linked in
-
లింక్డిన్లో ఉద్యోగం ఊడింది .. అదృష్టం వరించింది!
ఐర్లాండ్‌కు చెందిన ‘మరియానా కొబయాషి’కి లింక్డిన్లో పని చేయడం ఓ కల. పలు దిగ్గజ కంపెనీల్లో ఎన్నో తిరస్కరణల తర్వాత చివరికి 2022లో ఉద్యోగం సాధించింది. అదే కొబయాషి జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణాలలో ఒకటిగా నిలిచింది. లింక్డిన్లో కోరుకున్న జాబ్.. సంతృప్తినిచ్చేలా జీతం. ఇంతకంటే ఇంకేం కావాలని అనుకుంది. హాయిగా ఉద్యోగం చేసుకుంటూ సంతోషంగా జీవిస్తుంది. కానీ గతేడాది ఆర్ధిక మాంద్యం భయాలు ఆమె ఉద్యోగానికి ఎసరు పెట్టాయి. చిన్న చిన్న స్టార్టప్స్ నుంచి అంతర్జాతీయ కంపెనీల వరకు లేఆఫ్స్ ప్రకటించాయి. ఈ తొలగింపుల్లో 2023 మేలో కోబయాషిని తొలగిస్తూ లింక్డిన్ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగం ఊడింది బ్రతుకు జీవుడా అంటూ ఇతర కంపెనీల్లో ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రతి చెడులో మంచి ఉందనే నానుడిని నిజం చేస్తూ..సరిగ్గా ఆరు నెలల తర్వాత గూగుల్ నుంచి ఓ మెయిల్ వచ్చింది. దాదాపు రెట్టింపు జీతంతో, ఉన్నత స్థాయిలో జాబ్ ఆఫర్ చేయడంతో ఎగిరి గంతేసినంత పనిచేసింది. ఈ నేపథ్యంలో లేఆఫ్స్ గురైన సందర్భంలో ఆమె మానసిక సంఘర్షణ ఎలా ఉందో చెబుతూ తన అనుభవాల్ని నెటిజన్లతో పంచుకుంది. లింక్డిన్లో లేఆప్స్ సమయంలో తనకు ఎలా అనిపించిందో గుర్తు చేసుకుంటూ..‘ నేను అక్కడ చాలా సంతోషంగా ఉన్నాను. కానీ లేఆఫ్స్ నన్ను షాక్‌కి గురి చేశాయి. లింక్డిన్లో ఉద్యోగం సాధించడం ఓ కలగా భావించనందునే .. అందులో ఉద్యోగం వచ్చిన తర్వాత ఊహాలోకంలో విహరించాను. అదెంత తప్పో ఆ తర్వాతే తెలిసింది. లేఆఫ్స్‌కు గురయ్యాను. నాకున్న వ్యాల్యుని ఉద్యోగంతో ముడిపెట్టకూడదని, లేదంటే ఎప్పుడూ సంస్థల్ని నమ్ముకుని ఉండొద్దనే అనుభవం నాకు నేర్పించింది. తొలగింపుల నుంచి బయటపడేందుకు ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మరం చేశాను. చివరికి గూగుల్ డబ్లిన్ కార్యాలయంలో అకౌంట్ ఎగ్జిక్యూటివ్ స్థానాన్ని పొందినట్లు తెలిపింది. ఇప్పుడు నన్ను నేను చూసుకుని గర్వపడుతున్నాను. లింక్డిన్లో ఉద్వాసనకు గురైన తర్వాత నా కెరీర్లో రెండు అత్యున్న స్థానాలకు చేరుకున్నాను. ఒకటి జీతం డబుల్ అయ్యింది. రెండోది నాకు సరిపోయే గూగుల్‌లో ఉద్యోగం పొందడం. అదే లింక్డిన్లో ఉంటే ఆ రెండు అసాధ్యం’ అని వెల్లడించింది. ఈ సందర్భంగా లేఆఫ్స్ గురైన వారికి కోబయాషి పలు సూచనలు చేశారు. ఉద్యోగం పోగొట్టుకున్న వారికి నేనిచ్చే సలహా ఒకటే ప్రతి సంక్షోభంలోనూ ఓ అవకాశాన్ని వెతుక్కోడింది. అదే మిమ్మల్ని అత్యున్న స్థాయిలో ఉంచేలా చేస్తోంది అని ముగించింది. మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని లింక్డిన్ గత ఏడాది రెండు సార్లు ఉద్యోగుల్ని తొలగించింది. రెండవ సారి ఇంజనీరింగ్, టాలెంట్ అండ్ ఫైనాన్స్ విభాగాలలో దాదాపూ 700 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్ ఇచ్చింది. వారిలో మరియానా కొబయాషి ఒకరు -
లింక్డిన్లో యువతి బయోడేటా.. ఉద్యోగం వస్తుందనుకుంటే నోటీసు వచ్చింది!
