jobs recruitments
-
గ్రూప్–1 కొత్త నోటిఫికేషన్.. 563 ఖాళీల భర్తీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 563 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) సోమవారం సాయంత్రం కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసింది. 503 గ్రూప్–1 ఉద్యోగ నియామకాల కోసం 2022 ఏప్రిల్ 26న జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. తాజా నోటిఫికేషన్ మేరకు 18 శాఖల్లో 563 పోస్టులకు సంబంధించిన ప్రిలిమ్స్ రాత పరీక్ష కోసం ఈ నెల 23 నుంచి ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కమిషన్ వెల్లడించింది. మార్చి 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. వాటిల్లో పొరపాట్లు సవరించుకునేందుకు మార్చి 23వ తేదీనుంచి 27వ తేదీ సాయంత్రం 5 వరకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. ప్రిలిమినరీ పరీక్షను ఈ ఏడాది మే లేదా జూన్ నెలలో నిర్వహించనున్నట్లు కమిషన్ తెలిపింది. మెయిన్ పరీక్షలను ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో నిర్వహించనున్నట్లు వివరించింది. పరీక్షలకు వారం రోజుల ముందు నుంచి పరీక్ష సమయం కంటే 4 గంటల ముందు వరకు వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. వివిధ కారణాలతో 2022లో విడుదల చేసిన గ్రూప్–1 నోటిఫికేషన్ రద్దు చేయగా... అప్పుడు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కూడా మళ్లీ తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని, ఫీజు మాత్రం చెల్లించక్కర్లేదని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. ప్రిలిమినరీ పరీక్షను ఓఎంఆర్ (ఆప్టికల్ మార్కింగ్) లేదా సీబీఆర్టీ (కంప్యూటర్ బేస్డ్) పద్ధతిలో నిర్వహించనున్నట్లు తెలిపింది. పోస్టుల వారీగా అర్హతలు, పరీక్షల నిర్వహణ, మార్కులు, సిలబస్ తదితర పూర్తిస్థాయి వివరాలతో కూడిన నోటిఫికేషన్‌ను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. పెరిగిన పోస్టుల సంఖ్య మహిళలకు హారిజాంటల్ (సమాంతర) పద్ధతి (ప్రత్యేకంగా ఎలాంటి రోస్టర్ పాయింట్ మార్కింగ్ లేకుండా)లో రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఈ నేపథ్యంలో మహిళలకు కేటగిరీల వారీగా పోస్టులను ప్రత్యేకంగా రిజర్వ్ చేయలేదు. కానీ మొత్తంగా 33 1/3 (33.3) శాతం ఉద్యోగాలను మాత్రం కేటాయించనుంది. ఈ క్రమంలో మల్టీజోన్ల వారీగా పోస్టులు, అదేవిధంగా జనరల్ కేటగిరీతో పాటు కమ్యూనిటీ రిజర్వేషన్ల వారీగా ఉన్న పోస్టులను కమిషన్ వెల్లడించింది. తాజా నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్య 60 పెరగడం గమనార్హం. పరిస్థితులపై చర్చించి రద్దు నిర్ణయం గ్రూప్–1 ఉద్యోగ నియామకాల విషయంలో నెలకొన్న పరిస్థితులపై టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎం.మహేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కూలంకషంగా చర్చించామని, 2022 ఏప్రిల్ 26న జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నామని టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్ నికొలస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. అసలేం జరిగిందంటే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా భారీ సంఖ్యలో గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ 2022 ఏప్రిల్ 26న నోటిఫికేషన్ జారీ చేసింది. అవకతవకలకు తావు లేకుండా ఉద్యోగాల భర్తీ కోసం అప్పటి ప్రభుత్వం ఇంటర్వ్యూలను రద్దు చేసింది. 503 ఉద్యోగాల కోసం ఏకంగా 3,80,081 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2022 అక్టోబర్ 16న గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షలను నిర్వహించింది. అదే ఏడాది చివర్లో పెద్ద సంఖ్యలో అభ్యర్థులకు అవకాశం కల్పించే లక్ష్యంతో 1:50 నిష్పత్తిలో అర్హుల జాబితాను విడుదల చేసింది. 2023 ఏడాది ఆగస్టులో మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించడంతో అభ్యర్థులు కఠోర దీక్షతో సన్నద్ధతను ప్రారంభించారు. కానీ గతేడాది మార్చిలో పలు టీఎస్పీఎస్సీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగు చూసింది. గ్రూప్–1 ప్రశ్నపత్రాలు సైతం బయటకు వెళ్లాయని తేలడంతో ప్రిలిమినరీ పరీక్షను కమిషన్ రద్దు చేసింది. 2023 జూన్ 11న మరోమారు ప్రిలిమ్స్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అయితే రెండోసారి టీఎస్పీఎస్సీ ప్రిలిమ్స్ నిర్వహించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. పరీక్ష నిర్వహణలో లోపాలు జరిగాయని నిర్ధారిస్తూ హైకోర్టు పరీక్ష రద్దుకు ఆదేశించింది. దీనిపై టీఎస్పీఎస్సీ సుప్రీకోర్టును ఆశ్రయించింది. అ తర్వాత రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగడం, కా>ంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేపట్టడం, కొత్త కమిషన్‌ను ఏర్పాటు చేయడం, కొత్తగా మరో 60 గ్రూప్–1 ఖాళీలను గుర్తించడం లాంటి పరిణామాలు వరుసగా చోటు చేసుకున్నాయి. తాజాగా గ్రూప్–1 నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించడంతో గత కొంతకాలంగా నెలకొన్న గందరగోళానికి తెరపడింది. పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతించినట్లు కమిషన్ తెలిపింది. అయితే గత నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన టీఎస్పీఎస్సీ..ఏ కారణాలతో రద్దు చేసిందీ పూర్తిస్థాయిలో వివరించలేదు. ప్రిలిమ్స్ మూడోసారి..! రికార్డు స్థాయిలో గ్రూప్–1 ఉద్యోగ ఖాళీలు ఉండడంతో గతంలో నిరుద్యోగులు ఎన్నో ఆశలతో దరఖాస్తు చేసుకున్నారు. కానీ కఠోర దీక్షతో అభ్యర్థులు పడిన శ్రమ వృథా ప్రయాసే అయ్యిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నోటిఫికేషన్ వెలువడి దాదాపు రెండు సంవత్సరాలు కాగా.. అభ్యర్థులు ఇప్పటికే రెండుసార్లు ప్రిలిమినరీ పరీక్షలు రాయడం గమనార్హం. కాగా కొత్త నోటిఫికేషన్ జారీతో మూడోసారి ప్రిలిమ్స్ రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
ఉద్యోగ నియామకాలు డౌన్
ముంబై: కార్యాలయ ఉద్యోగ నియామకాలు ఆగస్ట్ నెలలో క్షీణత చూశాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోలి్చనప్పుడు 6 శాతం తక్కువగా నమోదయ్యాయి. ముఖ్యంగా ఐటీ, బీమా, ఆటోమొబైల్, హెల్త్‌కేర్, బీపీవో రంగాల్లో నియామకాల పరంగా అప్రమత్త ధోరణి కనిపించింది. ఈ ఏడాది ఆగస్ట్ నెలలో 2,566 ఉద్యోగాలకు సంబంధించి పోస్టింగ్‌లు పడ్డాయి. క్రితం ఏడాది ఇదే నెలలో ఇవి 2,828గా ఉన్నట్టు నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ నివేదిక వెల్లడించింది. నౌకరీ సంస్థ తన పోర్టల్‌పై జాబ్ పోస్టింగ్‌లు, ఉద్యోగ అన్వేషణల డేటా ఆధారంగా ప్రతి నెలా నివేదిక విడుదల చేస్తుంటుంది. ఇక ఈ ఏడాది జూలై నెలలో పోస్టింగ్‌లు 2,573తో పోలిస్తే కనుక ఆగస్ట్‌లో నియామకాలు 4 శాతం పెరిగాయి. ఆయిల్ అండ్ గ్యాస్, హాస్పిటాలిటీ, ఫార్మా రంగాల్లో నియామకాల పట్ల ఆశావహ ధోరణి కనిపించింది. ‘‘ఐటీలోనూ సానుకూల సంకేతలు కనిపించాయి. గడిచిన కొన్ని నెలలుగా ఐటీలో నియామకాలు తగ్గగా, సీక్వెన్షియల్‌గా (జూలైతో పోలిస్తే) ఐటీలో నియామకాలు పెరిగాయి. కార్యాలయ ఉద్యోగాల మార్కెట్లో సాధారణ పరిస్థితులు తిరిగి ఏర్పడుతున్నదానికి ఇది ఆరోగ్యకర సంకేతం’’అని నౌకరీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ వెల్లడించారు. ఐటీలో 33 శాతం డౌన్ ఐటీ రంగంలో నియామకాలు క్రితం ఏడాది ఆగస్ట్‌తో పోలి్చనప్పుడు, ఈ ఏడాది అదే నెలలో 33 శాతం తక్కువగా నమోదయ్యాయి. బీమా రంగంలో 19 శాతం, ఆటోమొబైల్ రంగంలో 14 శాతం, హెల్త్‌కేర్ రంగంలో 12 శాతం, బీపీవో రంగంలో 10 శాతం చొప్పున నియామకాలు తగ్గాయి. ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో నియామకాల పరంగా 17 శాతం వృద్ధి నమోదైంది. అహ్మదాబాద్, ముంబై, చెన్నై, హైదరాబాద్‌లో ఆయిల్ అండ్ గ్యాస్ రంగ నియామకాలు ఎక్కువగా చోటు చేసుకున్నాయి. 16 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన నిపుణులకు డిమాండ్ ఎక్కువగా కనిపించింది. ఆతిథ్య రంగం (హాస్పిటాలిటీ)లోనూ నియామకాలు బలంగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోలి్చనప్పుడు 14 శాతం వృద్ధి కనిపించింది. ఆర్అండ్డీపై దృష్టి పెరగడంతో ఫార్మా రంగంలో 12 శాతం అధికంగా నియామకాలు జరిగాయి. అహ్మదాబాద్, చెన్నైలో ఎక్కువగా ఫార్మా అవకాశాలు లభించాయి. ఏఐ ఉద్యోగాల్లోనూ 8 శాతం వృద్ధి కనిపించింది. మెషిన్ లెరి్నంగ్, ఏఐ సైంటిస్ట్, డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్‌ల ఉద్యోగ నియామకాలు కూడా పెరిగాయి. -
శ్రీకాకుళం: వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ
శ్రీకాకుళం అర్బన్: కలెక్టర్ ఉత్తర్వుల మేరకు జాతీయ ఆరోగ్య మిషన్ కింద జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె.చంద్రానాయక్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సైకియాట్రిస్ట్, ఫోరెన్సిక్ స్పె షలిస్ట్, జనరల్ ఫిజీషియన్, ఎన్పిసీడీఎస్ కింద కార్డియాలజిస్ట్, ఎన్పీసీడీఎస్ కింద మెడికల్ ఆఫీ సర్, ఎన్‌బీఎస్‌యూసీ కింద మెడికల్ ఆఫీసర్, స్టాఫ్‌నర్సులు, సైకియాట్రిస్ట్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫిజియోథెరఫిస్ట్లు, ఆడియో మెట్రిషియన్, సోషల్ వర్కర్లు, క్వాలిటీ మానిటర్ కన్సల్టెంట్, హాస్పిటల్ అటెండెంట్, శాని టరీ అటెండెంట్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకూ అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. అర్హులైన అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పూర్తి వివరాల కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.శ్రీకాకుళం.ఏపీ.జీవోవి.ఇన్ నుంచి సమాచారం పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇవీ చదవండి: కూరగాయలు అమ్ముతున్న ఐఏఎస్ అధికారి.. అసలు నిజం ఇదే! ఇంటర్లో సీఈసీ చేశారా.. ఈ కెరీర్ అవకాశాలు మీకోసమే -
‘జానారెడ్డి కూడా అసత్యాలకు మొగ్గు చూపడం బాధాకరం’
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాల భర్తీ విషయంలో అసత్యాలతో ప్రజలను గందరగోళ పరిచేందుకు ప్రతిపక్షాలు కొత్త నాటకాన్ని మొదలుపెట్టాయని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు విమర్శించారు. ఇందులో భాగంగానే నిజాలను దాచి పెడుతున్నాయని మండిపడ్డారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 2020 వరకు రాష్ట్రంలో 1,32,899 ఉద్యోగాలు భర్తీ చేశామని, అనుమానాలుంటే ఆయా శాఖల్లో ధ్రువీ కరించుకోవాలని సూచించారు. ఉద్యోగాల కల్ప నపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నా యంటూ ప్రభుత్వ శాఖల వారీగా భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలతో కూడిన బహిరంగ లేఖను కేటీ రామారావు గురువారం విడుదల చేశారు. నిజాలను జీర్ణించుకోలేకే.. ‘నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిగొస్తుందన్న సామెత రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు సరిగ్గా సరిపోతుంది. 2014 నుంచి వివిధ శాఖల్లో భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్యను మీడియా ద్వారా అంకెలతో సహా సాధికారికంగా వివరించా. ఈ నిజాలను జీర్ణించుకోలేని విపక్షాలు అసత్యాలతో తెలంగాణ యువతను గందరగోళానికి గురి చేసేం దుకు ప్రయత్నిస్తున్నాయి’అని కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. ‘జానారెడ్డి లాంటి సీనియర్ రాజ కీయ నేత కూడా ఈ అసత్యాలను వల్లెవేసేందుకే మొగ్గు చూపడం బాధాకరం. అధికారంలోకి వస్తే ఉద్యోగాలు ఇస్తామనే హామీ మేరకు మేం పాలన పగ్గాలు చేపట్టిన నాటి నుంచి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూనే ఉన్నాం. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఉద్యోగ నియామకాల వివరాలు ఇస్తా మనే జానారెడ్డి ప్రకటనను స్వాగతిస్తున్నా.. అం దులో తెలంగాణ యువతకు ఎన్ని ఉద్యోగాలి చ్చారో కూడా చెప్పాలని కోరుతున్నా.. ప్రభుత్వ శాఖల్లో అవసరమైన ఖాళీలను భర్తీ చేస్తూనే రాష్ట్ర పారిశ్రామిక విధానం టీఎస్ఐపాస్ ద్వారా ప్రైవేటు రంగంలో సుమారు 14 లక్షల ఉద్యోగాలను కల్పిం చాం..’అని వెల్లడించారు. ప్రైవేటు రంగంలో ఉద్యో గాల కల్పన చేపడుతూనే ప్రభుత్వ శాఖల్లో ఉద్యో గాల భర్తీ విషయంలో అత్యంత పారదర్శకత పాటించినట్లు కేటీఆర్ తెలిపారు. ఉమ్మడి ఏపీలో పబ్లిక్ సర్వీస్ కమిషన్‌పై అవినీతి ఆరోపణలు ఉండేవని, టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ అత్యంత పారదర్శకంగా జరిగిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని నిరంతర ప్రక్రియగా పేర్కొంటూ, తాజాగా మరో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఉద్యోగాల భర్తీ ప్రకియను వేగంగా పూర్తి చేస్తామని, ఇందులో ఎవరికీ సందేహాలు అవసరం లేదన్నారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన నాటి నుంచి యువతకు ఉద్యోగాలు కల్పించడంలో గత ప్రభుత్వాలతో పోలిస్తే ఎక్కువ నిబద్ధత, చిత్తుశుద్దితో పనిచేస్తున్న టీఆర్ఎస్కు అండగా నిలబడాలని, కొన్ని పార్టీలు, నాయకులు పనిగట్టుకొని చేసే అసత్య ప్రచారాల ప్రభావానికి లోనుకాకుండా యువత ఆలోచించాలని కేటీఆర్ తన లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు కల్పించిన 1,32,899 ప్రభుత్వ ఉద్యోగాల వివరాలను కేటీఆర్ శాఖల వారీగా వెల్లడించారు. -
ఫ్లిప్‌కార్ట్‌లో 70వేల ఉద్యోగాలు
న్యూఢిల్లీ : ప్రముఖ రీటైల్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ భారీగా సీజనల్ ఉద్యోగ నియామకాలకు తెరతీసింది. పండుగ సీజన్‌తో పాటు తన బిగ్ బిలియన్ డేస్ సేల్స్ ఆఫర్ రోజుల సందర్భంగా నెలకొనే డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా 70వేల ప్రత్యక్ష, లక్షలాది పరోక్ష ఉద్యోగ అవకాశాల్ని కల్పిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇందులో ప్రత్యక్ష నియామకాల్ని తన సప్లై చెయిన్‌లో ఎగ్జిక్యూటివ్స్, పిక్కర్స్, ప్యాకర్స్, సార్టర్స్ పోస్టుల్లో భర్తీ చేయనుండగా, పరోక్ష ఉద్యోగ అవకాశాల్ని తన అమ్మకపు భాగస్వామ్య లొకేషన్లు, కిరాణషాపుల్లో కల్పించనుంది. సప్లయి చైన్ విస్తరణ, బలోపేతంతో రానున్న పండుగల సీజన్లో లక్షల మంది ఈ–కామర్స్ కస్టమర్లు ఆన్లైన్లో సాఫీగా షాపింగ్ చేసుకునే సౌకర్యాన్ని కలి్పంచేందుకు ఈ భారీ నియామకాలను చేపట్టినట్లు కంపెనీ తెలిపింది. కొత్తగా ఎంపికైన వారికి కస్టమర్ సర్వీస్, డెలివరీ, ఇన్స్టాలేషన్, సేఫ్టీ, శానిటైజేషన్‌తో పాటు పీఓఎస్ మెషీన్లు, స్కానర్లు, మొబైల్ అప్లికేషన్లను ఆపరేట్ చేయడం తదితర అంశాల్లో శిక్షణ ఇస్తామని కంపెనీ పేర్కొంది. ‘‘ఈ–కామర్స్ వ్యవస్థ పురోగతికి అదనపు అవకాశాల సృష్టి అవసరం. ఇది కేవలం పరిశ్రమకు పరిమితం కాకుండా కస్టమర్ల ప్రయోజనాలకు ముఖ్యమే.’’ అని ఫ్లిప్‌కార్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమితేష్ ఝా అన్నారు. ఆర్డర్లను చివరి మైలురాయి వరకు చేర్చేందుకు దేశంలో 50 వేల చిన్న కిరాణాషాపులు, పెద్ద హోల్‌సేల్ దుకాణాలతో ఫ్లిప్‌కార్ట్ గతవారం ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ కామర్స్ కంపెనీలు పండుగ సీజన్లో వచ్చే ఆర్డర్ల దృష్ట్యా భారీగా ఉద్యోగ సామర్థ్యాన్ని పెంచుకుంటాయి. గతేడాదిలో ఇదే పండుగ సీజన్లో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ కంపెనీలు దాదాపు 1.4లక్షల తాత్కాలిక ఉద్యోగాలను నియమించుకున్నాయి. ఇక ఇప్పటికే లాజిస్టిక్స్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఈ–కామ్ ఎక్స్‌ప్రెస్ 30,000 ఉద్యోగాలను ప్రకటించింది. -
ఎస్సీ, ఎస్టీలకు అర్హత మార్కులు తగ్గింపు
సాక్షి, అమరావతి: ‘సచివాలయ’ ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీలకు రాతపరీక్షల్లో కనీస అర్హత (క్వాలిఫై) మార్కులను తగ్గించారు. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన పోస్టులకు సరిపడా ఆయా కేటగిరీల అభ్యర్థులు రాత పరీక్షల్లో కనీస మార్కులు తెచ్చుకోలేని జిల్లాల్లో.. లేని పోస్టుల్లో మాత్రమే అర్హత మార్కులు తగ్గించి, ఆ పోస్టులను భర్తీ చేయాలని ఇప్పటికే పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ కేటగిరీల్లో జిల్లాల్లో పోస్టులు పూర్తిగా భర్తీ కాని వాటికి కనీస అర్హత మార్కులు తగ్గించి, నియమించడానికి కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా ఎంపిక కమిటీ(డీఎస్సీ)లు చర్యలు చేపట్టాయి. సచివాలయ ఉద్యోగ రాతపరీక్షల్లో ఓసీలకు 60, బీసీలకు 52.50, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 మార్కులను కనీస అర్హత మార్కులుగా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ కనీస అర్హత మార్కులు తెచ్చుకున్న వారినే ఉద్యోగం పొందేందుకు అర్హులుగా పేర్కొంటూ డీఎస్సీలు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు పిలుస్తున్నాయి. అయితే.. పలు జిల్లాల్లో వివిధ రకాల ఉద్యోగాల రాతపరీక్షల్లో కనీస అర్హత మార్కులు తెచ్చుకున్న వారు తగినంత మంది లేక ఖాళీలు మిగిలిపోయాయి. నిర్దేశిత అర్హత మార్కులు సాధించినవారు లేక.. 1,26,728 సచివాలయ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 1–8 మధ్య పరీక్షలు జరిగాయి. జిల్లాల్లో పోస్టుల వారీగా, రిజర్వేషన్ల వారీగా భర్తీ చేయాల్సిన ఉద్యోగాలకు సరిపడా అర్హత సాధించిన వారు లేక శనివారం సాయంత్రం వరకు 1,01,454 మంది అభ్యర్థులకు మాత్రమే డీఎస్సీలు కాల్‌లెటర్లు పంపాయి. సచివాలయ ఉద్యోగాల నోటిఫికేషన్లోనే అవసరమైన జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కనీస అర్హత మార్కులు తగ్గిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లాల్లో పోస్టులవారీగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కేటాయించినవాటికి కనీస అర్హత మార్కులను తగ్గించి సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాలని వారికి సమాచారం పంపుతున్నారు. ఈ పోస్టులను ఈ నెల 14లోపు ముగించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. సీఎం నిర్ణయం మేరకు జనరల్, బీసీ కేటగిరీల కటాఫ్ తగ్గింపు! పలు జిల్లాల్లో వివిధ రకాల ఉద్యోగాలు బీసీ, జనరల్ కేటగిరీల్లో మిగిలిపోయినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ కేటగిరీల అభ్యర్థులకు రాత పరీక్షల్లో కనీస అర్హత మార్కులు తగ్గించాలంటే ముఖ్యమంత్రి స్థాయిలో లేదా రాష్ట్ర మంత్రివర్గం ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అక్టోబర్ 15న జిల్లాల వారీగా జనరల్, బీసీ కేటగిరీల్లో మిగిలిపోయే పోస్టుల వివరాలను ప్రభుత్వం ముందు ఉంచనున్నట్టు తెలిపారు. ఆ తర్వాత కటాఫ్ తగ్గింపుపై స్పష్టత ఉండొచ్చని అంటున్నారు. -
కొలువులపై టెక్నాలజీ దెబ్బ
గతమంతా ఘనం.. భవిష్యత్ అంతా గందరగోళం అన్నట్లు..! ఒక్కసారి గతంలో ఉద్యోగాలు ఎలా ఉండేవో గుర్తుకు తెచ్చుకోండి. ఉద్యోగాలకు భద్రత ఉండేది. కొంత అనుభవం సంపాదిస్తే.. ప్రమోషన్ గ్యారెంటీ..! అనే నమ్మకంఉండేది. జీతం తక్కువైనా ఖర్చులు తక్కువకాబట్టి ఆదాయ భద్రత ఎక్కువగా ఉండేది.ఇప్పుడు ప్రపంచం వేగంగా మారిపోతోంది. ఈరోజున్న జాబ్ రేపు ఉంటుందన్న గ్యారెంటీలేదు. ప్రస్తుతం మీకు ఎంత టాలెంట్ ఉన్నా.. మీనైపుణ్యాలను మెరుగుపరచుకోకుంటే మూడేళ్లతర్వాత మీ ఉద్యోగం ఊడినట్లే..! అంటున్నారునిపుణులు. ఎందుకంటే.. ప్రతి మూడేళ్లకోసారిటెక్నాలజీ సమూలంగా మారిపోతుండటమే! ఓతాజా నివేదిక ప్రకారం భారత జాబ్మార్కెట్లోనియామకాల పరిస్థితి గతంలో ఎన్నడూలేనంత అస్థిరంగా మారింది. ఈ నేపథ్యంలోజాబ్ మార్కెట్లో తాజా హైరింగ్ ట్రెండ్స్ ఎలాఉన్నాయి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగంసొంతం కావాలన్నా.. కొలువులో మనుగడసాగించాలన్నా.. ఏం చేయాలోతెలుసుకుందాం... సాక్షి భవిత, జాబ్ ట్రెండ్స్ :టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులు సంభవిస్తున్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ), డేటా అనలిటిక్స్, రోబోటిక్స్, త్రీడీ ప్రింటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), క్లౌడ్ కంప్యూటింగ్ కారణంగా టెక్నాలజీ రంగంలో రాకెట్ వేగంతో మార్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఆటోమేషన్ విస్తరణ కారణంగా... ప్రపంచవ్యాప్తంగా వ్యాపార వాణిజ్యం రంగంలో, ఉత్పత్తి ప్రక్రియలో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. కంపెనీలు వ్యయ నియంత్రణలో భాగంగా టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. దాంతో గతంలో ఏ పదేళ్లకో మార్పులకు లోనయ్యే జాబ్ మార్కెట్.. ఇప్పుడు మూడేళ్లకే పూర్తిగా మారిపోతోంది. కాబట్టి ఈ టెక్నాలజీని ఎంత సమర్థంగా అందిపుచ్చుకోగలరు అనే దానిపైనే మీ కెరీర్ గమనం ఆధారపడి ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు టెక్నాలజీ నేటి మంత్రం కంపెనీలు ఆన్లైన్ కస్టమర్స్‌తో మాట్లాడేందుకు చాట్ బోట్స్‌ను ఉపయోగిస్తున్నాయి. దాంతో ఇంతకాలం కస్టమర్ సర్వీస్, కాల్ సెంటర్స్‌లో ఈ పనిచేసిన సిబ్బంది అవసరం లేకుండా పోయింది. అంతేకాదు ఉదాహరణకు ఐబీఎం వాట్సన్ కంప్యూటర్లో నిక్షిప్తిమైన రోగిæ.. రోగ చరిత్రనంతా స్కాన్ చేసి అత్యంత కచ్చితత్వంతో రోగాన్ని విశ్లేషించి.. వ్యాధి నివారణకు ఏం చేయాలో సలహా ఇస్తుంది. తద్వారా సంబంధిత నిపుణుల పాత్ర నామమాత్రంగా మారుతోంది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి సేవల రంగం వరకూ.. టెక్నాలజీ సాయంతో గతంలో ఒక పని పూర్తిచేసేందుకు నాలుగు గంటల సమయం అవసరమైతే.. ఇప్పుడు ఆ పని క్షణాల్లో పూర్తి కచ్చితత్వంతో పూర్తవుతోంది. తద్వారా కంపెనీలకు ఖర్చు తగ్గ డంతోపాటు తక్కువ సమయంలోనే ఎక్కువ ఉత్పత్తి సాధ్యమవుతోంది. అందుకే కంపెనీలు మానవ వనురులపై ఆధారపడటం తగ్గించేస్తున్నాయి. నైపుణ్యం ప్రస్తుతమున్న నైపుణ్యాలనే పట్టుకొని కూర్చుంటే.. మీరు రోడ్డునపడటం ఖాయమంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. మార్పు నేటి తారకమంత్రం కాబట్టి! ఉదాహరణకు.. గతంలో బుక్కీపింగ్ తెలిసుంటే చాలు.. అకౌంటెంట్ ఉద్యోగం ఖాయంగాలభించేది, జీవిత కాలంపాటు కొనసాగేది. కొన్నేళ్ల క్రితమే బుక్కీపింగ్ స్థానంలో.. అకౌంటింగ్ సాఫ్ట్వేర్ వచ్చి చేరింది. ఆ సమయంలో అకౌంటింగ్ సాఫ్ట్వేర్ నైపుణ్యం లేనివారందరూ ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. ఇదే అకౌంటింగ్ జాబ్స్‌పై కొద్దికాలం క్రితం అమల్లోకి వచ్చిన జీఎస్టీ పెద్ద దెబ్బ కొట్టింది. జీఎస్టీ వచ్చాక ఈ అకౌంటెంట్స్‌పై ఆధార పడటం తగ్గిపోయింది. అంటే.. ప్రస్తుతం అమలుచేసిన జీఎస్టీ కారణంగా మారిన కంపెనీల అవసరాలకు తగ్గట్లు కొత్త నైపుణ్యాలున్న వారికే జాబ్ మార్కెట్లో అవకాశం లభిస్తుంది. నాలెడ్జ్ ఇప్పుడు మీరు సంపాదించిన నాలెడ్జ్ ఒక్క ఏడాది కళ్లు మూసుకుంటే ఎందుకూ కొరగాకుండా పోతుందంటే నమ్ముతారా..! నమ్మాలంటున్నారు మేధావులు. దీనికి కూడా టెక్నాలజీ విప్లవమే కారణం!! అంతేకాకుండా ఒక డాక్టర్, ఒక లాయర్, ఇంజనీర్ అందించే సేవల నాణ్యత.. ఆ సేవలకు ఎంత చెల్లించొచ్చో డేటా అనలిటిక్స్ వంటి వాటి ద్వారా క్షణాల్లో అంచనాకు వస్తున్నాయి కంపెనీలు. దాంతో సంస్థలు ఇస్తున్న వేతనానికి ఉద్యోగుల నాలెడ్జ్ స్థాయి, పనితీరు ఏమాత్రం తగ్గినా.. పింక్ స్లిప్ వెలాడుతున్నట్లే! మరోవైపు తక్కువ వేతనానికి నాణ్యమైన పనితీరు చూపే యువత అందుబాటులో ఉంటే.. సీనియర్ నిపుణులకు భారీ జీతాలు చెల్లించడం భారమని కంపెనీలు భావిస్తున్నాయి. ఫలితంగానే పింక్ స్లిప్‌ల పరంపర మొదలవుతోందని చెబుతున్నారు. ఇటీవలే ఓ ప్రముఖ ఐటీ కంపెనీ 1000 మంది సీనియర్ ఉద్యోగులను ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. అందుకు సదరు సీనియర్ ఉద్యోగులు టెక్నాలజీ పరంగా అప్డేట్ కాకపోవడం ఒక కారణమైతే.. వారికి జీతాలు భారీగా ఉండటం మరో కారణమట! కాబట్టి ఉద్యోగులు ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నాలెడ్జ్ పెంచుకుంటూæ... మంచి ఫలితాలు చూపితేనే కెరీర్లో మనుగడ సాధ్యమవుతుంది. నిరంతర అధ్యయనం స్టే క్యూరియస్, స్టే హంగ్రీ.. అనేది నేటి కెరీర్ మంత్రం. ప్రస్తుత నైపుణ్యాలు జాబ్ మార్కెట్‌కు పనికిరాకుండాపోతే.. ఇక ముందున్న ఏకైక మార్గం.. కొత్త స్కిల్స్‌ను వేగంగా నేర్చుకోవడమే! ఇందుకోసం ఆయా అంశాలపై ఆసక్తి పెంచుకోవాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వేగంగా అందిపుచ్చుకోవాలి. నిత్య విద్యార్థిలా మారి.. మూక్స్ వంటి ఆన్లైన్ విధానాల ద్వారా అప్డేట్ కావాలి. నేర్చుకున్నది ఎప్పటికీ వృథా కాదు. నిరంతరం నేర్చుకుంటూ.. సమస్యలను పరిష్కరిస్తూ ఉత్పత్తి పెంచుతున్న ఉద్యోగిని వదులుకోవాలని ఏ కంపెనీ కోరుకోదు. కాబట్టి ఫ్రెషర్స్‌తోపాటు సీనియర్ ఉద్యోగులు కూడా కెరీర్ పరంగా, టెక్నాలజీ పరంగా తాము నేర్చుకోవాల్సిన టెక్నాలజీని, నైపుణ్యాలను సమీక్షించుకోవాలి. గత వారంలో, గత నెలలో ఎలాంటి పనితీరు ప్రదర్శించాం.. ఏఏ కొత్త విషయాలు నేర్చుకున్నాం.. కొత్తగా వస్తున్న టెక్నాలజీ ఏంటి.. ఆ టెక్నాలజీ గురించి మనం ఏం నేర్చుకున్నాం.. నేర్చుకున్న టెక్నాలజీని మన కంపెనీ ప్రొడక్టివిటీ పెంచడంలో ఏమేరకు అన్వయించాం.. ఇలా ప్రతి ఒక్కరూ సమీక్షించుకుంటూ... ఉద్యోగ మనుగడ సాధించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే మేలు నిరంతరం తమ సామర్థ్యాలను సమీక్షించుకుంటూ.. నైపుణ్యాలు మెరుగుపరచుకుంటూ.. టెక్నాలజీని నేర్చుకుంటూ ముందుకు సాగాలి. జాబ్ మార్కెట్‌కు ఉపయోగపడే స్కిల్స్ నేర్చుకోవడంతోపాటు, ప్రత్యామ్నాయ కెరీర్ గురించి ఆలోచిస్తుండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం ద్వారా నేర్చుకునే తపన, పనిచేసే సామర్థ్యం పెంచుకోవాలి. నిపుణుల ప్రసంగాలు వినడం, మంచి పుస్తకాలు చదడం, మనసును చురుగ్గా ఉంచుకోవడం ద్వారా అవుట్‌డేట్ ప్రమాదం నుంచి బయటపడొచ్చు. మనం పనిచేయడమేకాకుండా... తోటి ఉద్యోగులు తమ శక్తిసామర్థ్యాలు పెంచుకొని మరింత బాగా పనిచేసేలా ప్రోత్సహిస్తుండాలని కంపెనీలు కోరుకుంటున్నాయి. -
ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూలు వద్దు
సుల్తాన్‌బజార్ (హైదరాబాద్): రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ద్వారా చేపట్టే ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూలు వద్దని ప్రొఫెసర్, రచయిత కంచె ఐలయ్య ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ప్రభుత్వం వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు నియామకాలు చేపడుతున్న తరుణంలో ఇంటర్వ్యూలు నిర్వహించకుండా రాతపరీక్ష ఆధారంగానే ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. శనివారం హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కంచె ఐలయ్య మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో పోరాటాలు చేసిన యువత.. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తోందని, ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ఇటీవల కాలంలో తాను రాసిన వ్యాసం ఓ దినపత్రికలో ప్రచురిమైందని, ఆ వ్యాసం కొంతమందికి ఇబ్బందికరంగా ఉందని తనపై కుట్ర పూరితంగా ప్రభుత్వం కేసు నమోదు చేయించిందని ఆరోపించారు. ఈ కేసు విషయంలో తనకు ఊరట కల్పించడంపై న్యాయవ్యవస్థకు, అండగా నిలిచిన పలు రాజకీయ పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోనే తొలిసారిగా పరిశోధన రంగంలో ఉన్న రచయితపై ప్రభుత్వం కేసు నమోదు చేయడంపై విచారణ వ్యక్తం చేశారు. తెలంగాణలో రచయితలు, మీడియా, కళాకారులు, గాయకులకు భావస్వేచ్ఛ ఏ విధంగా ఉండాలనే నియమ నిబంధనలను ప్రకటించి, ఆయా రంగాలకు సలహాలు, సూచనలు చేసేందుకు ఓ కమిటీని వేయాలని కంచె ఐలయ్య ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు.