స్టార్టప్(Startup)లకు ప్రభుత్వం అద్భుత మద్దతు ఇస్తోందని వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. పెట్టుబడుల విషయంలో ఈ సంస్థల సామర్థ్యాలను, విలువను దేశీయ ఇన్వెస్టర్లు గుర్తించారని అన్నారు. తొమ్మిదేళ్లలో భారతీయ స్టార్టప్స్ సుమారు రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయని వెల్లడించారు. ఏటా సగటున 15 బిలియన్ డాలర్ల(రూ.1.24 లక్షల కోట్లు) నిధులు వెల్లువెత్తుతున్నాయన్నారు.
‘ఏటా సగటున 15 బిలియన్ డాలర్ల(రూ.1.24 లక్షల కోట్లు) నిధులు స్టార్టప్‌ల్లోకి వస్తున్నాయి. గరిష్టంగా ఇది 22–25 బిలియన్ డాలర్లను తాకుతోంది. ప్రభుత్వ ఆర్థిక సాయంతో సిడ్బీ నిర్వహిస్తున్న ఫండ్ ఆఫ్ ఫండ్స్ స్కీమ్ (FFS) వంటి నిధుల సాధనాలు ప్రైవేట్ మూలధనాన్ని సమీకరించడానికి ముఖ్యంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడానికి పరివర్తన సాధనంగా పనిచేస్తున్నాయి. ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ కూడా స్టార్టప్‌లను ఆలోచన నుండి కార్యరూపం దశ వరకు ప్రోత్సహించడానికి పని చేస్తున్నాయి. 2024లో 76 కంపెనీలు ఐపీవోకు వచ్చాయి. జనవరి 15 నాటికి 1,59,157 నమోదిత స్టార్టప్‌లతో భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌గా అవతరించింది. 2016లో దాదాపు ఈ సంఖ్య 500 మాత్రమే. పరిశ్రమ 17.2 లక్షల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు కల్పించింది’ అని మంత్రి వివరించారు. కాగా, భారత్ స్టార్టప్ చాలెంజ్‌ను మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు.
ఇదీ చదవండి: అమెరికా వృద్ధిలో కీలకంగా భారతీయులు
దేశీయంగా మెషీన్ల తయారీ
ఆటో విడిభాగాల పరిశ్రమలు తయారీ మెషీనరీలను దేశీయంగా తయారు చేసుకోవాలని గోయల్ సూచించారు. ఆటో పరికరాల తయారీలో వినియోగిస్తున్న మెషీన్లను దేశీయంగా రూపొందించుకోవాలని తద్వారా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని సలహా ఇచ్చారు. కొన్ని కంపెనీలు విడిభాగాలను దిగుమతి చేసుకుంటున్నాయని, ఇవి తదుపరి దశలో పోటీ నుంచి తప్పుకోవలసి వస్తుందని పేర్కొ న్నారు. భవిష్యత్‌లో దేశీ ప్రొడక్టులు దిగుమతులకు పోటీగా రూపొందుతాయని అంచనా వేశారు. ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నప్పటికీ కొన్ని కంపెనీలు ఇప్పటికే దిగుమతులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దిగుమతులపై ఆధారపడుతున్నాయన్నారు. దేశీయంగా అందుబాటు ధరలలో అధిక నాణ్యతగల ప్రెసిషన్ ఇంజినీరింగ్‌తో విడిభాగాలను తయారు చేయగలవని, దీంతో దిగుమతులపై ఆధారపడే సంస్థలకు మనుగడ కష్టంకాగలదని ఆటో విడిభాగాల ఎక్స్‌పో 2025 సందర్భంగా గోయల్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment