సులు..
దిగ్గజ కంపెనీ అయిన రిలయన్స్ సంస్థకు అధినేతగా ఉన్నా.. జీతం తీసుకోకున్నా. ఆయనకు కొన్ని ప్రత్యేకమైన అలవెన్సులు ఉంటాయి. ఇందులో ట్రావెలింగ్, బిజినెస్ ట్రిప్స్, ఫోన్ బిల్స్ వంటి వాటితో పాటు తన కుటుంబానికి అయ్యే భద్రతా ఖర్చు కూడా కంపెనీ భరించనుంది.
Comments
Please login to add a commentAdd a comment