ప్రతి నిమిషం అడిగింది నీ విజయం | Young Startup Founders Failure Stories | Sakshi
Sakshi News home page

ప్రతి నిమిషం అడిగింది నీ విజయం

Published Wed, Oct 21 2020 11:22 AM | Last Updated on Wed, Oct 21 2020 11:22 AM

Young Startup Founders Failure Stories - Sakshi

ఈరోజు ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ జయంతి. ఆ మహానుభావుడి మాటలతోనే స్టోరీలోకి వెళదాం. ‘నాకు వేలాది ఐడియాలు వస్తుంటాయి. అందులో ఏ ఒక్కటో మంచిది కావచ్చు. సక్సెస్‌ కావచ్చు. ఇంతకు మించిన సంతృప్తి ఏం ఉంటుంది!’
‘సంతృప్తిని మించిన సంపద లేదు’ హైదరాబాద్‌కు చెందిన ఇరవై ఎనిమిది సంవత్సరాల రాజ్‌కుమార్‌ స్నేహితులతో కలిసి ‘అగ్రి స్టార్టప్‌’ ఒకటి  మొదలెడదామని రంగంలోకి దిగాడు. అది సక్సెస్‌ కాలేదు. ఇక అంతే...‘స్టార్టప్‌’ అనే మాట వినబడగానే బెదిరిపోతాడు. స్టార్టప్‌ సక్సెస్‌ కావాలంటే రాసి పెట్టుండాలి అని  వేదాంతం కూడా పోతుంటాడు. ఇలాంటి రాజ్‌కుమార్లు మీ ఊళ్లోనూ ఉండొచ్చు. కొంతకాలం క్రితం కేరళలోని రేవు పట్టణమైన కొచ్చిలోని ‘ది కిచెన్‌’ అనే స్వచ్ఛందసంస్థకు  ఒక వినూత్నమైన ఆలోచన వచ్చింది. అదే ఫెయిల్యూర్‌ ల్యాబ్‌!

సక్సెస్‌ స్టోరీలు వినడానికి చూపించే ఉత్సాహం ఫెయిల్యూర్‌స్టోరీల దగ్గరికి రాగానే నీరుగారిపోతుంది. నిజానికి సక్సెస్‌ కోరుకునే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఫెయిల్యూర్‌ స్టోరీలు వినాల్సిందే. అనుభవాన్ని మించిన పాఠం ఏముంటుంది! ‘నేను మొదలు పెట్టిన రెండు వెంచర్లు ఫెయిలయ్యాయి. థర్డ్‌ వెంచర్‌ సాల్ట్‌ మ్యాంగో ట్రీ, ఫోర్త్‌ వెంచర్‌ ప్లింగ్‌ మాత్రమే క్లిక్‌ అయ్యాయి’ అంటాడు ‘ది కిచెన్‌’ స్థాపకుడు ఆండ్రిన్‌. కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ స్టార్టప్‌ మొదలుపెట్టాడు నీల్‌. ఫరవాలేదనిపించింది. అదే ఉత్సాహంతో మరో స్టార్టప్‌ మొదలుపెట్టాడు. కానీ ఇది తీవ్రమైన నిరాశను మిగిల్చింది. ఏడు నెలల తరువాత ఈ స్టారప్‌కు చెల్లుచీటి ఇచ్చాడు. అంతమాత్రానా చేతులు దులుపుకోలేదు. ‘ఎక్కడ పొరపాటు జరిగింది’ అని విశ్లేషించుకున్నాడు. ‘చాలామంది స్టార్టప్‌ ఓనర్లు ఈ పని చేయడం లేదు’ అంటాడు నీల్‌.

‘అగ్రో బిజినెస్‌’ స్టార్టప్‌ మొదలుపెట్టిన రఫీక్‌ మొదట నష్టాల పాలయ్యాడు. తరువాత లోపాలను సవరించుకొని వ్యాపారాన్ని లాభాల బాట పట్టించాడు. వీరు మాత్రమే కాదు...ముఖేష్‌దేవ్, జేమ్ప్, జోఫిన్‌ జోసెఫ్, రికీ జాకబ్‌...మొదలైన స్టార్టప్‌ ఓనర్లు తమ విలువైన అనుభవాలను ఈ ఫెయిల్యూర్‌ ల్యాబ్‌లో పంచుకున్నారు.
‘ఐడియాలు రావడం సులభమే కావచ్చు. కాని వాటిని ఫలవంతం చేయడం అంత సులభమైన విషయమేమీ కాదు’ అంటున్నాడు జీన్‌ పాల్‌.

బిజినెస్‌ స్ట్రాటజిస్ట్, మోటివేషనల్‌ కోచ్‌గా గుర్తింపు సంపాదించిన జీన్‌పాల్‌ రాసిన ‘ఫ్రమ్‌ ఐడియా టూ రియాల్టీ’ పుస్తకం బాగా పాప్‌లర్‌ అయింది. ది ఎసెన్షియల్స్‌ ఆఫ్‌ బిల్డింగ్‌ ఏ బిజినెస్, ఇట్‌ స్టార్స్‌ విత్‌ పాషన్‌ అండ్‌ పర్సస్, సెల్ఫ్‌ అవేర్‌నెస్‌: అండర్‌స్టాండింగ్‌ వాట్‌ డ్రైవ్స్‌ అండ్‌ సస్టెన్‌ యూ, బిల్డింగ్‌ యువర్‌ డ్రీమ్‌ టీమ్‌ అండ్‌ బిజినెస్, వై ది వరల్డ్‌ అండ్‌ యువర్‌ బిజినెస్‌ నీడ్‌ ఏ మోర్‌ పాషనెట్‌ యూ, యువర్‌ పాషన్‌ అండ్‌ పర్పస్‌ విల్‌ కీప్‌ యూ హెల్తీయర్‌ అండ్‌ హ్యాపియర్, వై యువర్‌ స్టోరీ మ్యాటర్స్, డిఫైనింగ్‌ యువర్‌ బిజినెస్‌ మోడల్, గ్రోయింగ్‌ యువర్‌ పర్పస్, పాషన్‌ అండ్‌ బిజినెస్‌...వీటిని చాప్టర్లు అనడం కంటే విజయానికి మెట్లు అంటే సరిపోతుంది.

ఆకాశంలోకి దూసుకుపోవాలంటే రాకెట్‌ తయారుచేయగానే సరిపోదు. అందులో ఇంధనం అనివార్యంగా ఉండాలి. ఆ ఇంధనమే ఇన్‌స్పిరేషన్‌. ఇది అందించడానికి ‘ఫ్రమ్‌ ఐడియా టు రియాల్టీ’తో పాటు చూజ్‌ (ది సింగిల్‌ మోస్ట్‌ ఇంపార్టెంట్‌ డెసిషన్‌ బిఫోర్‌ స్టార్టింగ్‌ యువర్‌ బిజినెస్‌)–రెయాన్‌ లివెస్క్, వాట్‌ ఐ విష్‌ వెన్‌ ఐ వాజ్‌ 20–టినా సిలెగ్, ది ఎంటర్‌ప్రెన్యూర్‌ (రోలర్‌ కోస్టర్‌)–డారెన్‌ హార్టి, వాట్‌ ఇట్‌ టేక్స్‌ (హౌ ఐ బిల్డ్‌ ఏ 100 మిలియన్‌ డాలర్స్‌ బిజినెస్‌ అగేనెస్ట్‌ వోడ్స్‌ )–మోయ జోన్స్, స్టార్టింగ్‌ ఏ బిజినెస్‌ (లాంచింగ్‌ ఏ సక్సెస్‌ఫుల్‌ స్మాల్‌ బిజినెస్‌)–కెన్‌ కోల్వెల్‌.....ఇలా ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. పుస్తకం హస్తభూషణం మాత్రమే కాదు... ఆత్మవిశ్వాసం పెంచే ఆయుధం కూడా! ఇక ఆలస్యం ఎందుకు పదండి...ఫెయిల్యూర్‌ ల్యాబ్స్‌ నుంచి పాఠాలు నేర్చుకొని గెలుపు జెండా ఎగరేయడానికి.        

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement