chirman
-
అదృష్టం ఎవరిని వరిస్తోంది.. ఎస్బీఐ ఛైర్మన్ పదవి కోసం పోటీ
ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ తదుపరి ఛైర్మన్ ఎవరు అనేది ప్రస్తుతం చర్చానీయాంశంగా మారింది. ఎస్బీఐ ఛైర్మన్ దినేష్ ఖరా ఈ ఆగస్టు 28న పదవీ విరమణ చేయనున్నారు. అదే రోజు కొత్త ఎస్బీఐ చైర్మన్ బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది.పలు నివేదికల ప్రకారం.. ఎస్బీఐ ఛైర్మన్ పదవికి పేరును సిఫారసు చేసేందుకు గాను కేంద్ర ప్రభుత్వంలోని స్వయం ప్రతిపత్త సంస్థ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇనిస్టిట్యూషన్స్ బ్యూరో (FSIB) మే 21న పాత్ర కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. అదే రోజు తుది నిర్ణయం ప్రకటిస్తారు.దినేష్ ఖరా రిటైర్మెంట్ తర్వాత ఆయన భర్తీ చేసేందుకు ముగ్గురు ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్లు సీఎస్ శెట్టీ, అశ్విని కుమార్ తివారీ, వినయ్ ఎం టోన్సే పోటీపడుతున్నట్లు సమాచారం. మరి ఈ ముగ్గురిలో ఎవరికి ఎస్బీఐ ఛైర్మన్ పదవి వరిస్తుంది మరికొద్ది రోజుల్లో తేలనుంది. -
ముఖేష్ అంబానీ వేతనం ఎంతో తెలుసా? మరో ఐదేళ్లూ అదే జీతం!
Mukesh Ambani Salary Details: భారతదేశంలో అత్యంత సంపన్నుడెవరు అంటే అందరూ ఏకకంఠంతో చెప్పే మాట 'ముఖేష్ అంబానీ' (Mukhes Ambani) అని, కావున ఇందులో ప్రస్తుతానికి ఎటువంటి సందేహం లేదు. అయితే ఈయన వార్షిక వేతనం ఎంత? ఇతర సౌకర్యాలు ఏవి ఉంటాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రిలయన్స్ సంస్థకు చైర్మన్‌గా కొనసాగుతున్న 'ముఖేష్ అంబానీ' పదవీకాలం మరో ఐదేళ్లు కొనసాగటానికి వాటాదార్ల ఆమోదం కోరుతున్నట్లు సమాచారం. నిజానికి 224 ఏప్రిల్ 19 నాటికి ఆయన పదవి కాలం పూర్తవుతుంది. మరో ఐదేళ్లు పొడిగిస్తే పదవి 2029 వరకు కొనసాగుతుంది. ఆరు పదుల వయసులో కూడా అపర చాణక్యుడుగా కంపెనీ అభివృద్ధికి పాటుపడుతున్న ఈయన 2022లో ధీరూభాయ్ అంబానీ మరణానంతరం చైర్మన్ పదవి పొందారు. ఇప్పటి వరకు అది అలాగే కొనసాగుతూ ఉంది. 2022 నుంచి ఎన్నోన్నో కొత్త ఆలోచనలతో కంపెనీని అత్యన్నత శిఖరాలకు తీసుకెళ్లాడు. ఈ కారణంగా మరో ఐదేళ్లు కంపెనీకి చైర్మన్‌గా నిర్వర్తించనున్నారు. అయితే ఈ సమయంలో ఆయన వార్షిక వేతనం శూన్యం అని తెలుస్తోంది. అంటే మరో ఐదేళ్ల కాలం పాటు ఆయన జీతం సున్నా రూపాయలు. ఇదీ చదవండి: సీఎం చేతుల మీదుగా గోల్డ్ మెడల్.. టాటా కంపెనీలో అది ఈమెవల్లే సాధ్యమైంది! 2019-20 వరకు వార్షిక వేతనం.. నివేదికల ప్రకారం, 2008-09 నుంచి 2019-20 వరకు ముఖేష్ అంబానీ వేతనం రూ. 