ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ తదుపరి ఛైర్మన్ ఎవరు అనేది ప్రస్తుతం చర్చానీయాంశంగా మారింది. ఎస్‌బీఐ ఛైర్మన్ దినేష్ ఖరా ఈ ఆగస్టు 28న పదవీ విరమణ చేయనున్నారు. అదే రోజు కొత్త ఎస్‌బీఐ చైర్మన్ బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది.
పలు నివేదికల ప్రకారం.. ఎస్‌బీఐ ఛైర్మన్ పదవికి పేరును సిఫారసు చేసేందుకు గాను కేంద్ర ప్రభుత్వంలోని స్వయం ప్రతిపత్త సంస్థ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇనిస్టిట్యూషన్స్ బ్యూరో (FSIB) మే 21న పాత్ర కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. అదే రోజు తుది నిర్ణయం ప్రకటిస్తారు.
దినేష్ ఖరా రిటైర్మెంట్ తర్వాత ఆయన భర్తీ చేసేందుకు ముగ్గురు ఎస్‌బీఐ మేనేజింగ్ డైరెక్టర్లు సీఎస్ శెట్టీ, అశ్విని కుమార్ తివారీ, వినయ్ ఎం టోన్సే పోటీపడుతున్నట్లు సమాచారం. మరి ఈ ముగ్గురిలో ఎవరికి ఎస్‌బీఐ ఛైర్మన్ పదవి వరిస్తుంది మరికొద్ది రోజుల్లో తేలనుంది.
Comments
Please login to add a commentAdd a comment