IGI
-
బ్లాక్‌స్టోన్ చేతికి ఐజీఐ.. బెల్జియం డైమెండ్స్ సర్టిఫికేషన్ సంస్థ
ముంబై: అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం బ్లాక్‌స్టోన్ తాజాగా ఇంటర్నేషనల్ జెమాలాజికల్ ఇనిస్టిట్యూట్ (ఐజీఐ)ని కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ 525 మిలియన్ డాలర్లని సంస్థ తెలిపింది. 80 శాతం వాటాను షాంఘై యుయువాన్ టూరిస్ట్ మార్ట్ (గ్రూప్) నుంచి, మిగతా మొత్తాన్ని ఐజీఐ వ్యవస్థాపక కుటుంబానికి చెందిన రోలాండ్ లోరీ నుంచి కొనుగోలు చేసినట్లు వివరించింది. ఐజీఐ ప్రధాన కార్యాలయం బెల్జియంలోని యాంట్వెర్ప్లో ఉన్నప్పటికీ సంస్థ ఆదాయం, లాభాల్లో సింహ భాగం భారత్ నుంచే ఉంటోంది. ప్రపంచంలోనే అత్యధికంగా డైమండ్ పాలిషింగ్ భారత్‌లోనే జరుగుతుండటం ఇందుకు కారణం. వజ్రాలు, రత్నాలు, ఆభరణాలకు సర్టిఫికేషన్ సేవలను ఐజీఐ అందిస్తోంది. వివిధ దేశాల్లో 29 ల్యాబరేటరీలు (భారత్‌లో 18), 18 జెమాలజీ స్కూల్స్ నిర్వహిస్తోంది. కంపెనీ కార్యకలాపాలను మరింతగా విస్తరించడంపై దృష్టి పెట్టనున్నట్లు ఐజీఐ సీనియర్ ఎండీ ముకేష్ మెహతా తెలిపారు. ఇదీ చదవండి: ట్రావెలింగ్ చేసేవారికి అలర్ట్! పెరుగుతున్న ఆన్లైన్ ట్రావెల్ స్కామ్‌లు -
ఐజీఐలో ఆరోగ్య పరీక్షలు జరపాలి: బీజేపీ
న్యూఢిల్లీ: ఇందిరాగాంధీ విమానాశ్రయం (ఐజీఐ)లో దిగే ఆరోగ్య పరీక్షలు జరిగేవిధంగా చూడాలని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ... లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ను కోరారు. ఆఫ్రికాలో ఈ వ్యాధి విజృంభించిన నేపథ్యంలో తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరృకు ఆయన ఎల్జీకి ఓ లేఖ రాశారు. వర్షాకాలం అయినందువల్ల నగరవాసులకు అంటువ్యాధులు సోకకుండా తగు చర్యలు తీసుకోవాలంటూ ఆయా కార్పొరేషన్లను ఆదేశించాలని కూడా సదరు లేఖలో కోరారు. అన్ని ప్రాంతాల్లో ఫాగింగ్ చేయాలన్నారు. లేకపోతే నగరవాసులు అంటువ్యాధులబారినపడే ప్రమాదం పొంచి ఉందన్నారు. ఇదిలాఉంచితే ఎబోలా వ్యాధిబారినపడి నగరానికి వచ్చిన ముగ్గురు నైజీరియన్లకు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ రూం (ఎన్సీడీసీ)లో పరీక్షలు చేశారు. అనంతరం రాంమనోహర్ లోహియా (ఆర్ఎంఎల్) ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఎన్సీడీసీ పేర్కొంది. ఇదిలాఉండగా నైజీరియా వెళ్లి తిరిగి వచ్చిన 32 ఏళ్ల చత్తీస్‌గఢ్ వాసికి కూడా పరీక్షలు చేశామని సదరు ప్రకనటలో ఎన్సీడీసీ తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 2,127 మంది ఈ వ్యాధిబారినపడగా అందులో 1,145 మంది చ నిపోయారు. -
సేవల నాణ్యతలో ఐజీఐకి రెండో స్థానం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోని పెద్ద విమానాశ్రయాలలో ఒకటైన ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఐజీఐ) వరుసగా మూడవసారి సేవల నాణ్యతలో రెండవ స్థానాన్ని దక్కించుకుంది. సంవత్సరానికి 2.5 కోట్ల నుంచి 4 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే విమానాశ్రయాల శ్రేణిలో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ స్థానం దక్కింది. అయితే ప్రపంచంలోని అన్ని కేటగిరీలకు చెందిన 235 విమానాశ్రయాలతో పోల్చినప్పుడు సేవల నాణ్యతలో ఐజీఐకి ఆరవ స్థానం లభించింది. గత ఏడాది ఈ కేటగిరీలో ఐజీఐ నాలుగవ స్థానంలో నిలిచింది. సేవల నాణ్యతకు ప్రామాణికంగా నిర్ణయించిన 5 పాయింట్ల స్కేలుపై ఐజీఐకి 4.84 పాయింట్లు లభించాయి. విమానాశ్రయ సేవల నాణ్యతకు ఎయిర్‌పోర్టు కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) అందించిన అవార్డును ఇటీవల దక్షిణ కొరియాలోని సియోల్ నిర్వహించిన కార్యక్రమంలో ఐజీఐ స్వీకరించింది. డయల్, సీఐఎస్ఎఫ్ , ఢిల్లీ డ్యూటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎయిర్‌లైన్ ఆపరేటింగ్ కమిటీ, జెట్ ఎయిర్‌వేస్‌లకు చెందిన పది మంది ప్రతినిధుల బృందం ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఢిల్లీ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న డయల్ సీఈవో ఐ.ప్రభాకర రావు మాట్లాడుతూ..‘మూడేళ్లుగా వరుసగా ఈ అవార్డును ఏసీఐ నుంచి అందుకోవడం మాకు ఆనందంగా ఉంది. మా భాగస్వాములు, ఉద్యోగుల సమష్టి కృషితో ఇది సాధ్యమయ్యింది. మా కస్టమర్లకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా సేవలందించేందుకు మేం ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఈ సమయంలో ఏఎస్‌క్యూ నుంచి రెండోస్థానం పొందినట్లు అవార్డు రావడం మా బాధ్యతను మరింత పెంచినట్లయ్యింది..’ అని తెలిపారు. ప్రయాణికుల సంఖ్యను బట్టి ఏసీఐ విమానాశ్రయాలను 2-5 మిలియన్ పాసింజర్ల కేటగిరీ, 5-15 మిలియన్లు, 15-25 మిలియన్లు, 25-40 మిలియన్లు, 40 మిలియన్ల పై కేటగిరీలుగా విభజించి ర్యాంకులు అందచేసింది. ఏసీఐలో ప్రపంచంలో ఉన్న 174 దేశాల్లోని 1,751 విమానాశ్రయాలు సభ్యత్వంకలిగి ఉన్నాయి. ఇదిలా ఉండగాఏసీఐ ర్యాంకుల ర్యాంకుల ప్రకారం ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం ఐదవస్థానంలో నిలిచింది.