ఐర్లాండ్‌కు చెందిన ‘మరియానా కొబయాషి’కి లింక్డిన్‌లో పని చేయడం ఓ కల. పలు దిగ్గజ కంపెనీల్లో ఎన్నో తిరస్కరణల తర్వాత చివరికి 2022లో ఉద్యోగం సాధించింది. అదే కొబయాషి జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణాలలో ఒకటిగా నిలిచింది.
లింక్డిన్‌లో కోరుకున్న జాబ్.. సంతృప్తినిచ్చేలా జీతం. ఇంతకంటే ఇంకేం కావాలని అనుకుంది. హాయిగా ఉద్యోగం చేసుకుంటూ సంతోషంగా జీవిస్తుంది. కానీ గతేడాది ఆర్ధిక మాంద్యం భయాలు ఆమె ఉద్యోగానికి ఎసరు పెట్టాయి. చిన్న చిన్న స్టార్టప్స్ నుంచి అంతర్జాతీయ కంపెనీల వరకు లేఆఫ్స్ ప్రకటించాయి. ఈ తొలగింపుల్లో 2023 మేలో కోబయాషిని తొలగిస్తూ లింక్డిన్ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగం ఊడింది బ్రతుకు జీవుడా అంటూ ఇతర కంపెనీల్లో ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించింది.
ప్రతి చెడులో మంచి ఉందనే నానుడిని నిజం చేస్తూ..సరిగ్గా ఆరు నెలల తర్వాత గూగుల్ నుంచి ఓ మెయిల్ వచ్చింది. దాదాపు రెట్టింపు జీతంతో, ఉన్నత స్థాయిలో జాబ్ ఆఫర్ చేయడంతో ఎగిరి గంతేసినంత పనిచేసింది. ఈ నేపథ్యంలో లేఆఫ్స్ గురైన సందర్భంలో ఆమె మానసిక సంఘర్షణ ఎలా ఉందో చెబుతూ తన అనుభవాల్ని నెటిజన్లతో పంచుకుంది.
లింక్డిన్‌లో లేఆప్స్ సమయంలో తనకు ఎలా అనిపించిందో గుర్తు చేసుకుంటూ..‘ నేను అక్కడ చాలా సంతోషంగా ఉన్నాను. కానీ లేఆఫ్స్ నన్ను షాక్‌కి గురి చేశాయి. లింక్డిన్‌లో ఉద్యోగం సాధించడం ఓ కలగా భావించనందునే .. అందులో ఉద్యోగం వచ్చిన తర్వాత ఊహాలోకంలో విహరించాను. అదెంత తప్పో ఆ తర్వాతే తెలిసింది.
లేఆఫ్స్‌కు గురయ్యాను. నాకున్న వ్యాల్యుని ఉద్యోగంతో ముడిపెట్టకూడదని, లేదంటే ఎప్పుడూ సంస్థల్ని నమ్ముకుని ఉండొద్దనే అనుభవం నాకు నేర్పించింది. తొలగింపుల నుంచి బయటపడేందుకు ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మరం చేశాను. చివరికి గూగుల్ డబ్లిన్ కార్యాలయంలో అకౌంట్ ఎగ్జిక్యూటివ్ స్థానాన్ని పొందినట్లు తెలిపింది.
ఇప్పుడు నన్ను నేను చూసుకుని గర్వపడుతున్నాను. లింక్డిన్‌లో ఉద్వాసనకు గురైన తర్వాత నా కెరీర్‌లో రెండు అత్యున్న స్థానాలకు చేరుకున్నాను. ఒకటి జీతం డబుల్ అయ్యింది. రెండోది నాకు సరిపోయే గూగుల్‌లో ఉద్యోగం పొందడం. అదే లింక్డిన్‌లో ఉంటే ఆ రెండు అసాధ్యం’ అని వెల్లడించింది. ఈ సందర్భంగా లేఆఫ్స్ గురైన వారికి కోబయాషి పలు సూచనలు చేశారు. ఉద్యోగం పోగొట్టుకున్న వారికి నేనిచ్చే సలహా ఒకటే ప్రతి సంక్షోభంలోనూ ఓ అవకాశాన్ని వెతుక్కోడింది. అదే మిమ్మల్ని అత్యున్న స్థాయిలో ఉంచేలా చేస్తోంది అని ముగించింది.
మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని లింక్డిన్ గత ఏడాది రెండు సార్లు ఉద్యోగుల్ని తొలగించింది. రెండవ సారి ఇంజనీరింగ్, టాలెంట్ అండ్ ఫైనాన్స్ విభాగాలలో దాదాపూ 700 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్ ఇచ్చింది. వారిలో మరియానా కొబయాషి ఒకరు
Comments
Please login to add a commentAdd a comment