ముంబై: అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం బ్లాక్‌స్టోన్ తాజాగా ఇంటర్నేషనల్ జెమాలాజికల్ ఇనిస్టిట్యూట్ (ఐజీఐ)ని కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ 525 మిలియన్ డాలర్లని సంస్థ తెలిపింది. 80 శాతం వాటాను షాంఘై యుయువాన్ టూరిస్ట్ మార్ట్ (గ్రూప్) నుంచి, మిగతా మొత్తాన్ని ఐజీఐ వ్యవస్థాపక కుటుంబానికి చెందిన రోలాండ్ లోరీ నుంచి కొనుగోలు చేసినట్లు వివరించింది.
ఐజీఐ ప్రధాన కార్యాలయం బెల్జియంలోని యాంట్‌వెర్ప్‌లో ఉన్నప్పటికీ సంస్థ ఆదాయం, లాభాల్లో సింహ భాగం భారత్ నుంచే ఉంటోంది. ప్రపంచంలోనే అత్యధికంగా డైమండ్ పాలిషింగ్ భారత్‌లోనే జరుగుతుండటం ఇందుకు కారణం. వజ్రాలు, రత్నాలు, ఆభరణాలకు సర్టిఫికేషన్ సేవలను ఐజీఐ అందిస్తోంది. వివిధ దేశాల్లో 29 ల్యాబరేటరీలు (భారత్‌లో 18), 18 జెమాలజీ స్కూల్స్ నిర్వహిస్తోంది. కంపెనీ కార్యకలాపాలను మరింతగా విస్తరించడంపై దృష్టి పెట్టనున్నట్లు ఐజీఐ సీనియర్ ఎండీ ముకేష్ మెహతా తెలిపారు.
ఇదీ చదవండి: ట్రావెలింగ్ చేసేవారికి అలర్ట్! పెరుగుతున్న ఆన్‌లైన్ ట్రావెల్ స్కామ్‌లు
Comments
Please login to add a commentAdd a comment