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న నగర యువతి జాబ్ పోర్టల్ లింక్డిన్ ద్వారా సైబర్ నేరగాళ్ల వల్లోపడింది. వైద్య రంగంలో ఉద్యోగం పేరుతో నమ్మించిన సైబర్ నేరగాడు బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకున్నాడు. వీటిని వినియోగించి పలువురిని రూ.38 లక్షల మేర ముంచాడు. మరోపక్క బాధితురాలికి ‘కస్టమ్స్ కథ’ చెప్పి రూ.2.36 లక్షలు కాజేశాడు. బెంగళూరు పోలీసుల నుంచి నోటీసులు అందుకున్న యువతి సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఎన్నారై డాక్టర్‌గా పరిచయం చేసుకుని... కార్వాన్ ప్రాంతంలో ఉన్న యువతి తన బయోడేటాను లింక్డిన్లో అప్లోడ్ చేసింది. దీన్ని చూసిన సైబర్ నేరగాడు లండన్‌లో పని చేస్తున్న ఎన్నారై డాక్టర్‌గా పరిచయం చేసుకుంటూ వాట్సాప్ చేశాడు. బయోడేటా పరిశీలించానని, వైద్య రంగంలో ఉద్యోగమంటూ ఎర వేశాడు. అడ్వాన్స్‌గా జీతం డిపాజిట్ చేయడానికంటూ ఆమెకు సంబంధించిన కెనరా బ్యాంక్ ఖాతా వివరాలు సంగ్రహించాడు. మాయ మాటలు చెప్పి ఆమె చెక్ బుక్, డెబిట్ కార్డులు ఢిల్లీ చిరునామాకు కొరియర్ చేయించుకున్నాడు. సాంకేతిక కారణాల పేరుతో బ్యాంకునకు లింకై ఉన్న ఫోన్ నెంబర్ సైతం మార్పించి తనది జోడించేలా చేశాడు. దేశ వ్యాప్తంగా అనేక మందిని వివిధ పేర్లతో మోసం చేసిన ఈ సైబర్ నేరగాడు వారితో డబ్బు డిపాజిట్ చేయించుకోవడానికి ఈ యువతి ఖాతా వాడాడు. తన వద్ద ఉన్న కార్డుతో ఏటీఎంల నుంచి డ్రా చేసేసుకున్నాడు. బాధితురాలి ఫోన్ నెంబర్ కూడా లింకై లేకపోవడంతో ఈ వివరాలేవీ ఆమెకు తెలియలేదు బెంగళూరు పోలీసుల నోటీసులు చూసి... ఓ సందర్భంలో తాను భారత్‌కు వస్తున్నానని, కొత్తగా ఏర్పాటు చేసే కంపెనీలో డైరెక్టర్‌గా నియమిస్తానంటూ సందేశాలు పంపాడు. ఇలా ఆమెను నమ్మించి మరో కథకు శ్రీకారం చుట్టాడు. ఓ రోజు తాను వస్తున్నానని, తనతో పాటు డబ్బు తీసుకువస్తున్నానని ఓ పెట్టె ఫొటో పంపాడు. ఇది జరిగిన రెండు రోజులకు ఢిల్లీ కస్టమ్స్ అధికారులుగా కొందరు ఫోన్లు చేశారు. ఫలానా వ్యక్తి భారీ మొత్తంలో విదేశీ కరెన్సీతో లండన్ నుంచి రావడంతో పట్టుకున్నామని చెప్పారు. అతడిని వదలిపెట్టడానికి ట్యాక్స్ కట్టాలంటూ అందినకాడికి వివిధ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయించుకున్నారు. ఓ దశలో అతడు కూడా ఫోన్లో మాట్లాడి డబ్బు గుంజాడు. ఇలా రూ.2.36 లక్షలు చెల్లించిన తర్వాత ఆమెకు బెంగళూరు పోలీసుల నుంచి నోటీసులు అందాయి. ఆమె పేరుతో కన్న కెనరా బ్యాంక్ ఖాతాలో రూ.38 లక్షల లావాదేవీలు జరిగాయని, వాటిని డిపాజిట్ చేసిన వాళ్లు సైబర్ నేరాల బాధితులని, దీంతో ఖాతా ఫ్రీజ్ చేశామని అందులో ఉంది. దీని ప్రకారం ఆమెనూ నిందితురాలిగా పరిగణించాలని భావించారు. ఈ నోటీసులు చూసిన తర్వాత తాను మోసపోయానని గుర్తించిన బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న అధికారులు సాంకేతికంగా దర్యాప్తు చేస్తున్నారు. -
భారత్‌లోని ఉద్యోగులకు ఇవే కావాలట.. సర్వేలో షాకింగ్ విషయాలు!
భారతదేశంలో ఉద్యోగార్థుల అవసరాలు, ప్రాధాన్యతలపై ప్రముఖ సంస్థ లింక్డ్ఇన్ అధ్యయనం (Linkedin Research) చేసింది. అందులో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. నివేదికలో.. వృత్తి పరమైన నైపుణ్యాల్ని పెంపు(Upskilling), పని- పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్, ప్రమోషన్స్.. లాంటి వాటిని ఉద్యోగులు కోరుకుంటున్నారు. చాలా రంగాలలోని ఉద్యోగులు అధిక ప్రాధాన్యతల గురించి మాట్లాడుతూ.. వారి కెరీర్లో అభివృద్ధి, ఉద్యోగాలలో మార్పు అవసరమని పేర్కొంది. 2 లేదా మూడు సంవత్సరాల పాటు ఒకే రోల్ ఉంటున్న వారితో పోల్చితే, ప్రమోషన్ వచ్చిన వారు అదే సంస్థలో కొనసాగే అవకాశం 10 శాతం ఎక్కువగా ఉంటుందట. ముఖ్యంగా నైపుణ్యాల్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాలను అనుకుంటున్నారు. ఎందుకంటే 2015 తర్వాత దేశంలో ఉద్యోగానికి కావాల్సిన స్కిల్స్ విషయంగా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మార్పులు సుమారు 29 శాతం మేర ఉండగా, 2025 నాటికి 50శాతం వరకు చేరుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. కంపెనీలు ఉద్యోగుల అనుభవం కంటే పని తీరు, టాలెంట్లు ఉన్నవారికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీంతో ఉద్యోగులు కూడా వాటిపై కూడా ప్రత్యేక దృష్టి పెడుతున్నారట. ప్రస్తుతం భారత్‌లో (51%) యజమానులు.. ఉద్యోగుల సహకారాన్ని, నాలెడ్జ్ షేరింగ్‌ని ప్రోత్సహిస్తున్నారని తెలిపింది. ఉద్యోగులు తమ తోటి సిబ్బందితో సత్సంధాలను ఏర్పరచుకుంటున్నారు. ఇది వారి టీమ్స్ బలోపేతం చేసేందుకు ఇది చాలా ఉపయోగపడుతుందని, తద్వారా కంపెనీ కూడా కలిసొచ్చే అంశంగా మారుతుంతని నివేదిక చెప్తోంది. చదవండి: ఎస్బీఐ ఖాతాదారులకు భారీ షాక్.. నేటి నుంచి -
'అభినవ ఘోరి మహమ్మద్',గూగుల్‌పై 39 సార్లు దండయాత్ర..చివరికి..
చరిత్ర పూటాల్లోకి ఒక్కసారి తొంగి చూస్తే ఘోరి మహమ్మద్‌ల దండ్రయాత్ర గురించి చాలా సార్లు వినే ఉంటాం. కానీ మనం నేటి ఘోరి మహమ్మద్‌ల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోరుకున్న దాన్ని దక్కించుకోవడం వారు చేస్తున్న దండ యాత్రల నుంచి ఎంతో కొంత ప్రేరణ పొందాల్సి ఉంది. టైలర్ కోహెన్..నెటిజన్లు ముద్దుగా అభినవ ఘోరి మహమ్మద్ అని పిలుస్తుంటారు. ఇక అసలు విషయాల్లోకి వెళితే.. ఉన్నత విద్యను అభ్యసించిన టైలర్ కోహెన్‌కు గూగుల్‌లో ఉద్యోగం చేయడం అంటే మహాపిచ్చి.ఎంతలా అంటే గూగుల్ తనని 39 సార్లు కాదన్న సరే..అందులోనే ఉద్యోగం చేయాలని అనుకున్నాడు. చివరికి అనుకున్నది సాధించాడు. 40వ సారి జాబ్ కొట్టాడు. కానీ గూగుల్‌లో కాదు. ఎందులో అంటే. ప్రస్తుత కాంపిటీషన్ వరల్డ్‌లో దిగ్గజ టెక్ కంపెనీల్లో కోరుకున్న జాబ్ పొందాలంటే అహర్నిశలు కృషి చేయాల్సి ఉంటుంది. జాబ్ కోసం కావాల్సిన కోచింగ్ తీసుకొని రెండు, మూడు సార్లు ట్రై చేస్తుంటారు. కావాల్సిన జాబ్ దొరక్కపోవడంతో..వచ్చిన జాబ్ చేసుకుంటూ జీవితంతో రాజీ పడలేక మనో వేధనకు గురవుతుంటారు. కానీ టైలర్ కోహెన్ అందరిలా కాదు. 2019 నుంచి గూగుల్‌లో జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు. గూగుల్ అతన్ని రిజెక్ట్ చేస్తూ వచ్చింది. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 39సార్లు గూగుల్‌లో జాబ్ కోసం ప్రయత్నించి సఫలమయ్యాడు. డూర్ డాష్ అనే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలో స్ట్రాటజీ హూప్స్ అసోసియేట్ మేనేజర్‌గా జాబ్ పొందాడు. ఆ జాబ్‌ను గూగూలే ఆఫర్ చేసింది. ఈ తరుణంలో తనని గూగుల్ 39సార్లు రిజెక్ట్ చేసిందంటూ తన అనుభవాల్ని నెటిజన్లతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ కాగా.. నెటిజన్లు అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కావాల్సిన జాబ్ దొరకలేని కృంగి పోకుండా నీలా ట్రై చేయాలంటూ కామెంట్లు చేస్తున్నారు. -
ఫుడ్ డెలివరీ సంస్థల్లో ఆర్డర్ పెడుతున్నారా.. ఇంత మోసమా..?
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జోమాటో ఎంతో ఫేమసో అందరికీ తెలిసిందే. ఫుడ్ ఆర్డర్ల విషయంలో కస్టమర్లు జోమాటోతో పాటు ఇతర సంస్థలను ఎంచుకుంటుంటారు. కాగా, జోమాటో ఆర్డర్లపై ఓ కస్టమర్ షాకింగ్ విషయాలు వెలుగులోకి తెచ్చాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకున్నాడు. వివరాల ప్రకారం.. రాహుల్ కబ్రా అనే ఒక లింక్డ్ఇన్ యూజర్.. ఆన్లైన్, ఆఫ్‌లైన్ ఫుడ్ ఆర్డర్ బిల్లులను పోల్చుచూ ఓ పోస్టును పెట్టాడు. అందులో భాగంగా ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో వినియోగదారుల నుంచి ఎక్కువ వసూలు చేస్తోందని అతడు పేర్కొన్నాడు. ఈ క్రమంలో రెండింటి మధ్య ధరల డిఫరెన్స్‌ను గమనించి ఖంగుతిన్నాడు. ఈ క్రమంలోనే ఛార్జీల పేరుతో డెలివరీ సంస్థలు వినియోగదారులను దోచుకుంటున్నాయని ఆరోపించాడు. కాగా, అతని ఆర్డర్లో వెజ్ బ్లాక్ పెప్పర్ సాస్, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, మష్రూమ్ మోమోలు ఉన్నాయి. ఆఫ్‌లైన్ ఆర్డర్ బిల్లు సీజీఎస్టీ, ఎస్జీఎస్టీతో కలుపుకుని రూ.512 అయింది. అయితే, ఇదే ఆర్డర్ జోమాటోలో రూ.689.90 ఉంది. అది కూడా రూ. 75 డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఉండటం విశేషం. ఆ క్రమంలో జోమాటో 34.76% ఎక్కువ (రూ.178) వసూలు చేసినట్లు రాహుల్ తెలిపాడు. ఈ సందర్భంగా.. రాహుల్ కబ్రా డెలివరీ సంస్థలపై ఆగ్రహం వ్యక్తపరిచాడు. డెలివరీ సంస్థల బిల్లులపై ప్రభుత్వం ఫోకస్ చేయాల్సిన అవసరముందన్నాడు. అధిక ఛార్జీల పెరుగుదలను ప్రభుత్వం కట్టడి చేయాల్సిన అవసరం ఉందని తాను భావిస్తున్నానని చెప్పుకొచ్చాడు. తద్వారా అందరికీ ఉపయోగం ఉంటుందని తెలిపాడు. భవిష్యత్తులో వినియోగదారులు జోమాటో వసూలు చేస్తున్న అధిక ఖర్చులను వినియోగదారులు అర్థం చేసుకుంటారని అన్నాడు. రాహుల్ కబ్రా పోస్టుపై మరో నెటిజన్ స్పందిస్తూ.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో స్విగ్గి ఆర్డర్‌పై తన అనుభవాన్ని చెప్పుకొచ్చాడు. ‘‘నేను సమీపంలోని రెస్టారెంట్ నుండి థాలీని ఆర్డర్ చేయాలనుకున్నాను. స్విగ్గీలో ధరను 120 ప్లస్ డెలివరీ ఛార్జీలుగా చూపింది. కానీ, నేను అదే రెస్టారెంట్ వైపు వెళ్తున్నా కారణంగా ఆన్లైన్లో ఆర్డర్ కాకుండా డైరెక్ట్‌గా రెస్టారెంట్ నుండి తీసుకున్నాను. దీంతో, అదే థాలీ రూ. 99కి వచ్చింది. అదే ఆన్లైన్లో ఆర్డర్ చేసి ఉంటే.. 40% ఎక్కువ ఉన్న అదే ఆహారం కోసం నేను స్విగ్గీకి దాదాపు 140 చెల్లించాల్సి వచ్చేదని అన్నాడు. కాగా, ఆయన పోస్టుపై రాహుల్ కాబ్రా.. నెటిజన్ల స్పందన ఏమిటో తెలపండి అంటూ కోరాడు. దీంతో, కొందరు నెటిజన్లు.. కంపెనీ ఇస్తున్న సర్వీసు వల్ల కొంత ఎక్కువ ఛార్జ్ చేస్తే తప్పేంటి, వారు చేస్తున్నదీ వ్యాపారమేగా అని కొందరు సమర్థిస్తుండగా.. మరికొందరు మాత్రం వ్యతిరేకించారు. మరొక యూజర్ ఈ యాప్‌లను తన ఫోన్ల నుంచి డిలీట్ చేసి పక్కనే ఉండే రెస్టారెంట్లకు వెళ్లి తినటం మంచిదని బదులిచ్చాడు. ఇది కూడా చదవండి: గూగుల్‌ని తిట్టిపోస్తున్న నెటిజన్లు...నివాళి ఇచ్చే పద్ధతి ఇదేనా! -
ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా టీసీఎస్ ఉద్యోగి.. ఆ తర్వాత ఏమైందంటే..?
TCS Techie Turns Zomato, సాక్షి, చెన్నై: అతనో సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఓ కంపెనీ నుంచి మరో కంపెనీకి మారుతున్న క్రమంలో ఓ వారం గ్యాప్ దొరికింది. ఇంతలో ఆ వారం రోజులు ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఎందుకని జొమాటో ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా పార్ట్ టైమ్ జాబ్‌ను ఎంచుకున్నాడు. అప్పుడు మొదలయ్యాయి ఆయన తిప్పులు. ఈ క్రమంలో ఫుడ్ డెలివరీ బాయ్‌గా చేయడం ఎంత కష్టమో వివరించారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. టీసీఎస్ మాజీ ఉద్యోగి, తమిళనాడుకు చెందిన శ్రీనివాసన్ జయరామన్.. జాబ్‌కు రిజైన్ చేసి మరో కంపెనీలో చేరాడు. కొత్త కంపెనీలో జాయినింగ్ కోసం ఓ వారం గ్యాప్ తీసుకున్నారు. ఆ వారం రోజులు ఖాళీగా ఇంట్లో ఉండటం ఇష్టం లేక ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా మారాడు. ఈ క్రమంలో జొమాటో, స్విగ్గీ ద్వారా ఫుడ్ డెలివరీ చేసే వాళ్ల కష్టాలను స్వయంగా అనుభవించి.. ఇబ్బందుల గురించి లింక్డ్ ఇన్‌లో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో పెట్రోల్ ధరలు మొదలుకొని స్పీడ్‌గా ఫుడ్ డెలివరీ చేయడం వరకు సమస్యల జాబితాను తయారు చేసి వివరించాడు. పోస్ట్ ప్రకారం.. డెలివరీ ఏజెంట్లు త్వరగా డెలివరీ ఇవ్వడానికి కాలంతోపాటు పరుగెత్తాలి. చాలా మంది కస్టమర్లు తమ అడ్రస్‌లను కరెక్ట్‌గా చెప్పరు. లొకేషన్ వివరాలు సరిగ్గా ఉండవు. ఫోన్ నంబర్లను అప్డేట్ చేయరు. ఒక రద్దీ ప్రాంతంలో గంటలో మూడు ఫుడ్ పార్సిళ్లను డెలివరీ చేయాల్సి వచ్చిందని జయరామన్ వివరించాడు. తరచుగా డెలివరీ కోసం ఎక్కువ దూరం వెళ్లాల్సి వస్తుంది. ఇది చాలా పెద్ద సమస్య. తాను ఓ సారి ఏకంగా 14 కిలో మీటర్లు ప్రయాణించి డెలివరీ ఇవాల్సి వచ్చిందని తెలిపాడు. గూగుల్స్ మ్యాప్స్ సాయంతో కొన్ని సార్లు అడ్రస్‌లు సరిగా తెలియవు. ఇటీవల కాలంలో పెరుగుతున్న పెట్రోల్ ధరల గురించి ప్రస్తావిస్తూ.. ‘‘డెలివరీ ఏజెంట్లకు సాయం చేయండి. పెరిగిన పెట్రోల్ ధరలను కంపెనీలే భరిస్తాయనే వార్తలను చూశాను. అది నిజమైతే చాలా బాగుంటుంది. వాళ్లను తప్పక ఆదుకోవాలి” అని చెప్పాడు. కాగా, ఇటీవలే ఇక నుంచి తాము కొన్ని ఆహార పదార్థాలను పది నిమిషాల్లోనే డెలివరీ ఇస్తామని జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన కామెంట్స్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో డెలివరీ విషయంలో ఉద్యోగులపై ఒత్తిడి చేయమని వివరణ ఇచ్చారు. -
తల్లులపై వైరస్ తెచ్చిన ఒత్తిడి
భారతదేశంలో ఉద్యోగాలు చేస్తున్న తల్లుల్లో 50 శాతం మంది ఈ కరోనా వల్ల తమలో ఆందోళన, ఒత్తిడి పెరిగాయని ‘లింక్డ్ ఇన్’ తాజా సర్వేలో చెప్పారు. ఇంటి పని, ఆఫీసు పని, పిల్లల పెంపకం వారిని తీవ్రమైన వొత్తిడిలో ఉంచుతోంది. మగవారి పని కూడా ఈ కాలంలో పెరిగినా 38 శాతం మంది మాత్రమే తమకు ఒత్తిడి ఉందని చెప్పారు. రోగ నిరోధక శక్తిని పీల్చేసే ఈ యాంగ్జయిటీ వారికి ఏ మాత్రం క్షేమకరం కాదు. డాక్టర్ శారద హైదరాబాద్‌లో గవర్నమెంట్ పీడియాట్రిషియన్. ఆమె పని చేసే హాస్పిటల్‌ను కోవిడ్ హాస్పిటల్ చేశారు. కోవిడ్ వచ్చిన పిల్లలను ఆమె చూడాలి. ఒక వారం ఒక షిఫ్ట్ మరో వారం మరో షిఫ్ట్ పని చేస్తోంది. కాని ఇంటికి వెళ్లడానికి కరోనా వ్యాప్తి వల్ల భయం వేసి ఇంటికి దగ్గరే ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకొని ఉంటోంది. ఒక పాప ఆమెకు. ఆమె ఆలనా పాలనా గురించి ఒక వొత్తిడి. ఉద్యోగంలో వొత్తిడి. భర్త సహకరిస్తున్నా ఇంటి పనుల్లో తను భాగం కాలేకపోవడం, లేదా దగ్గరుండి చూసుకోలేకపోవడం మరో వొత్తిడి. ఉద్యోగం ముఖ్యం. ఇల్లూ ముఖ్యమే. ఈ వొత్తిడిని ఎలా దాటాలో ఆమెకు అర్థం కావడం లేదు. రత్నలీల సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. మార్చి నుంచి ఇంటి దగ్గరే పని చేస్తోంది. ఇద్దరు పిల్లలు. పదేళ్లు. ఎనిమిదేళ్లు. వాళ్లు ఇంట్లోనే ఉంటున్నారు. కరోనా భయంతో పనిమనిషిని మాన్పించారు. భర్త తన ఉద్యోగంలో పని గంటలు తగ్గించుకుని ఇంటి అవసరాలు చూస్తున్నా మూడు పూటలా తప్పక వండాల్సి రావడం ఆమెకు శ్రమ అవుతోంది. ఆమె ఉదయం పదింటికి లాగిన్ కావాలి. ఆ సమయంలోనే పిల్లలు ఆన్లైన్ క్లాసుల్లో కూచుంటారు. కాని వాటిని సరిగా వినరు. వాళ్లను అజమాయిషీ చేయాలి. మధ్యలో వంట చేయాలి. ఆఫీసు వారికి సమాధానం చెప్పాలి. ఇంతకు ముందైతే పిల్లలు స్కూల్లోనే స్కూలు వాళ్లు పెట్టే భోజనం చేసేవారు. చాలాసార్లు రాత్రిళ్లు బయటి నుంచి భోజనం తెప్పించుకునేవారు. ఇప్పుడు కరోనా వల్ల ఆ బరువంతా ఆమె మీదనే పడింది. అంట్లు ఒక పెద్ద సమస్య. అసలే ఆమెకు థైరాయిడ్ ఉంది. ఇన్ని సతమతాల మధ్య ఆమె తక్కువగా నవ్వుతోంది. ∙∙ శ్రావణి గవర్నమెంట్ స్కూల్ టీచర్. భర్త చిన్న ఉద్యోగి. ఇద్దరు పిల్లలు. కరోనాకు ముందు ఉదయాన్నే వండి పిల్లలకు, భర్తకు బాక్స్‌లు కట్టిస్తే మళ్లీ సాయంత్రం అందరూ కలిసేవారు. ఇప్పుడు కరోనా వల్ల భర్త ఉద్యోగం ఊడేలా ఉంది. పిల్లలు ఇంట్లో క్లాసెస్ అటెండ్ అవుతున్నారు. తను స్కూల్‌కు వెళ్లిరావాల్సి వస్తోంది. ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ లేదు. కరోనా నుంచి కాపాడుకుంటూ వెళ్లి రావాలి. స్కూల్లో పిల్లలు లేకపోయినా ఇతర టీచర్లకు ఒకరి నుంచి ఒకరికి ప్రమాదం ఉంటుంది. ఉద్యోగం కాపాడుకోవాలి. పిల్లలు ఇంట్లో ఏం చేస్తున్నారో అడుగడుగునా గమనించుకోవాలి. ఇదంతా ఎవరికీ చెప్పుకోలేదు. లోలోపల పడటం తప్ప. గృహిణిగా స్త్రీకి ఇంటి గురించి ఒక సగటు వొత్తిడి ఉంటుంది. ఇక ఉద్యోగం చేసే స్త్రీకైతే ఈ వొత్తిడి మరి కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కరోనా దీనికి జతైంది. అందుకే భారతదేశంలో ఉద్యోగం చేస్తున్న వివాహితలు 50 శాతం మంది ఆందోళన, వొత్తిడి ఎదుర్కొంటున్నామని ‘లింక్డ్ఇన్’ చేసిన తాజా సర్వేలో