ప్రముఖ దేశీయ టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. హెచ్‌సీఎల్ సంస్థ మైక్రోసాఫ్ట్ న్యూస్ విభాగానికి చెందిన ప్రొడక్ట్‌పై వర్క్ చేస్తోంది. ఈ తరుణంలో ఆ ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్న 300 మంది ఉద్యోగుల్ని ఫైర్ చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
ప్రస్తుతం ఏ ప్రాజెక్ట్‌లపై వర్క్ చేస్తున్నాం. భవిష్యత్‌లో ఎలాంటి ప్రాజెక్ట్‌లపై వర్క్ చేయబోతున్నామనే అంశాలపై చర్చించేందుకు హెచ్‌సీఎల్ ఉద్యోగులతో టౌన్ హాల్ మీటింగ్ నిర్వహించింది. ఆ సమావేశంలో ఉద్యోగుల తొలగింపులపై ప్రకటన చేసినట్లు సమాచారం.
ఇక హెచ్‌సీఎల్ తొలగించిన ఉద్యోగులు భారత్, గ్వాటెమాల, ఫిలిప్పీన్స్ తో పాటు ఇతర దేశాలకు చెందిన ఉద్యోగులు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. ఉద్యోగులకు కంపెనీలో చివరి రోజైన సెప్టెంబర్ 30 నాటికి ప్రతి ఉద్యోగికి వేతనాన్ని అందించనున్నట్లు హెచ్‌సీఎల్ తెలిపిందని ఆ నివేదిక పేర్కొంది.
ఈ నేపథ్యంలో తొలగించిన ఉద్యోగులు మాట్లాడుతూ..మా సంస్థకు..మైక్రోసాఫ్ట్‌కు క్వాలిటీ ఆఫ్ వర్క్ విషయంలో విభేదాలు తలెత్తాయి. మేం భారత్,యూరప్,యూఎస్ వంటి దేశాల నుండి మైక్రోసాఫ్ట్ న్యూస్ ప్లాట్‌ఫారమ్ ఎంఎస్‌ఎన్ కోసం కంటెంట్‌ను పర్యవేక్షించడం, క్యూరేట్ చేయడం, సవరించడంలాంటి వర్క్స్ చేస్తుంటాం.అయితే ఇటీవల మైక్రోసాఫ్ట్ గ్లోబల్ న్యూస్ మానిటరింగ్ కోసం మైక్రోసాఫ్ట్ ఆటోమెషిన్‌ను వినియోగించడం ప్రారంభించింది. మేం వర్క్ చేయడానికి ముందు జర్మనీకి చెందిన హుబెర్ట్ బుర్దా మీడియా ఈ సైట్‌ను నిర్వహించేది. బింగ్‌లో ట్రెండింగ్, జియోపొలిటికల్ న్యూస్ క్యూరేషన్, కామెంట్ మోడరేషన్, టాబ్లాయిడ్ హిట్ యాప్‌లను పర్యవేక్షించేది' అని చెప్పారు.
హెచ్‌సీఎల్‌కు గుడ్‌బై
మైక్రోసాఫ్ట్- హెచ్‌సీఎల్ మధ్య కాంట్రాక్ట్ ముగిసిందని,ఆ కారణం చేతనే ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది. మైక్రోసాఫ్ట్ ఈ కాంట్రాక్ట్‌ను వేరే సంస్థకు అప్పగించాలని భావిస్తున్నట్లు..హెచ్‌సీఎల్‌ను కాదనుకొని యాక్సెంచర్‌కు తన ప్రాజెక్ట్ కట్టబెట్టాలని మైక్రోసాఫ్ట్ మంతనాలు నిర్వహిస్తుంది.
ఇతర టెక్ కంపెనీల బాటలో
హెచ్‌సీఎల్ సైతం ఇతర టెక్ కంపెనీల బాటలో చేరింది.ఇటీవల యాపిల్,మైక్రోసాఫ్ట్, నెట్‌ఫ్లిక్స్‌తో పాటు ఇతర టెక్ కంపెనీలు ఆర్థిక సంక్షోభం కారణంగా ఉద్యోగుల్ని, పలు విభాగాల్ని పూర్తి స్థాయిలో తొలగించింది. అదే సమయంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఉద్యోగులు 100 శాతం వర్క్ ప్రొడక్టవిటీపై దృష్టిసారించాలని కోరడం చర్చాంశనీయంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment