ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా మరణం పట్ల సూపర్ స్టార్ రజినీకాంత్ సంతాపం వ్యక్తం చేశారు. తన విజన్, అభిరుచితో మనదేశాన్ని ప్రపంచపటంలో నిలిపారని కొనియాడారు. దేశంలోని వేలాది మంది పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిగా నిలిచారని ఆయనతో ఉన్న క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఎన్నో తరాలుగా లక్షలాది ఉద్యోగాలు సృష్టించిన వ్యక్తిని కోల్పోవడం తీరని లోటన్నారు. ఈ మేరకు ఆయనతో ఉన్న ఫోటోను రజినీకాంత్ ట్వీట్ చేశారు.
రజినీకాంత్ తన ట్వీట్‌లో.. 'తన విజన్, అభిరుచితో భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలిచారు. వేలాది మంది పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తినిచ్చి, ఎన్నో తరాలుగా లక్షలాది ఉద్యోగాలు సృష్టించిన వ్యక్తి. అందరి అభిమానం, గౌరవం పొందిన వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తితో గడిపిన ప్రతి క్షణాన్ని నేను ఎప్పటికీ గౌరవిస్తాను. భారతదేశానికి నిజమైన కుమారుడు ఇక లేడు. .. మీ ఆత్మకు శాంతి కలగాలి' అంటూ పోస్ట్ చేశారు.
కాగా.. బిజినెస్ టైకూన్, టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా (86) కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.
A great legendary icon who put India on the global map with his vision and passion ..
The man who inspired thousands of industrialist ..
The man who created lakhs and lakhs of jobs for many generations ..
The man who was loved and respected by all ..
My deepest salutations to… pic.twitter.com/S3yG1G7QtK— Rajinikanth (@rajinikanth) October 10, 2024
Comments
Please login to add a commentAdd a comment