తెలియచేశారు. లింక్డ్ఇన్ క్రమానుగతంగా ప్రకటించే ‘వర్క్‌ఫోర్స్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్’ తాజా నివేదికలో ఈ విషయం ప్రకటితమైంది. జూలై 23 నుంచి ఆగస్టు 27 వరకు చేసిన ఈ సర్వేలో 2,254 మంది ఉద్యోగం చేసే వివాహితలు పాల్గొన్నారు. ఈ సర్వే ప్రకారం ప్రతి ముగ్గురిలో ఒక స్త్రీ తన పిల్లలకు కావలసిన పూర్తి సమయం కేటాయించగలుగుతోంది. కాని పురుషుల్లో ప్రతి 5 మందిలో ఒక్కరే ఈ పని చేస్తున్నారు. ప్రతి ఐదు మంది స్త్రీలలో ఇద్దరు ఇంటి పని ఆఫీసు పని పూర్తిగా తెమల్చడానికి పురుషులతో పోల్చితే రెట్టింపు పని గంటలు చేస్తున్నారు. అంటే డబుల్ డ్యూటీ చేస్తున్నారు. పిల్లలను చూసుకోమని వారినీ వీరిని అడగడానికి కేవలం 20 శాతం మంది స్త్రీలు ఇష్టపడుతున్నారు. ఈ విషయంలో పురుషుల శాతం 32 ఉంది. ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్న స్త్రీలలో 46 శాతం మంది పొద్దు పోయేదాకా పని చేస్తున్నారు. 42 శాతం మంది పిల్లలు ఇంట్లో, తమ చుట్టూ ఉండటం వల్ల పని మీద ఫోకస్ చేయలేకపోతున్నామని స్ట్రెస్ ఫీలవుతున్నారు. ఆర్థిక అవసరాల రీత్యా స్త్రీ, పురుషుల తప్పక పని చేయాల్సిన ఈ సందర్భాలలో మారిన కరోనా పరిస్థితుల వల్ల స్త్రీలు నిరాఘాటంగా వొత్తిడిలో ఉండటం వారి ఆరోగ్యానికి ఏమంత క్షేమం కాదు. పురుషులు కూడా వారి సమస్యల్లో వారున్నా మొత్తంగా ఇంటిని కాపాడుకోవడానికి ఇరువురూ కలిసి మరింత సమన్వయంతో ఏం చేసుకోవచ్చో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎవరి నుంచి మద్దతు పొందాలి, ఏ పని తగ్గించుకోవాలి, లీవ్‌లు పెట్టే వీలు, ఉద్యోగం కాపాడుకుంటూనే తాత్కాలిక విరామం తీసుకునే వీలు, పిల్లలకు పరిస్థితులను అర్థమయ్యేలా చెప్పి వారి నుంచి సహకారం పొందాల్సిన అవసరం, రోజువారి పనికి ప్రత్యామ్నాయాలు ఇవన్నీ తప్పనిసరిగా చర్చించుకొని ప్లాన్ చేసుకోవాలి. పని యంత్రాలుగా మిగలడానికి స్త్రీ, పురుషులు జన్మించలేదు. ఇరువురికీ మానసిక వికాసం కావాలి. ఆహ్లాదం కావాలి. పిల్లలతో సమయం గడపడం కావాలి. అందరూ కలిసి మనం ఒకరి కోసం ఒకరు అనే భావన తెచ్చుకోవాలి. కుటుంబం కోసం నువ్వు ఇదంతా పడక తప్పదు అని కుటుంబం స్త్రీకి సంకేతాలు ఇచ్చినా, కుటుంబం కోసం నేనిదంతా ఎందుకు పడాలి అనే అసహనం స్త్రీకి కలిగినా సమస్య మానసిక స్థాయి నుంచి భౌతికస్థాయికి చేరుతుంది. కుటుంబ బంధాలకు సవాళ్లు ఎదురవుతాయి. ఈ కరోనా కాలంలో ఈ అదనపు సమస్యలు ఏ మాత్రం వాంఛనీయం కావు. – సాక్షి ఫ్యామిలీ -
కొత్త బంగారు లోకం
న్యూఢిల్లీ: పని సంస్కృతిలో, వృత్తి, ఉద్యోగ వాతావరణంలో ‘కరోనా’ గణనీయ మార్పు తీసుకువచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇల్లే ఆఫీస్‌గా మారిందని, ఇంటర్నెటే మీటింగ్ రూమ్‌గా రూపాంతరం చెందిందని, ఆఫీస్‌లో సహోద్యోగులతో కలిసి బ్రేక్ టైమ్ గడపడం చరిత్రగా మారిందని పేర్కొన్నారు. ఈ మేరకు ‘లింక్డ్ఇన్’ పోర్టల్‌కు తాను రాసిన ఒక వ్యాసాన్ని ఆదివారం మోదీ ట్వీట్ చేశారు. సృజనాత్మక, శక్తిమంతమైన భారతీయ యువత ఆరోగ్య, సౌభాగ్య భవిష్యత్తుకు మార్గాన్ని ప్రపంచానికి చూపగలరన్నది తన విశ్వాసమని, అందుకు సంబంధించిన కొన్ని ఆలోచనలను పంచుకున్నానని పేర్కొంటూ ‘లైఫ్ ఇన్ ద ఎరా ఆఫ్ కోవిడ్–19’ పేరుతో రాసిన ఆ వ్యాసం లింక్‌ను ప్రధాని ట్వీట్ చేశారు. ఏ ఈ ఐ ఓ యూ ‘ఈ శతాబ్దంలోని మూడో దశాబ్దం అనేక ఒడిదుడుకులతో ప్రారంభమైంది. కోవిడ్–19 తనతో పాటు ఎన్నో అవాంతరాలను తీసుకువచ్చింది’ అని ఆ వ్యాసంలో ప్రధాని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కొత్త వ్యాపార నమూనాలు తెరపైకి వస్తున్నాయన్న ప్రధాని.. ఈ సంక్షోభ సమయాన్ని భారత్ తనకు అనుకూలంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. కరోనా అనంతర ప్రపంచంలో నూతన వ్యాపార అభివృద్ధి అవకాశాలను రూపొందించుకోవాలని సూచించారు. ‘పరిస్థితులకు తగ్గట్లుగా మార్పు చెందుతూ, అంతర్జాతీయ పరిణామాలను ఆకళింపు చేసుకుంటూ, సామరŠాధ్యలను పెంపొందించుకుంటూ, అవకాశాలను సృష్టించుకుంటూ, సమ్మిళిత దృక్పథంతో ముందుకు సాగాలి’ అని ఇంగ్లీష్ భాషలోని అచ్చులు ఏ(అడాప్టబిలిటీ), ఈ(ఎఫిషియెన్సీ), ఐ(ఇన్‌క్లూజివిటీ), ఓ(అపార్చునిటీ), యూ(యూనివర్సలిజం)లను సమయోచితంగా ఉపయోగిస్తూ దిశానిర్దేశం చేశారు. కరోనా అనంతర ప్రపంచంలో ఈ ఐదు అంశాలు ఏ వ్యాపార నమూనాకైనా ముఖ్యమైన అంతర్భాగాలవుతాయన్నారు. కరోనాకు కులం, మతం లేదు కరోనా కులం, మతం, జాతి, వర్గం, వర్ణం, భాష.. ఇవేమీ చూడదని ప్రధాని పేర్కొన్నారు. వీటికి అతీతంగా దాడి చేస్తుందన్నారు. కరోనాపై పోరాటంలో అందరు కూడా సోదర భావంతో ఐక్యంగా సాగాలన్నారు. ‘గతంలో దేశాలు, ప్రాంతాలు పోరాడుకున్నాయి. ఇప్పుడు మానవాళి అంతా ఒక ఉమ్మడి శత్రువుపై పోరాడుతోంది. ఎంత ఐక్యంగా పోరాడామన్న విషయంపైననే మన భవిష్యత్తు ఆధారపడి ఉంది’ అని తెలిపారు. నేనూ మారాను కరోనా కారణంగా మారిన పరిస్థితులకు అనుకూలంగా తాను కూడా మార్పు చెందానని ప్రధాని పేర్కొన్నారు. ‘ఇప్పుడు మంత్రివర్గ సహచరులతో, అధికారులతో, ప్రపంచ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే సమావేశమవుతున్నా’నన్నారు. ‘సులభంగా ఆచరించదగిన వ్యాపార, జీవనవిధాన నమూనాల గురించి ఆలోచించాల్సిన తరుణమిది’ అన్నారు. కొత్త పని సంస్కృతిని రూపొందించే కార్యక్రమానికి యువ భారత్ నడుం బిగించి, నాయకత్వం వహించాలని ప్రధాని కోరారు. అన్ని శక్తిసామర్థ్యాలున్న భారత్.. కరోనా అనంతర బహుళ వ్యాపార ప్రపంచంలో కీలక శక్తిగా ఎదగగలదన్నారు. ఈ అవకాశాన్ని ఒడిసిపట్టుకుని, ఎదుగుదామని పిలుపునిచ్చారు. ‘ఆధునిక సాంకేతికతతో ముందుగా లాభపడేది పేదలే. సాంకేతికత వల్ల దళారులు అంతమయ్యారు. సంక్షేమ కార్యక్రమాలు ఊపందుకున్నాయి’ అని వివరించారు. కరోనాపై పోరాటాన్ని కూడా మన సినిమా తారలు, క్రీడాకారులు, సంగీతకారులు టెక్నాలజీ సాయంతో అత్యంత సృజనాత్మకంగా చేపట్టారని ప్రధాని గుర్తు చేశారు. డిజిటల్ పేమెంట్స్‌కు అలవాటు పడటం మన మార్పును ఆహ్వానించే తత్వానికి మంచి ఉదాహరణ అని గుర్తు చేశారు. టెలీమెడిసిన్‌ను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించాలని సూచించారు. ఆఫీస్‌లో ఎంతసేపు ఉన్నామనే విషయం కన్నా.. ఉత్పాదకత, సామర్ధ్యం కీలకమన్నారు. చవకైన వైద్య పరిష్కారాలను, భారీ ఎత్తున సృష్టించాల్సిన అవసరాన్ని కరోనా కలిగించిందన్నారు. రైతులకు అవసరమైన సమాచారం, వినియోగదారులకు నిత్యావసరాలు అందేలా సాంకేతికత సాయంతో సృజనాత్మక మార్గాలను వెతకాలని కోరారు. కిరాణా వర్తకులకు థాంక్స్ లాక్డౌన్ కాలంలో కూడా ప్రాణాలకు తెగించి ప్రజలకు నిత్యావసర వస్తువులను అందిస్తున్న చిన్న వ్యాపారస్తులు, కిరాణా వర్తకులకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ‘ప్రాణాలకు తెగించి వారే ఈ సేవలను అందివ్వనట్లయితే.. పరిస్థితిని ఒక్కసారి ఊహించండి. చిన్న వర్తకుల ఈ సేవను సమాజం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుంది’ అని పీఎం వరుస ట్వీట్స్ చేశారు. ‘ఎన్నో వర్గాల ప్రజలు సానుకూలంగా సేవలందించడం వల్లనే లాక్‌డౌన్‌ను ఆచరించగలుగుతున్నారు’ అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని క్రిషన్ కుంజ్ మురికివాడలో బిక్కుబిక్కుమంటున్న జనం -
హైదరాబాద్‌లో డేటాసెంటర్లు పెట్టండి
► లింక్డ్ ఇన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌తో మంత్రి కేటీఆర్ ► హైదరాబాద్ నగరానికి రావాలని ఆహ్వానం ► వచ్చే ఏడాది బృందంతో వస్తామన్న హాఫ్ మన్ శాన్ ఫ్రాన్సిస్కో అమెరికా పర్యటనలో భాగంగా సిలికాన్ వ్యాలీలో పర్యటిస్తున్న మంత్రి కేటీ రామారావు గురువారం కాలిఫోర్నియా గవర్నర్ ఎడ్మండ్ జెర్రీ బ్రౌన్‌తో సమావేశం అయ్యారు. శాన్ ఫ్రాన్సిస్కోలో జరుగుతున్న క్లీన్ ఎనర్జీ మినిస్టీరియల్ సమావేశాల సందర్భంగా కాలిఫోర్నియా గవర్నర్ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో సాంప్రదాయేతర ఇంధన రంగంలో పరస్పర సహకారం కోసం ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ప్రపంచంలోని 13 ప్రాంతాల నుంచి ఈ సమావేశానికి ప్రతినిధులు హాజరయ్యారు. భారతదేశం నుంచి తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే ఆహ్వనం దక్కింది. ఈ సమావేశంలో తెలంగాణ జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గవర్నర్ తో భేటీలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నూతన పారిశ్రామిక విధానం, ఐటీ పాలసీల ప్రధాన అంశాలను మంత్రి కేటీఆర్ వివరించారు. తొలుత శాన్ ఫ్రాన్సిస్కోలోని సాఫ్ట్ వేర్ కంపెనీ సేల్స్ ఫోర్స్ ప్రధాన కార్యాలయంలో కంపెనీ ప్రతినిధి బృందంతో కేటీఆర్ సమావేశం అయ్యారు. హైదరాబాద్‌లో ఐటీ కంపెనీలకు ఉన్న విస్తృత అవకాశాలను మంత్రి సేల్స్ ఫోర్స్ బృందానికి వివరించారు. గురువారం మధ్యాహ్నం లిక్డ్ ఇన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రీడ్ హాఫ్ మన్తో మంత్రి సమావేశం అయ్యారు. భారతదేశంలో కంపెనీ విస్తరణ ప్రణాళికలను మంత్రి తెలుసుకున్నారు. కంపెనీ ప్రణాళికల్లో తెలంగాణకు ప్రధాన స్థానం కల్పించాలని కోరారు. హైదరాబాద్‌లో డేటా సెంటర్లు, డేటా ఎనలిటిక్స్ ఆపరేషన్స్‌ను ఏర్పాటుచేయాలని కోరారు. హైదరాబాద్ నగరానికి హాఫ్ మన్ని అహ్వనించారు. మంత్రి ఆహ్వానాన్ని అంగీకరించిన హాఫ్ మెన్, వచ్చే ఏడాది కంపెనీ ప్రతినిధి బృందంతో హైదరాబాద్ నగరంలో పర్యటిస్తామని హామీ ఇచ్చారు. Great meeting you @reidhoffman Lots of possible opportunities for LinkedIn to collaborate & grow with Telangana pic.twitter.com/6gY3ZxZJfy — KTR (@KTRTRS) 1 June 2016 Minister KTR in a meeting with @salesforce leadership Srinivas Tallapragada, @pink94109 @pabloqlee @gkreitem pic.twitter.com/3dtoYIhszu — Min IT, Telangana (@MinIT_Telangana) 1 June 2016 -
నకిలీ లింక్డ్ఇన్ అకౌంట్లతో మోసాలు
సైబర్ నేరగాళ్ల విన్యాసాలపై సిమాంటిక్ నివేదిక న్యూఢిల్లీ: సైబర్ నేరగాళ్లు నకిలీ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ ద్వారా బిజినెస్ ప్రొఫెషనల్స్‌ను మోసం చేస్తున్నారని సెక్యూరిటీ సొల్యూషన్స్ అందించే సిమాంటిక్ సంస్థ తెలిపింది. సైబర్ నేరగాళ్లు ఉద్యోగాలిస్తామంటూ నకిలీ ప్రొఫైల్స్ ద్వారా బిజినెస్ ప్రొఫెషనల్స్ సమాచారాన్ని సేకరిస్తారని పేర్కొంది. ఆ తర్వాత ఈ సమాచారంతో ఫిషింగ్ ఈమెయిల్స్ పంపిస్తారని వివరించింది. ప్రపంచవ్యాప్తంగా లింక్డ్ఇన్కు 40 కోట్ల మంది యూజర్లున్నారని, గత ఏడాది ఈ తరహా మోసాలు చాలా జరిగాయని పేర్కొంది. కంపెనీలు నిర్వహిస్తున్నామని లేదా స్వయం ఉపాధి పొందుతున్నామని ఉద్యోగులు కావాలంటూ సైబర్ నేరగాళ్లు మహిళల ఫొటోలతో బిజినెస్ ప్రొఫెషనల్స్‌ను ఆకర్షిస్తారని వివరించింది. టిన్ఐ, గూగుల్ ఇమేజ్ సెర్చ్ వంటి రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా ఈ నకిలీ ప్రొఫైల్స్‌ను గుర్తించగలిగామని పేర్కొంది. ఇతరులను తమ నెట్‌వర్క్‌కు జత చేసుకునేముందు లింక్డ్ఇన్ యూజర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. ఉద్యోగాలిస్తామంటూ ఆఫర్లిచ్చే లింక్డ్ఇన్ అకౌంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.