జీఎస్టీతో వారికి 5 లక్షల ఉద్యోగాలు
జీఎస్టీతో వారికి 5 లక్షల ఉద్యోగాలు
Published Thu, Jun 1 2017 4:30 PM | Last Updated on Tue, Sep 5 2017 12:34 PM
ఇండోర్ : స్వాతంత్య్రానంతరం దేశంలో అమలుకాబోతున్న అతిపెద్ద పన్ను సంస్కరణ జీఎస్టీ. ఇంకో నెలలో ఇది అమల్లోకి రాబోతుంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలు జీఎస్టీ బిల్లులను ఆమోదించే ప్రక్రియలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో జీఎస్టీ అమలు, కంప్యూటర్ ఆపరేటర్ల కోసం ఐదు లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించనుందని కేంద్ర స్కిల్ డెవలప్ మెంట్ అండ్ ఎంటర్ ప్రిన్యూర్షిప్ సహాయమంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ తెలిపారు. జీఎస్టీని అమల్లోకి తీసుకొచ్చిన అనంతరం ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీతోపాటు ఫైనాన్స్ సంబంధిత సబ్జెట్స్ లో అవగాహన కలిగి ఉన్న కనీసం ఐదు లక్షల మంది కంప్యూటర్ ఆపరేటర్లు అవసరం పడతారని కేంద్రమంత్రి చెప్పారు.
విద్యానగర్ ఏరియాలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను ప్రారంభించిన అనంతరం ఆయన రిపోర్టర్లతో మాట్లాడారు. దేశంలో ఉద్యోగాలు పోతున్నాయన్న ఆరోపణలపై స్పందించిన మంత్రి, ప్రభుత్వం ఔత్సాహిక నైపుణ్యాలను అందించడం, స్వయం ఉపాధి కలిగిచడంపై దృష్టిపెట్టినట్టు తెలిపారు. దేశంలోని తమ యువతను ఉద్యోగం కోరే వారి లాగా, ఉద్యోగం ఇచ్చే వారిలాగా చూడాలనుకుంటున్నట్టు చెప్పారు.
Advertisement