15 కోట్లు ఉండేది, ఆ తరువాత కరోనా మహమ్మారి సమయంలో జీతం తీసుకోవడం పూర్తిగా మానేసాడు. అందులోనూ 2021లో అయన ఏ మాత్రం జీతం తీసుకోకపోవడం గమనార్హం. జీతం మాత్రమే కాకుండా 2021 నుంచి 2023 వరకు ఎలాంటి అలవెన్సులు తీసుకోలేదని తెలుస్తోంది. ఆ తరువాత శాలరీ అస్సలు తీసుకోనని బోర్డుకి రిక్వెస్ట్ చేసినట్లు.. అదే ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఎంతమంది ఉద్యోగాలు పోయినా వీరు చాలా సేఫ్.. జీతాలు కోట్లలో! ఇతర అలవెన్సులు.. దిగ్గజ కంపెనీ అయిన రిలయన్స్ సంస్థకు అధినేతగా ఉన్నా.. జీతం తీసుకోకున్నా. ఆయనకు కొన్ని ప్రత్యేకమైన అలవెన్సులు ఉంటాయి. ఇందులో ట్రావెలింగ్, బిజినెస్ ట్రిప్స్, ఫోన్ బిల్స్ వంటి వాటితో పాటు తన కుటుంబానికి అయ్యే భద్రతా ఖర్చు కూడా కంపెనీ భరించనుంది. -
కొండపల్లి నగర పంచాయతీ చైర్మన్, వైస్ చైర్మన్ ఉత్కంఠకు తెర
సాక్షి, అమరావతి: కొండపల్లి చైర్మన్, వైస్ చైర్మన్‌కు సంబంధించిన ఎన్నికలను బుధవారం నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేయాలని హైకోర్టు సూచించింది. కేశినేని నాని తన ఓటుహక్కు వినియోగించుకోవచ్చన్న కోర్టు.. నాని ఓటు హక్కు కోర్టు తుది తీర్పుకు లోబడి ఉంటుందని తెలిపింది. అప్పటి వరకు ఫలితాలను ప్రకటించకూడదని హైకోర్టు స్పష్టం చేసింది.కాగా, హైకోర్టు ప్రతి సభ్యుడికి ప్రత్యేకంగా.. భద్రత ఏర్పాటు చేయాలని పోలీసు శాఖను ఆదేశించింది. -
పని చేస్తేనే పదవి ఉంటది!
సాక్షి, హైదరాబాద్: పనిచేస్తేనే పదవి ఉంటుంది.. బాధ్యతల నిర్వహణలో నిర్లక్ష్యం, ఉదాసీనత ప్రదర్శించినా, అధికార దుర్వినియోగానికి పాల్పడినా, దురుసుగా ప్రవర్తించినా సస్పెన్షన్‌కు గురికావడం లేదా పదవిని కోల్పోవాల్సి ఉంటుంది. మేయర్, చైర్పర్సన్, కార్పొరేటర్, కౌన్సిలర్ పదవులను ఇకపై అధికార దర్పం, దర్జా, పలుకుబడి కోసం వాడుకోవడానికి వీల్లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కొత్త మున్సిపల్ చట్టంలో కఠిన నిబంధనలు పొందుపరిచింది. రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. 120 మంది చైర్పర్సన్లు, 9 మంది మేయర్లు, 2,727 మంది కౌన్సిలర్లు, 385 కార్పొరేటర్లను ఎన్నుకోబోతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన వారు తమ అధికార, బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తేనే ఐదేళ్లు పదవిలో కొనసాగుతారు. ఏదైనా కారణాలతో అర్ధంతరంగా పదవి నుంచి తొలగింపునకు గురైతే .. మరో ఆరేళ్లు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధాన్ని ఎదుర్కో వాల్సిందే. కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం మేయర్లు/చైర్మన్లు, కార్పొరేటర్లు/కౌన్సిలర్లు తప్పనిసరిగా నిర్వహించాల్సిన బాధ్యతలు ఇవీ.. చైర్పర్సన్/మేయర్ బాధ్యతలు పట్టణం/నగరం పారిశుధ్యం, నీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ. నివాస, వాణిజ్య సముదాయాల నుంచి చెత్త సేకరణ. శాస్త్రీయ పద్ధతిలో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ. గ్రీన్ సెల్ ఏర్పాటు చేసి బడ్జెట్లో 10 శాతం నిధులను మొక్కల పెంపకం కోసం కేటాయింపు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ నిర్ణయించిన మున్సిపాలిటీలో నర్సరీలు ఏర్పాటు చేసి, మొక్కలు పెంచాలి. సొంత వార్డులో నాటిన మొక్కల్లో 85 శాతం బతికి ఉండేలా చర్యలు తీసుకోవాలి. పార్కుల అభివృద్ధి, చెరువుల పరిరక్షణ. ప్రభుత్వ భూములు, ఖాళీ స్థలాల పరిరక్షణ. ఏటా వార్షిక అకౌంట్ల ముగింపు, ఆడిటింగ్‌కు చర్య తీసుకోవాలి. పురపాలక ఆస్తుల అతిక్రమణల తొలగింపునకు చర్యలు తీసుకోవాలి. నీటి సరఫరా (అక్రమ నల్లాలు), వృథా నీటి ప్రవాహాన్ని నియంత్రించాలి. అవసరం ఉంటే తప్ప నీటి సరఫరా కోసం విద్యుత్ బోర్లు వాడరాదు. వర్షపు నీటి సంరక్షణతో పాటు ఈసీబీసీ ప్రమాణాలతో చల్లని పైకప్పు గల ఇంధన పొదుపు భవనాల నిర్మాణాన్ని ప్రోత్సహించాలి. మున్సిపల్ చట్టంలో నిర్దేశించిన అధికారాలు, బాధ్యతలతో పాటు ప్రభుత్వం ఆదేశించే ఇతర అధికారాలు, బాధ్యతలను సైతం నిర్వర్తించాలి. కౌన్సిల్ సమావేశం ముగిసిన 24 గంటల్లోగా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు(మినట్స్)పై సంతకం చేయాలి. నర్సరీ నిర్వహణ, మొక్కల పెరుగుదల బాధ్యత మేయర్/చైర్పర్సన్, కమిషనర్లది. నర్సరీల నిర్వహణ, మొక్కల పెంపకం తీరును పరిశీలించేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్స్‌తో ఆకస్మిక తనిఖీలు నిర్వ హించే అధికారాన్ని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. వార్డు సభ్యుల బాధ్యతలు.. వార్డులో పారిశుధ్యం, నీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ. ఇంటింటి నుంచి చెత్త సేకరణ. శాస్త్రీయ పద్ధతిలో ఘన వ్యర్థాల నిర్వహణ. చెరువుల పరిరక్షణ. నీటి సరఫరా (అక్రమ నల్లాలు), వృథా నీటి ప్రవాహాన్ని(పైపులైన్ల లీకేజీతో) నియంత్రించాలి. అవసరం ఉంటేతప్ప నీటి సరఫరా కోసం విద్యుత్ బోర్లను వాడరాదు. మున్సిపల్ గ్రీన్ యాక్షన్ ప్లాన్ ప్రకారం తమ వార్డులో మొక్కలు నాటడం, వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలి. పట్టణాభివృద్ధిపై శిక్షణ తీసుకోవాలి. నాటిన మొక్కల్లో 85 శాతం బతికి ఉండేలా చూడాలి. నిర్లక్ష్యం, ఉదాసీనత కారణంగా ఈ శాతానికి మొక్కలు తగ్గితే వార్డు సభ్యుడిని అనర్హుడిగా ప్రకటిస్తారు. ఈ విషయంలో ప్రత్యేకాధికారి విఫలమైనా ఉద్యోగం నుంచి తొలగిస్తారు. నిర్లక్ష్యం వహిస్తే తొలగింపే.. మున్సిపల్ చట్టం నిబంధనలు, ఇతర నియమాలు, ప్రభుత్వ ఉత్తర్వులను అమలుపరిచేందుకు నిరాకరించినా/ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినా, అధికార దుర్వినియోగానికి పాల్పడినా బాధ్యతలు, కర్తవ్యం నిర్వహణలో విఫలమైనా మున్సిపల్ చట్టం ప్రకారం పురపాలన సక్రమంగా నిర్వహించేందుకు ప్రభుత్వం/ప్రభుత్వం నియమించిన ఇతర ఏ అధికారి జారీ చేసిన ఉత్తర్వుల అమలుకు నిరాకరించినా విధి నిర్వహణలో దుష్ప్రవర్తన కలిగి ఉన్నా.. మున్సిపల్ నిధులను దుర్వినియోగపరిచినా.. పురపాలికల బాధ్యతల నిర్వహణలో తరచూ విఫలమైనా, తన బాధ్యతలను విస్మరిస్తూ అసమర్థుడిగా తయారైనా.. ప్రభుత్వం నిబంధనల ప్రకారం వారిని పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులిస్తుంది. తొలగించడానికి ముందు సంజాయిషీ ఇచ్చుకోవడానికి అవకాశమిస్తుంది. అనర్హత పడితే మరో 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు కానున్నారు. దాడులు చేస్తే సస్పెన్షన్.. పురపాలికల అధికారులు, ఉద్యోగుల పట్ల స్థానిక కౌన్సిలర్లు, చైర్పర్సన్లు దురుసుగా ప్రవర్తించడం, దూషణలకు దిగడం, కొన్ని సందర్భాల్లో భౌతికదాడులకు పాల్పడడం వంటి ఘటనలు గతంలో చాలా చోట్ల జరిగాయి. ఇకపై ఇలాంటి ఘటనలకు పాల్పడితే పదవి కోల్పోవాల్సిందే. ఉద్దేశపూర్వకంగా అమర్యాదగా ప్రవర్తించినా, తోటి సభ్యుడు/ఉద్యోగిపై చేయి చేసుకున్నా, ఆస్తి ధ్వంసం చేసినా, అసభ్య పదజాలం వాడినా, మున్సిపల్ సమావేశాన్ని ఆటంకపరిచినా, పురపాలిక ఆర్థిక సుస్థిరకు నష్టం కలిగించేలా అధికార దుర్వినియోగానికి పాల్పడినా సదరు చైర్పర్సన్/ వైస్‌చైర్‌పర్సన్/ వార్డు సభ్యుడిని సస్పెండ్ చేస్తూ గెజిట్ నోటీసు జారీ చేస్తుంది. ప్రభుత్వం, జిల్లా కలెక్టర్లు తమంతట కానీ, కౌన్సిలర్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కమిషనర్, ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గానీ జిల్లా కలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకోనున్నారు. సస్పెన్షన్ విధిస్తే 30 రోజుల్లోగా మున్సిపల్ ట్రిబ్యునల్‌లో అప్పీల్ చేసుకోవచ్చు. -
డాబర్ ఇండియాకు కొత్త చైర్మన్
సాక్షి, ముంబై: ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీ డాబర్ ఇండియ చైర్మన్‌గా అమిత్ బర్మన్ ఎంపికయ్యారు. ఇప్పటిదాకా ఈ పదవిలో ఉన్న ఆనంద్ బర్మన్ ఇటీవల రాజీనామా చేయడంతో ఈ కొత్త నియామకం జరిగింది. మరో వారసుడు మోహిత్ బర్మన్ వైస్ చైర్మన్‌గా నియమితులయ్యారు. దీంతో రూ. 8500 కోట్లకు పైగా వార్షిక ఆదాయాన్ని కలిగిన దేశంలోని పురాతన వినియోగ వస్తువుల కంపెనీ పగ్గాలు తరువాతి తరం చేతుల్లోకి మారాయి. మరోవైపు సీఈవో పదవినుంచి తప్పుకున్న సునీల్ దుగ్గల్ శుక్రవారం బోర్డునకు కూడా రాజీనామా చేశారు. ఈ ఏడాది జనవరిలో మోహిత్ మల్హోత్రాను సీఈవోగా నియమించింది వ్యవస్థాపక బర్మన్ కుటుంబంనుంచి ఐదవతరం సభ్యుడైన అమిత్ బర్మన్(50) డాబర్‌లో అతి పిన్న వయస్కుడైన ఛైర్మన్‌గా నిలిచారు. ఇప్పటివరకు ఈయన కంపెనీ వైస్ చైర్మన్‌గా ఉన్నారు. డాబర్ ఫుడ్స్ పేరుతో సంస్థను స్థాపించిన అమిత్ 12 ఏళ్ల తరువాత దీన్ని మాతృసంస్థ డాబర్ ఇండియలో విలీనం చేశారు. వైస్ ఛైర్మన్‌గా నియమితులైన మోహిత్ ప్రస్తుతంఎలిఫెంట్ క్యాపిటల్(లండన్ స్టాక్ఎక్స్ఛేంజ్-లిస్టెడ్) మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు, జీవిత బీమా, సాధారణ భీమా, ఎసెట్ మేనేజ్మెంట్, రిటైల్ స్పోర్ట్స్ సహా డాబర్ ఫ్యామిలీకి చెందిన పెట్టుబడులకు నేతృత్వం వహిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా అవివా లైఫ్ ఇన్సూరెన్స్, యూనివర్సల్ సైమన్ జనరల్ ఇన్సూరెన్స్, ఐపీఎల్ టీం కింగ్స్ఎలెవన్ పంజాబ్ తదితరాలున్నాయి. అలాగే ఆనంద్బర్మన్ కుమారుడు ఆదిత్య డాబర్ ఇండియాలో నాన్-ఎగ్జిక్యూటివ్ అడిషనల్ డైరెక్టర్‌గా కంపెనీలో చేరనున్నారు. కాగా సహజ ఉత్పత్తుల విక్రయం పేరుతో 1884లో డా.ఎస్.కె. బర్మన్ డాబర్ కంపెనీని స్థాపించారు. ప్రస్తుతం వాటికా షాంపూ, ఫెమ్ స్కిన్‌కేర్, రెడ్ టూత్ పేస్టు, ఓడోనిల్ ఎయిర్ ఫ్రెషనర్స్, రియల్ జ్యూస్, హోం మేడ్ కుకింగ్ పేస్టులతో సహా అనేక ప్యాకేజీ బ్రాండ్లను విక్రయిస్తున్నసంగతి తెలిసిందే. -
జే అండ్ కే బ్యాంకులో భారీ అక్రమాలు
శ్రీనగర్: జమ్ము అండ్ కాశ్మీర్ బ్యాంక్‌లో కోట్ల రూపాయల అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. అవినీతి ఆరోపణలతో జే అండ్కే బ్యాంక్ ఎండీ, చైర్మన్ పర్వేజ్ అహ్మద్ నెంగ్రో ప్రభుత్వం తప్పించిన అనంతరం షాకింగ్ విషయాలను దర్యాప్తు సంస్థలు కనుగొన్నాయి. నిబంధనలను విరుద్ధంగా అక్రమ రుణాలు మంజూరు, అనేక నకిలీ ఒప్పందాలు, బంధువులకు అక్రమ నియామకాలు తదితర అక్రమాలను అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి 300కు పైగా ఫైళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ నియామకాలు, అక్రమ రుణాలు : పీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఇమ్రాన్ అఫ్తాబ్ అన్సారీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ చీఫ్ సజ్జాద్ సిఫారసు మేరకు అక్రమ రుణాలను మంజూరు చేసినట్టు ఏసీబీ ఆరోపిస్తోంది. వందలాది బ్యాంకు శాఖల పునర్నిర్మాణం కోసం రూ. 50 లక్షల నుంచి రూ.1.5 కోట్లు కేటాయించినట్టు రికార్డుల్లో చూపారు. కానీ అసలు ఇందులో కేవలం 30శాతం మాత్రమేనట. అలాగే రాయల్ స్ర్పింగ్ గోల్డ్ కోర్స్ సుందరీకీకరణకోసం ఏకంగా రూ. 8 కోట్లను వెచ్చించినట్టు తెలుస్తోంది. పర్వేజ్ మన మేనల్లుడికి కీలక పదవిని కట్టబెట్టారు. కోడలు షాజియాను ప్రొబేషనరీ ఆఫీసర్‌గా నియమించారు. ప్రస్తుతం ఈమె హజరత్ బాల్ బ్రాంచ్‌కు మేనేజర్‌గా ఉన్నారు. ఏసీబీ షాక్ : జమ్ము కాశ్మీర్ బ్యాంక్ చైర్మన్ పర్వేజ్ అహ్మద్‌ను తొలగించిన కొన్ని నిమిషాలలోనే ఆ బ్యాంక్ ప్రధాన కార్యాయలయంపై రాష్ట్ర విజిలెన్స్ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. గతంలో పిడిపి-బిజెపి కూటమి ప్రభుత్వ హయాంలో రాజకీయ నేతల ప్రమేయంతో ఫర్వేజ్ సుమారు 1,200 మందిని ఉద్యోగాలలో నియ మించినట్లు ఆరోపణలు వెల్లువెత్తడంపై అధికారులు ఈ దాడులు నిర్వహించారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినట్లు యాంటీ కరెప్షన్ బ్యూరో(ఏసీబీ) అధికారులు పర్వేజ్ అహ్మద్‌పై కేసు నమోదు చేశారు. అలాగే బ్యాంక్ మధ్యంతర చైర్మన్, ఎండీగా ఆర్కే చిబ్బర్‌ను ప్రభుత్వం ఎంపిక చేసినట్లు జేఅండ్‌కే బ్యాంక్ బీఎస్ఈకి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ వార్తల నేపథ్యంలో సోమవారం జే అండ్కే బ్యాంక్ షేరు 22 శాతం పతనమైంది. ఒమర్, మెహబూబా స్పందన: అటు కేంద్ర ప్రభుత్వ చర్యపై నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా, కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ స్పందించారు. అవినీతికి, అక్రమాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాల్సిందే. కానీ బ్యాంకుల్లో రాజకీయాలకు తావులేకుండా అడ్మినిస్ట్రేషన్ జాగ్రత్త పడాలని ట్వీట్ చేశారు ఛైర్మన్‌ను తొలగించడం విచారకరమని మాజీ సీఎం ట్వీట్ చేశారు. అవినీతిని అడ్డుకునేందుకు ఇంతకంటే మంచి మార్గాలు చాలా వున్నాయని ఆమె పేర్కొన్నారు. -
రేమండ్ ఛైర్మన్‌గా వైదొలగిన గౌతం సింఘానియా
సాక్షి, ముంబై: రేమండ్ గ్రూప్‌నకు చెందిన రేమండ్ అప్పారెల్ లిమిటెడ్ ఛైర్మన్ గౌతం సింఘానియా రాజీనామా చేశారు. నిర్విక్ సింగ్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఎంపికయ్యారు. అలాగే గౌతం త్రివేదితోపాటు అంశు శారిన్ నాన్ ఎగ్జిక్యూటివ్‌గా డైరెక్టర్‌గా బోర్డులో జాయిన్ అయ్యారు. అయితే బోర్డులో సభ్యుడిగా గౌతం కొనసాగనున్నారు. కార్పొరేట్ గవర్నెన్స్‌లో అత్యుత్తమ విలువలకు తాను ప్రాధాన్యతనిస్తానంటూ నిర్విక్ సింగ్ ఎంపికపై గౌతం సంతోషం వ్యక్తం చేశారు. కాగా ఆస్తి మొత్తం లాక్కుని తండ్రి , రేమాండ్ వ్యవస్థాపకుడు విజయ్‌పథ్‌ని బైటికి గెంటేసిన ఆరోపణలను గౌతం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ వివాదం సుప్రీం దాకా వెళ్లింది. అయితే ఇరుపార్టీలు పరస్పరం చర్చించుకొని వివాదాన్ని పరిష్కరించుకోవాలని ధర్మాసనం కోరింది. -
హైకోర్టులో హైడ్రామా: అగ్రిగోల్డ్ నిందితులపై దాడి
ముదుపు పేరుతో లక్షల మందికి టోకారా ఇచ్చి, వేల కోట్లు ఎగవేసిన అగ్రిగోల్డ్ సంస్థ యజమానులపై బాధితులు దాడిచేశారు. కేసు విచారణ నిమిత్తం నిందితులను సోమవారం బెంగళూరులోని కర్ణాటక హైకోర్టుకు పోలీసులు తీసుకొచ్చారు. తమ రెక్కల కష్టాన్ని దోచుకున్నారంటూ కోర్టు ఆవరణలో ఆందోళనకు దిగిన బాధితులు.. ఒక్కసారిగా అగ్రిగోల్డ్ యజమానులపై విరుచుకుపడ్డారు. సంస్థ చైర్మన్ అవ్వాసు వెంకటరామారావు, ఆయన సోదరుడు శేషునారాయణతోపాటు మరో ముగ్గురు డైరెక్టర్లపై బాధితులు చెప్పులు, రాళ్లతో దాడిచేశారు. దీంతో హైకోర్టు ఆవరణ రణరంగాన్ని తలపించింది. బాధితులు వందల సంఖ్యలో గుమ్మికూడటంతో పోలీసులు కూడా పరిస్థితిని అదుపుచేయలేకపోయారు. అతికష్టం మీద నిదితులను సరక్షిత ప్రాంతానికి తరలించగలిగారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతోపాటు కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలోనూ అగ్రిగోల్డ్ సంస్థ ముదుపుదారులకు కుచ్చుటోపీ పెట్టింది. ఇదే విషయమై కర్ణాటకలోనూ పలు కేసులు నమోదయ్యాయి. అగ్రిగోల్డ్ నిందితులను కర్ణాటక సీఐడీ పోలీసులు పది రోజుల కిందటే నెల్లూరు జిల్లా నుంచి కర్ణాటకకు తరలించి అక్కడ విచార్తిస్తున్నారు. అయితే ఇదే కేసుపై హైదరాబాద్ హైకోర్టులో సమగ్ర విచారణ జరుతున్న నేపథ్యంలో కర్ణాటక సీఐడీ విచారణను నిలిపివేయాలంటూ ఆ రాష్ట్ర హైకోర్టు స్టే ఇచ్చింది. నిందితులైన అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని కర్ణాటక హైకోర్టులో హాజరుపరిచిన పోలీసులు.. జడ్జి ఆదేశానుసారం వారిని హైదరాబాద్ కోర్టుకు తరలించేందుకు వాహన ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ఈ దాడి చోటుచేసుకుంది. బాధితుల దాడిలో పలువురు లాయర్లకు కూడా గాయాలయ్యాయి. -
'ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు'