కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తరువాత చాలా కంపెనీలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఆర్థిక మందగమనం కారణంగా ఎంతోమంది ఉద్యోగులను తొలగించిన దిగ్గజ కంపెనీలు.. ఇప్పుడు వేతనాలను పెంచడానికి ససేమిరా అంటున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు జీతాల పెంపును నిలిపివేయడమే కాకుండా.. ప్రమోషన్స్, బోనస్ వంటి వాటిని కూడా వాయిదా వేస్తూ వస్తున్నాయి.
సాధారణంగా జూన్ లేదా జులై నెలలో వేతనాల పెరుగుదల, ప్రమోషన్స్ ఉంటాయి. కొన్ని కంపెనీలు దీనిని వాయిదా వేసుకుంటూ వస్తూనే ఉన్నాయి. ప్రపంచంలో అతి పెద్ద ఐటీ కంపెనీ 'అసెంచర్' 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత్, శ్రీలంకలో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలు పెంచలేదు. ఎక్కువ పర్ఫామెన్స్ చేసినవాళ్ళకైనా జీతాలు పెంచే అవకాశం ఉందేమో అని ఎదురు చూస్తే.. వారికి కూడా చుక్కెదురైంది.
ఇటీవల అసెంచర్ చేసిన ప్రకటనలో.. ప్రమోషన్లకు సంబంధించిన గడువును మరో ఆరు నెలలకు వాయిదా వీడింది. ఇంతకు ముందు ప్రమోషన్స్ ఈ ఏడాది చివరకు ఉంటాయని చెప్పిన కంపెనీ.. ఇప్పుడు వచ్చే ఏడాది జూన్‌కు వాయిదా వేసింది. కంపెనీ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండటం చేత ఈ ఆలస్యం జరుగుతోందని సంస్థ వెల్లడించింది.
ఇదీ చదవండి: 10 నిమిషాల్లో ఐఫోన్ 16 డెలివరీ
టెక్నాలజీ దిగ్గజం అసెంచర్ ప్రపంచవ్యాప్తంగా 7,50,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. కన్సల్టింగ్ పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న ఈ కంపెనీ ఆర్థిక పరమైన అనిశ్చితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ప్రభావం ఉద్యోగుల మీద పడింది. ఏది ఏమైనా త్వరలోనే ఉద్యోగులకు శుభవార్త వినిపించనుంది.
Comments
Please login to add a commentAdd a comment