కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. జులై1న 8వేల మందికి పైగా ఉద్యోగులకు పదోన్నతి కల్పించిన కేంద్రం.. తాజాగా మరికొంత మందిని సైతం ప్రమోట్ చేయనున్నట్లు కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.
మంత్రిత్వ శాఖలు, వాటి విభాగాలకు చెందిన కార్యాలయాల్లో పనిచేసే 4వేల మంది ఉద్యోగులకు కేంద్రం చివరిసారిగా 2019లో ప్రమోషన్లు ఇచ్చింది. ఆ తర్వాత పెద్ద సంఖ్యలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రమోషన్‌లు లేకుండా రిటైర్ అయ్యారు. ఆ విషయంలో ఉద్యోగులు నిరాసక్తితో ఉన్నారు.
అందుకే ఉద్యోగులకు ప్రమోషన్‌లు ఇచ్చే విషయంలో కేంద్రం సీరియస్‌గా ఆలోచిస్తుంది. మరో రెండు,మూడు వారాల్లో అర్హులైన ఉద్యోగులకు ప్రమోషన్‌లు కల్పిస్తామని జితేంద్ర సింగ్ అన‍్నారు. మరికొంత మంది ఉద్యోగులకు ప్రమోషన్ల ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ భరోసా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment