
సాక్షి, అమరావతి: కొండపల్లి చైర్మన్, వైస్ చైర్మన్‌కు సంబంధించిన ఎన్నికలను బుధవారం నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేయాలని హైకోర్టు సూచించింది. కేశినేని నాని తన ఓటుహక్కు వినియోగించుకోవచ్చన్న కోర్టు.. నాని ఓటు హక్కు కోర్టు తుది తీర్పుకు లోబడి ఉంటుందని తెలిపింది. అప్పటి వరకు ఫలితాలను ప్రకటించకూడదని హైకోర్టు స్పష్టం చేసింది.కాగా, హైకోర్టు ప్రతి సభ్యుడికి ప్రత్యేకంగా.. భద్రత ఏర్పాటు చేయాలని పోలీసు శాఖను ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment