ముంబై: కార్యాలయ ఉద్యోగ నియామకాలు ఆగస్ట్ నెలలో క్షీణత చూశాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోలి్చనప్పుడు 6 శాతం తక్కువగా నమోదయ్యాయి. ముఖ్యంగా ఐటీ, బీమా, ఆటోమొబైల్, హెల్త్‌కేర్, బీపీవో రంగాల్లో నియామకాల పరంగా అప్రమత్త ధోరణి కనిపించింది. ఈ ఏడాది ఆగస్ట్ నెలలో 2,566 ఉద్యోగాలకు సంబంధించి పోస్టింగ్‌లు పడ్డాయి. క్రితం ఏడాది ఇదే నెలలో ఇవి 2,828గా ఉన్నట్టు నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ నివేదిక వెల్లడించింది. నౌకరీ సంస్థ తన పోర్టల్‌పై జాబ్ పోస్టింగ్‌లు, ఉద్యోగ అన్వేషణల డేటా ఆధారంగా ప్రతి నెలా నివేదిక విడుదల చేస్తుంటుంది.
ఇక ఈ ఏడాది జూలై నెలలో పోస్టింగ్‌లు 2,573తో పోలిస్తే కనుక ఆగస్ట్‌లో నియామకాలు 4 శాతం పెరిగాయి. ఆయిల్ అండ్ గ్యాస్, హాస్పిటాలిటీ, ఫార్మా రంగాల్లో నియామకాల పట్ల ఆశావహ ధోరణి కనిపించింది. ‘‘ఐటీలోనూ సానుకూల సంకేతలు కనిపించాయి. గడిచిన కొన్ని నెలలుగా ఐటీలో నియామకాలు తగ్గగా, సీక్వెన్షియల్‌గా (జూలైతో పోలిస్తే) ఐటీలో నియామకాలు పెరిగాయి. కార్యాలయ ఉద్యోగాల మార్కెట్‌లో సాధారణ పరిస్థితులు తిరిగి ఏర్పడుతున్నదానికి ఇది ఆరోగ్యకర సంకేతం’’అని నౌకరీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ వెల్లడించారు.
ఐటీలో 33 శాతం డౌన్
ఐటీ రంగంలో నియామకాలు క్రితం ఏడాది ఆగస్ట్‌తో పోలి్చనప్పుడు, ఈ ఏడాది అదే నెలలో 33 శాతం తక్కువగా నమోదయ్యాయి. బీమా రంగంలో 19 శాతం, ఆటోమొబైల్ రంగంలో 14 శాతం, హెల్త్‌కేర్ రంగంలో 12 శాతం, బీపీవో రంగంలో 10 శాతం చొప్పున నియామకాలు తగ్గాయి. ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో నియామకాల పరంగా 17 శాతం వృద్ధి నమోదైంది. అహ్మదాబాద్, ముంబై, చెన్నై, హైదరాబాద్‌లో ఆయిల్ అండ్ గ్యాస్ రంగ నియామకాలు ఎక్కువగా చోటు చేసుకున్నాయి.
16 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన నిపుణులకు డిమాండ్ ఎక్కువగా కనిపించింది. ఆతిథ్య రంగం (హాస్పిటాలిటీ)లోనూ నియామకాలు బలంగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోలి్చనప్పుడు 14 శాతం వృద్ధి కనిపించింది. ఆర్‌అండ్‌డీపై దృష్టి పెరగడంతో ఫార్మా రంగంలో 12 శాతం అధికంగా నియామకాలు జరిగాయి. అహ్మదాబాద్, చెన్నైలో ఎక్కువగా ఫార్మా అవకాశాలు లభించాయి. ఏఐ ఉద్యోగాల్లోనూ 8 శాతం వృద్ధి కనిపించింది. మెషిన్ లెరి్నంగ్, ఏఐ సైంటిస్ట్, డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్‌ల ఉద్యోగ నియామకాలు కూడా పెరిగాయి.
ఉద్యోగ నియామకాలు డౌన్
Published Thu, Sep 7 2023 5:15 AM | Last Updated on Thu, Sep 7 2023 5:15 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment