హైదరాబాద్: హైదరాబాద్లో వ్యాపారస్థుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. నార్సింగ్ పోలీసులు రెస్క్యూ చేసి దుండగుల నుంచి వ్యాపారి రమేశ్ చంద్ అగర్వాల్ను కాపాడారు. వివరాలు.. అల్కాపూర్ వద్ద రెండు కార్లలో వచ్చిన దుండగులు కత్తులతో దాడి చేసి వ్యాపారి రమేశ్ కుమార్ అగర్వాల్ను కిడ్నాప్ చేశారు.
ఈ సంఘటనలో రమేశ్తో ఉన్న మరో వ్యాపారి ప్రమోద్కు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ప్రమోద్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో ప్రమోద్కు చికిత్స అందిస్తున్నారు. వ్యాపారి రమేశ్ చంద్ అగర్వాల్ కుమారుడు ఫిర్యాదుతో నార్సింగ్ పోలీసులు దుండగులను పట్టుకున్నారు.