Rajiv Pratap Rudy
-
‘ఢిల్లీకి పిలిపించి షా షాకిచ్చారు’
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో పదవికి రాజీనామా చేసిన తొలివ్యక్తి రాజీవ్ ప్రతాప్ రూడీ. రాజీనామా అనంతరం తొలిసారిగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాజీనామా నిర్ణయం తాను తీసుకోలేదని, బీజేపీ అధిష్టానం చెప్పిన మేరకు పదవిని వదులుకున్నానని స్పష్టం చేశారు. దాంతోపాటుగా తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పరిశ్రమల శాఖ మాజీ మంత్రి వెల్లడించారు. గురువారం రోజు ఇండిగో విమానంలో భార్యతో సహా న్యూఢిల్లీ నుంచి బిహార్ రాజధాని పాట్నాకు వెళ్లారు. అక్కడ ఎయిర్ పోర్టులో తన సెల్ ఫోన్ స్విచ్ఛాన్ చేయగానే కొన్ని సందేశాలు వచ్చినట్లు చెప్పారు. అమిత్ షా తనను కలవాలని చెప్పినట్లు ఢిల్లీలోని తన కార్యాలయం నుంచి మెసేజ్ వచ్చినట్లు తెలిపారు. భార్యను ఇంటికి వెళ్లమని చెప్పిన తాను.. పాట్నాకు వచ్చిన ఇండిగో విమానంలోనే తిరిగి ఢిల్లీ వెళ్లి షాను కలవగా ఆయన చెప్పిన విషయం తనను షాక్ కు గురిచేసిందన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ప్రచార బాధ్యతలు తనకు అప్పగించనున్నారని, ప్రస్తుతం మంత్రి పదవికి రాజీనామా చేయాలని షా సూచించగా ఆ పని చేసినట్లు రూడీ వివరించారు. తాజా కేబినెట్ విస్తరణలో 9 మంది కొత్తవారికి చాన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. -
ప్రధాని మోదీ చైనా వెళ్లడానికి ముందే...
-
రేపే కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ!
రూడీ రాజీనామా, మరో ఐదుగురు కూడా.. న్యూఢిల్లీ : కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ప్రధాని మోదీ చైనా పర్యటనకు ముందే సెప్టెంబర్ 2 సాయంత్రం కేబినెట్ విస్తరణ ఉండొచ్చని తెలుస్తోంది. కేబినెట్లో మార్పులు చేర్పులకు వీలుగా గురువారం రాత్రి కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పరిశ్రమల శాఖ(స్వతంత్ర హోదా) మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ రాజీనామా సమర్పించారు. రాజీనామా చేసిన వారిలో జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి కల్రాజ్ మిశ్రా, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సహాయ మంత్రులు సంజీవ్ బలియాన్, మహేంద్ర పాండే కూడా ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా గురువారం ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మరో 8 మంది కేంద్ర మంత్రుల్ని కలిసి కేబినెట్ విస్తరణపై చర్చించారు. అనంతరం ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బిహార్‌కు చెందిన జేడీయూకు కేబినెట్లో చోటు కల్పించేందుకే రూడీ రాజీనామా చేసినట్లు సమాచారం. రూడీకి పార్టీ బాధ్యతలు అప్పగించనున్నారని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా కేబినెట్ విస్తరణలో జేడీయూతో పాటు అన్నాడీఎంకేకి కూడా చోటు కల్పించనున్నట్లు సమాచారం. అనారోగ్య కారణాలతో ఉమాభారతి రాజీనామా సమర్పించినట్లు భావిస్తున్నారు. పాండే యూపీ బీజేపీ చీఫ్‌గా నియమితులవడంతో ఆయన కూడా రాజీనామా చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్ర కేబినెట్లో రక్షణ, పట్టణాభివృద్ధి, సమాచార, ప్రసార శాఖ, పర్యావరణ శాఖలకు పూర్తి స్థాయి మంత్రులు లేరు. వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతిగా ఎన్నికవడం, అనిల్ దవే మరణం, మనోహర్ పరీకర్ గోవా సీఎంగా వెళ్లడంతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. పునర్వ్యవస్థీకరణలో భాగంగా విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు, వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్‌ల శాఖల మార్పు జరగొచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కారీకి రైల్వే శాఖ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. -
రేపే కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ!
-
ఐటీఐలకు బోర్డు ఏర్పాటు చేస్తాం: కేంద్రం
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ తరహాలో పారిశ్రామిక శిక్షణ సంస్థల(ఐటీఐ)కు జాతీయ స్థాయిలో ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకు తాము పంపిన ప్రతిపాదనలకు మానవవనరుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిందని కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంట్రప్రెన్యూర్షిప్ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూఢీ మీడియాకు వెల్లడించారు. ఐటీఐల్లో ప్రాక్టికల్‌కు 70 శాతం, ఎంచుకున్న సబ్జెక్టుల్లో 30 శాతం మార్కులు ఉండేలా జాతీయస్థాయిలో ఉమ్మడి పరీక్ష నిర్వహించడానికి చర్య లు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల ఏటా 23 లక్షల మంది విద్యార్థులకు సీబీఎస్ఈ బోర్డు తరహాలో సర్టిఫికెట్లు జారీచేయడం వీలవుతుందన్నారు. -
జీఎస్టీతో వారికి 5 లక్షల ఉద్యోగాలు
ఇండోర్ : స్వాతంత్య్రానంతరం దేశంలో అమలుకాబోతున్న అతిపెద్ద పన్ను సంస్కరణ జీఎస్టీ. ఇంకో నెలలో ఇది అమల్లోకి రాబోతుంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలు జీఎస్టీ బిల్లులను ఆమోదించే ప్రక్రియలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో జీఎస్టీ అమలు, కంప్యూటర్ ఆపరేటర్ల కోసం ఐదు లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించనుందని కేంద్ర స్కిల్ డెవలప్ మెంట్ అండ్ ఎంటర్ ప్రిన్యూర్‌షిప్ సహాయమంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ తెలిపారు. జీఎస్టీని అమల్లోకి తీసుకొచ్చిన అనంతరం ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీతోపాటు ఫైనాన్స్ సంబంధిత సబ్జెట్స్ లో అవగాహన కలిగి ఉన్న కనీసం ఐదు లక్షల మంది కంప్యూటర్ ఆపరేటర్లు అవసరం పడతారని కేంద్రమంత్రి చెప్పారు. విద్యానగర్ ఏరియాలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను ప్రారంభించిన అనంతరం ఆయన రిపోర్టర్లతో మాట్లాడారు. దేశంలో ఉద్యోగాలు పోతున్నాయన్న ఆరోపణలపై స్పందించిన మంత్రి, ప్రభుత్వం ఔత్సాహిక నైపుణ్యాలను అందించడం, స్వయం ఉపాధి కలిగిచడంపై దృష్టిపెట్టినట్టు తెలిపారు. దేశంలోని తమ యువతను ఉద్యోగం కోరే వారి లాగా, ఉద్యోగం ఇచ్చే వారిలాగా చూడాలనుకుంటున్నట్టు చెప్పారు. -
యువ ‘సంకల్ప్’
రూ. 4 వేల కోట్లతో నైపుణ్య వృద్ధి పథకం 3.5 కోట్ల మంది యువతకు శిక్షణ యువతకు ‘స్కిల్’ కేంద్రాలు ‘త్రీ ఇడియట్స్‌లో’ పున్షుక్ వాంగ్డూ తెలుసు కదా!! అనుభవాలనే ప్రయోగాలుగా మారుస్తుంటాడు. అలాంటివాళ్లను తయారు చెయ్యటానికి సైన్స్‌పై ఫోకస్ పెట్టి... స్థానిక ఆవిష్కరణల్ని కూడా పాఠ్యాంశాల్లో చేరుస్తామని జైట్లీ చెప్పారు. 600 జిల్లాల్లో ప్రధాన మంత్రి కౌశల్ కేంద్రాలు... 100 అంతర్జాతీయ నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేసి... వీటిలో అత్యాధునిక శిక్షణతో పాటు విదేశీ భాషలు కూడా నేర్పిస్తారట. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలతో ఐటీఐల్ని అనుసంధానిస్తామన్నారు. కాకపోతే ఇపుడు ఐటీఐల పనితీరు అంతంతమాత్రమన్నది తెలియనిదేమీ కాదు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ... ఈ శిక్షణ పొందిన వారికి ఉపాధి కూడా ముఖ్యమే కదా? దేశంలో పెద్దసంఖ్యలో ఉన్న యువత శక్తిసామర్థ్యాలను పూర్తిగా వినియోగించుకోవడానికి ప్రభుత్వం ‘సంకల్ప్’పథకాన్ని ప్రారంభించనుంది. 3.5 కోట్ల మందికి మార్కెట్ అవసరాలకు సరిపోయే శిక్షణ ఇచ్చేందుకు రూ. 4 వేల కోట్లతో స్కిల్ అక్విజిషన్ అండ్ నాలెడ్జ్ అవేర్నెస్ ఫర్ లైవ్లీహుడ్ ప్రమోషన్ ప్రోగ్రామ్(సంకల్ప్)ను 2017–18లో ప్రారంభించనున్నట్లు జైట్లీ తెలిపారు. సామాన్యులకు ఉపయోగపడని విద్యతో ఏం ప్రయోజనముందన్న వివేకానందుడి మాటలను ఆయన ఉటంకించారు. – న్యూఢిల్లీ యువత నైపుణ్యాల అభివృద్ధి కోసం జైట్లీ చేసిన మరికొన్ని ప్రతిపాదనలు.. ► ప్రస్తుతం 60 జిల్లాల్లో ఉన్న ప్రధాన్‌మంత్రి కౌశల్ కేంద్రాలను 600కుపైగా జిల్లాలకు విస్తరించడం. ► విదేశాల్లో ఉద్యోగాల కోసం యత్నించే వారికి అధునాతన శిక్షణ, విదేశీ భాషా కోర్సులు అందించేందుకు దేశవ్యాప్తంగా 100 ఇండియా ఇంటర్నేషనల్ స్కిల్ సెంటర్ల ఏర్పాటు. ► పరిశ్రమల కోసం నైపుణ్యాల వృద్ధికి సంబంధించిన స్కిల్ స్ట్రెంగ్తెనింగ్ ఫర్ ఇండస్ట్రియల్ వాల్యూ ఎన్హాన్స్మెంట్(స్ట్రయివ్) పథకం రెండో దశ ప్రారంభం. దీని కోసం రూ. 2,200 కోట్ల కేటాయింపు. దీని కింద ఐటీఐలలో ఇచ్చే శిక్షణను బలోపేతం చేస్తారు. ► పాఠశాలల్లో అభ్యసన ఫలితాల విశ్లేషణ కోసం వార్షిక మూల్యాంకన విధానం. స్థానికంగా నవకల్పనల ప్రోత్సాహం, లింగ సమానత్వం కోసం ‘ఇన్నోవేషన్ ఫండ్ సెకండరీ ఎడ్యుకేషన్’ఏర్పాటు, విద్యాపరంగా వెనకబడిన 3,479 బ్లాకులపై ప్రత్యేక దృష్టి. ‘స్వయం’ప్రాజెక్టు ద్వారా విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా 350 కోర్సులు. కాగా, ప్రపంచ బ్యాంకు మద్దతు ఉన్న సంకల్ప్, స్ట్రయివ్ ప్రాజెక్టులను కేంద్ర, రాష్ట్రాలు ఉమ్మడిగా నిర్వహిస్తాయి. బడ్జెట్ ప్రతిపాదనలు దేశం లో నైపుణ్యాల అభివృద్ధికి విస్తృతంగా దోహదం చేస్తాయని నైపుణ్యాల అభివృద్ధి, వ్యవస్థాపన మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ పేర్కొన్నారు. -
'సెన్సార్ వివాదంతో సంబంధం లేదు'
న్యూఢిల్లీ: 'ఉడ్తా పంజాబ్' సినిమా సెన్సార్ వివాదంతో తమకు సంబంధం లేదని బీజేపీ ప్రకటించింది. బీజేపీ ఆదేశాలకు అనుగుణంగా సెన్సార్ బోర్డు వ్యవహరించిందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చేసిన ఆరోపణలను తోసిపుచ్చింది. 'ఉడ్తా పంజాబ్' సినిమా విడుదల కాకుండా బీజేపీ అడ్డుకుంటుందన్న ఆప్ ఆరోపణల్లో వాస్తవం లేదని కేంద్ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ అన్నారు. వివాదాలతోనే ఆప్ మనుగడ సాగిస్తోందని, రాజకీయ ప్రయోజనాల కోసమే వివాదాలు సృష్టిస్తోందని మండిపడ్డారు. 'ఉడ్తా పంజాబ్' సినిమాలో చూపించినట్టుగా పంజాబ్ లో మాదకద్రవ్యాల సమస్యలేదని అన్నారు. సినిమాలో కొన్ని సీన్లు కట్ చేయమని సెన్సార్ బోర్డు చెప్పిందని, నియమనిబంధనలకు అనుగుణంగానే అది వ్యవహరించిందని తెలిపారు. సెన్సార్ బోర్డు మార్గదర్శకాలు పాటిస్తే ఎటువంటి ఇబ్బంది ఉందన్నారు. -
పాక్ పర్యటనకు సుష్మా స్వరాజ్
న్యూఢిల్లీ: విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మంగళవారం పాకిస్తాన్లో పర్యటించనున్నారని కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ తెలిపారు. న్యూఢిల్లీలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇస్లామాబాద్ వెళ్లి చర్చలు జరిపి భారత్‌కి ఆమె తిరిగొచ్చాక ఓ ప్రకటన చేస్తారని రాజీవ్ చెప్పారు. పాక్ లో జరగనున్న భద్రతా సదస్సును ముగించుకుని స్వదేశానికి ఆమె విచ్చేసిన తర్వాత పార్లమెంట్ ఉభయసభలలో ఈ విషయంపై చర్చిద్దామన్నారు. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ లో భారత్, పాకిస్తాన్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు ఆదివారం సమావేశమైన విషయం అందరికీ విదితమే. నిర్మాణాత్మకమైన సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవాలని ఇరు దేశాల నేతలు ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. ఇస్లామాబాద్ లో మంగళవారం జరగనున్న భద్రతా సదస్సుకు భారత ప్రతినిధిగా సుష్మా స్వరాజ్ హాజరుకానున్నారు. -
ఏడాదిలో 24 లక్షల మందికి నైపుణ్య శిక్ష
హైదరాబాద్ : దేశ యువతను నిపుణులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన పథకానికి రూపకల్పన చేసిందని కేంద్ర నైపుణ్య అభివృద్ధి శాఖ మంత్రి రాజీవ్ ప్రతాప్‌రూడీ వెల్లడించారు. శుక్రవారం రామంతాపూర్‌లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఎలక్ట్రానిక్స్ ప్రాసెస్ ఇన్స్ట్రుమెంటేషన్ శిక్షణా సంస్థను స్థానిక ఎమ్మెల్యే ఎన్ వి వి ఎస్ ప్రభాకర్‌తో కలసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ మాట్లాడుతూ... ఈ పథకం ద్వారా వృత్తి విద్యలో పది లక్షల మంది యువతకు శిక్షణతో పాటు, ఏడాదిలో 24 లక్షల మందికి నైపుణ్యతలో శిక్షణ ఇచ్చేందుకు తమ ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. శిక్షణ పూర్తి చేసిన వారికి రుణాలు అందేలా కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. 2022 నాటికి దేశ వ్యాప్తంగా 40.20 కోట్ల మందికి నైపుణ్య అభివృద్ది శిక్షణ లక్ష్యం దిశగా ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన పని చేస్తుందన్నారు. -
తెలంగాణకు ‘అసోచామ్’ అవార్డు
సాక్షి, హైదరాబాద్: ‘నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామికవేత్త’ కార్యక్రమానికిగానూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక ‘అసోచామ్’ అవార్డు లభించింది. రాష్ట్రంలో మూడున్నర లక్షల మం దికి ఉపాధి అవకాశాలు కల్పించడం, ఏడు లక్షల మందికి శిక్షణ ఇవ్వడంతో ఈ అవార్డుకు ఎంపికైంది. మంగళవారం ఢిల్లీలో కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూఢీ చేతులమీదుగా కార్మిక శాఖ కార్యదర్శి అవార్డు అందుకోనున్నారు. -
రెండు రాష్ట్రాల్లోనూ అధికారంలోకి వస్తాం
బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి రాజీవ్ ప్రతాప్ రూఢీ సాక్షి, విజయవాడ బ్యూరో: త్వరలో జమ్మూ కశ్మీర్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని, వచ్చేసారి ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లోనూ తమ సర్కార్లు వస్తాయని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి రాజీవ్ ప్రతాప్ రూఢీ చెప్పారు. తాము కోరిన సీట్లు శివసేన ఇవ్వకపోవడంతో మహారాష్ట్రలో ఒంటరిగా పోటీ చేసి అధికారాన్ని చేజిక్కిం చుకున్నామని తెలిపారు. ఆదివారం విజయవాడ శివారు పోరంకిలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడుతో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూఢీ మాట్లాడుతూ ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల పట్ల తమకు అమితమైన గౌరవం ఉందని, అంతమాత్రాన ఆ రాష్ట్రాల్లో తమ పార్టీ బలపడడం ఆగద న్నారు. ఏపీలో ఈ సంవత్సరం పది లక్షల మందిని సభ్యులుగా చేర్పించాలని, ఐదేళ్లలో ఆ సంఖ్య 80 లక్షలకు చేరాలని సూచించారు. పార్టీ అంటే జీవిత భాగస్వామి: వెంకయ్య వెంకయ్యనాయుడు మాట్లాడుతూ తుళ్లూరులో పచ్చగా కనిపించే పొలాలు పోతున్నాయంటే బాధగానే ఉంటుందని, కానీ రాజధాని కోసం తప్పదని చెప్పారు. బీజేపీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, ఎవరైనా పార్టీలోకి రావచ్చని చెప్పిన వెంకయ్య.. పదవుల కోసం వచ్చే వారిని మాత్రం తాను ఆహ్వానించనని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు హరిబాబుకు కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూఢీ సభ్యత్వం ఇవ్వగా మంత్రు లు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావులకు హరిబాబు సభ్యత్వం ఇచ్చారు. ఈ సందర్భంగా లోక్‌సత్తా నేతలతో పాటు కాంగ్రెస్ పార్టీ విజయవాడ నగ ర మాజీ అధ్యక్షుడు అడపా నాగేంద్ర సహా రాష్ట్రంలోని పలువురు నేతలు బీజేపీలో చేరారు. -
బీజేపీ సభ్యత్వ నమోదు ప్రారంభం
బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆదివారం పోరంకిలో ప్రారంభమైంది. కేంద్ర మంత్రులు రాజీవ్ ప్రతాప్ రూడీ, ఎం.వెంకయ్య నాయుడు నుంచి సభ్యత్వం స్వీకరిస్తున్న కె.హరిబాబు విజయవాడ బ్యూరో : త్వరలో జమ్మూ కాశ్మీర్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని, వచ్చేసారి ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లోనూ తమ సర్కార్లు వస్తాయని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి రాజీవ్ ప్రతాప్ రూఢీ చెప్పారు. తాము కోరిన సీట్లు శివసేన ఇవ్వకపోవడంతో మహారాష్ట్రలో ఒంటరిగా పోటీ చేసి అధికారాన్ని చేజిక్కించుకున్నామని తెలిపారు. పోరంకిలో ఆదివారం జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడుతో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూడీ మాట్లాడుతూ.. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలపై తమకు అమితమైన గౌరవం ఉందని, అంతమాత్రాన ఆ రాష్ట్రాల్లో తమ పార్టీ బలపడడం ఆగదని స్పష్టం చేశారు. ఏపీలో ఈ ఏడాది పది లక్షల మందిని సభ్యులుగా చేర్పించాలని, ఐదేళ్లలో ఆ సంఖ్య 80 లక్షలకు చేరాలని సూచించారు. పార్టీ అంటే జీవిత భాగస్వామి: వెంకయ్య కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, తుళ్లూరులో పచ్చగా కనిపించే పొలాలు పోతున్నాయంటే బాధగానే ఉంటుందని, కానీ రాజధాని కోసం తప్పదని, కానీ లక్షల ఎకరాలు కావాలని తాను అనలేదని చెప్పారు. భూములు తీసుకుంటున్న రైతులకు న్యాయం జరగాలన్నారు. పార్టీని జీవిత భాగస్వామిగా భావించాలని, పార్టీ సభ్యత్వం ఒక పవిత్ర బంధమని నాయకులు, కార్యకర్తలకు ఉద్బోధించారు. బీజేపీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, ఎవరైనా పార్టీలోకి రాావచ్చని చెప్పిన వెంకయ్య.. పదవుల కోసం వచ్చే వారిని మాత్రం తాను ఆహ్వానించబోనని స్పష్టం చేశారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వకూడదని, వ్యక్తిత్వం లేని నాయకులే కులం, మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తారని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు మాట్లాడుతూ.. ప్రతి మూడేళ్లకోసారి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. డిసెంబరు 6న అన్ని జిల్లాల్లోనూ ఒకేసారి సభ్యత్వ నమోదును ప్రారంభించాలని నాయకులకు సూచించారు. హరిబాబుకు కేంద్ర మంత్రి రూఢీ సభ్యత్వం ఇవ్వగా మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావులకు హరిబాబు సభ్యత్వం ఇచ్చారు. ఈ సందర్భంగా లోక్‌సత్తా నేతలతో పాటు కాంగ్రెస్ పార్టీ నగర మాజీ అధ్యక్షుడు అడపా నాగేంద్ర సహా రాష్ట్రంలోని పలువురు నేతలు బీజేపీలో చేరారు. కల్యాణ మండపాన్ని ప్రారంభించిన మంత్రి పెనమలూరు : యనమలకుదురులోని శ్రీరామలింగేశ్ర స్వామి ఆలయంలో దాత సంగా నరసింహారావు నిర్మించిన పలు నిర్మాణాలను కేంద్ర మంత్రి వెంకయ్య ప్రారంభించారు. కల్యాణ మండపం, హోమ మండపం, అన్నదాన సత్రాల ప్రారంభోత్సవంగా వైభవంగా నిర్వహించారు. వీరికి పూజారులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమ, మాణిక్యాలరావు స్వామి వారికి పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ అనురాధ, ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మేయర్ కోనేరు శ్రీధర్, ఎంపీపీ కనకదుర్గ, జెడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాసరావు, సర్పంచి మూడే సుభద్ర ఉన్నారు. మంత్రులకు సన్మానం మంత్రులు వెంకయ్య, ఉమ, మాణిక్యాలరావులను దాత నరసింహారావు సన్మానించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ రీజినల్ డెరైక్టర్ చంద్రశేఖర్‌అజాద్, ఏసీ దుర్గాప్రసాద్, ఆలయ కార్యదర్శి ఎన్.భవాని, మాజీ కార్యదర్శి దూళిపాళ్ల సుబ్రమణ్యం, పూజారి సాగర్, పర్యవేక్షకుడు గంగాధర్ పాల్గొన్నారు. -
'శివసేన ఎప్పటికీ మిత్రపక్షమే'
ముంబై: ఎన్నికలు పెట్టిన చిచ్చు నేపథ్యంలో మహారాష్ట్రలో శివసేనతో దాదాపుగా తెగదెంపులు చేసుకున్న బీజేపీ మళ్లీ ఆ పార్టీతో చెలిమికి సిద్ధమవుతున్నట్టుగా కన్పిస్తోంది. ప్రస్తుత పరిణామాలను చూస్తే బీజేపీ-శివసేన చెలిమి మళ్లీ చిగురించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. తాజాగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు మరింత బలాన్ని చేకూర్చాయి. శివసేన తో తమకు శత్రుత్వం లేదని ఆయన తెలిపారు. 'మేము ఎప్పటికీ స్నేహితులమే. భవిష్యత్తుల్లో కూడా మిత్రులుగా కొనసాగే అవకాశం ఉంది' అని ఫడ్నవీస్ పేర్కొన్నారు. అంతకుముందు కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూఢీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. తమ మాజీ భాగస్వామి శివసేనతో చర్చల విషయంలో తాము సున్నితంగానే వ్యవహరిస్తామని అన్నారు. ఇరు పార్టీల మధ్య చర్చల్లో సత్ఫలితాలొస్తాయని ఆశాభావం వ్యక్యం చేశారు. ‘శివసేనతో ఎట్టిపరిస్థితుల్లోనూ చర్చలు జరుపుతాం. మంచి ఫలితాలు వస్తాయనే విశ్వాసం మాకు ఉంది. శివసేనతో సంబంధాల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదు’అని అన్నారు. రాష్ట్రస్థాయిలో కొన్ని అంశాల విషయంలో విభేదాలు ఉన్నమాట నిజమేనంటూ అంగీకరించిన ఆయన.. కేంద్ర ప్రభుత్వంలో తామిరువురం కలిసే పనిచేస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. -
సత్ఫలితాలొస్తాయనే ధీమాతో ఉన్నాం
ముంబై: తమ మాజీ భాగస్వామి శివసేనతో చర్చల విషయంలో తాము సున్నితంగానే వ్యవహరిస్తామని బీజేపీ పేర్కొంది. ఇరు పార్టీల మధ్య చర్చల్లో సత్ఫలితాలొస్తాయని ఆశాభావం వ్యక్తంచేసింది. ఈ విషయమై ఆ పార్టీ రాష్ర్ట వ్యవహారాల ఇంచార్జి, కేంద్ర మంత్రి రాజీవ్‌ప్రతాప్ రూడీ గురువారం మీడియాతో మాట్లాడారు. ‘శివసేనతో ఎట్టిపరిస్థితుల్లోనూ చర్చలు జరుపుతాం. మంచి ఫలితాలు వస్తాయనే విశ్వాసం మాకు ఉంది. శివసేనతో సంబంధాల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదు’అని అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో తామిరువురం కలిసే పనిచేస్తున్నామని, అయితే రాష్ట్రస్థాయిలో కొన్ని అంశాల విషయంలో విభేదాలు ఉన్నమాట నిజమేనంటూ ఆయన అంగీకరించారు. ఎవరు మద్దతిచ్చినా ఆమోదయోగ్యమే మహారాష్ట్ర అభివృద్ధే ఎజెండాగా ముందుకుసాగుతున్న తమకు ఏ పార్టీలుగానీ, స్వతంత్ర ఎమ్మెల్యేలుగానీ మద్దతు ఇచ్చినా అది తమకు ఆమోదయోగ్యమేనన్నారు. ప్రభుత్వానికి ఎన్సీపీ మద్దతు విషయమై ప్రశ్నించగా ఎవరైనా తమ ప్రభుత్వానికి మద్దతు ఇస్తానంటే తాము అందుకు ఆమోదం తెలపకూడదా అంటూ ఆయన ఎదురు ప్రశ్నించారు. మేము అధికారంలో నుంచి దిగిపోవాలని మీరు కోరుకుంటున్నారా అని అడిగారు. మహారాష్ట్ర విషయంలో ఎటువంటి గందరగోళమూ లేదని, తమది సుస్థిర ప్రభుత్వమేనని ఆయన వివరించారు. -
'తమిళనాట కమలం వికసించాలి'
చెన్నై: మహారాష్ట్ర, హర్యానా శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ... ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలలో కూడా పాగా వేయాలని తలపోస్తుంది. ఆ దిశగా అడుగులు వేసేందుకు ఆ పార్టీ చకచక పావులు కదుపుతుంది. 2016లో తమిళనాడు శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల పరిశీలకుడు, కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ అధ్యక్షతన ఆ పార్టీ నేతలు బుధవారం చెన్నైలో సమావేశమైయ్యారు. రాష్ట్రంలోని డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలకు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీని నిలబెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన స్థానిక నాయకులతో చర్చించారు. తమిళనాడు శాసనసభలోని మొత్తం 234 స్థానాలకు గాను 120 సీట్లు కైవసం చేసుకునే దిశగా క్యాడర్‌ను సమాయత్తం చేయాలని ప్రతాప్ రూడీ సదరు నాయకులకు సూచించారు. తమిళనాడులో ప్రస్తుతం ఉన్న పార్టీలకు బీజేపీ ఒక్కటే ప్రత్నామ్నాయ పార్టీ అని బీజేపీ నాయకుడు మురళీదరరావు స్పష్టం చేశారు. తమిళనాడులో ప్రాంతీయ పార్టీల హవానే నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత అక్రమ ఆస్తుల కేసులో జైలు శిక్ష పడింది. ఆపై బెయిల్‌పై విడుదల అయిన విషయం విదితమే. అంతేకాకుండా ఆమె కొన్ని ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు పడింది. దీంతో ఆమె రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు లేవు. అలాగే తమిళనాట మరో పార్టీ డీఎంకే కూడా కుటుంబ రాజకీయాలతో సతమతమవుతుంది. ఇదే అదనుగా భావించిన పార్టీ అగ్రనాయకులు తమిళనాట కమలం వికసింప చేయాలని భావిస్తున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. -
సహాయ మంత్రిగా రూడీ ప్రమాణం
బీజేపీ నాయకుడు రాజీవ్ ప్రతాప్ రూడీ కేంద్ర సహాయ మంత్రి(స్వతంత్ర ప్రతిపత్తి)గా ప్రమాణ స్వీకారం చేశారు. బీహార్ లోని శరణ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 1996లో తొలిసారిగా ఎంపీగా ఎన్నికైయ్యారు. వాజపేయి కేబినెట్ లోనూ సహాయ మంత్రిగా పనిచేశారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాత్ఫుత్ వంశానికి చెందిన రూడీ విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. ఆయనకు కమర్షియల్ పైలట్ లైసెన్స్ కూడా ఉంది. వ్యక్తిగత, కుటుంబ వివరాలు పూర్తిపేరు: రాజీవ్ ప్రతాప్ రూడీ జన్మదినం: 1962 మార్చి 30 జన్మస్థలం: పాట్నా వయసు: 52 భార్య: నీలం రూడీ పిల్లలు: ఇద్దరు కుమార్తెలు పార్టీ: బీజేపీ రాష్ట్రం: బీహార్ రాజకీయ జీవితం 1990లో బీహార్ ఎమ్మెల్యేగా ఎన్నిక 1996లో తొలిసారిగా లోక్‌సభకు ఎన్నిక 1999లో రెండో పర్యాయం లోక్‌సభ ఎంపీగా గెలుపు 2010లో బీహార్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక 2014లో శరణ్ నుంచి లోక్‌సభ ఎంపీగా గెలుపు 2014, నవంబర్ 9న కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం -
గోవా కొత్త సీఎంగా పర్సేకర్
-
గోవా సీఎంగా పర్సేకర్ ప్రమాణస్వీకారం
గోవా కొత్త ముఖ్యమంత్రిగా లక్ష్మీకాంత్ పర్సేకర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఎంపికైన విషయాన్ని తొలుత బీజేపీ సీనియర్ నాయకుడు రాజీవ్ ప్రతాప్ రూడీ తెలిపారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఆయనను కొత్త ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. గోవా ముఖ్యమంత్రి రేసులో ఒకవైపు పర్సేకర్, మరోవైపు ఉపముఖ్యమంత్రి ఫ్రాన్సిస్ డిసౌజా తీవ్రంగా పోటీ పడ్డారు. అయితే అధిష్ఠానం మాత్రం పర్సేకర్వైపే మొగ్గుచూపింది. మనోహర్ పారిక్కర్ కేంద్ర మంత్రిగా వెళ్తుండటంతో ఆయన రాజీనామా చేసిన తర్వాత కొత్త ముఖ్యమంత్రిగా పర్సేకర్‌ను ఎంపిక చేశారు. పర్సేకర్ పేరును పాత ముఖ్యమంత్రి మనోహర్ పారిక్కర్ ప్రతిపాదించగా, ఉపముఖ్యమంత్రి ఫ్రాన్సిస్ డిసౌజా బలపరిచారు. కాగా కొత్త మంత్రివర్గంలో కూడా డిసౌజా ఉప ముఖ్యమంత్రిగానే కొనసాగుతున్నారు. ఎంఎస్సీ, బీఈడీ చదివి, గోవా రాష్ట్ర ఆరోగ్య, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేస్తున్న లక్ష్మీకాంత్ పర్సేకర్ ముందునుంచి బీజేపీలోనే ఉన్నారు. 1956 జూలై 4వ తేదీన యశ్వంత్ పర్సేకర్, చంద్రభాగ పర్సేకర్ దంపతులకు ఈయన జన్మించారు. గోవాలోని మాండ్రెం స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2012లో గోవాలో బీజేపీ విజయకేతనం ఎగరేసిన తర్వాత ఈయన మంత్రిపదవి చేపట్టారు. రాజీనామా చేసిన ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌కు ఈయన అత్యంత విశ్వాసపాత్రుడన్న పేరుంది. -
శివసేన సభ్యులు చేరడం లేదు: రూడీ
ముంబై: మహారాష్ట్రలో బీజేపీ, శివసేన మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగలేదు. బీజేపీ ఏర్పాటు చేయబోయే ప్రభుత్వానికి శివసేన మద్దతు ఇస్తుందా, లేదా అనేది ఇంకా తేలలేదు. అయితే శివసేన పార్టీతో జరుపుతున్న చర్చలు సానుకూలంగా ముగుస్తాయన్న విశ్వాసాన్ని బీజేపీ నాయకుడు రాజీవ్ ప్రతాప్ రూడీ వ్యక్తం చేశారు. శుక్రవారం ఏర్పడబోయే మహారాష్ట్ర ప్రభుత్వంలో శివసేన సభ్యులు చేరడంలేదని ఆయన స్పష్టం చేశారు. రేపు జరగనున్న ప్రమాణ స్వీకారోత్సవానికి శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే హాజరుకాకపోవచ్చని మీడియాలో వార్తలు వస్తున్నాయి. రేపటిలోగా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయేనని రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా చూస్తున్నారు. -
ఏపీ బీజేపీ ఇన్చార్జిగా రూడీ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బలపడేందుకు బీజేపీ దృష్టి సారించింది. దీనిలో భాగంగా రెండు తెలుగు రాష్టాలకు పర్యవేక్షకులను నియమించింది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల పర్యవేక్షకుడిగా రాజీవ్ ప్రతాప్ రూడీ నియమితులయ్యారు. తెలంగాణ బీజేపీ బాధ్యతలు పీకే కృష్ణదాస్ కు అప్పగించారు. ఇక తెలంగాణ ప్రాంతానికి చెందిన మురళీధర్ రావును కర్ణాటక బీజేపీ వ్యవహారాల ఇన్చార్జిగా నియమించారు. ఈ మేరకు బీజేపీ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. -
‘మహా’ శత్రువులే కారకులు
సాక్షి, ముంబై: మహాకూటమి విచ్ఛిన్నం కావడానికి మహారాష్ట్ర శత్రువులే కారణమని శివసేన పేర్కొంది. బీజేపీని మహారాష్ట్ర శత్రువని అభివర్ణించింది. అసెంబ్లీ ఎన్నికల్లో మరాఠీ అనుకూల ఎజెండాకు ప్రాధాన్యమివ్వనున్నట్లు శివసేన పరోక్షంగా సంకేతాలిచ్చింది. ‘శివసేన, బీజేపీల పొత్తు కొనసాగాలని మహారాష్ట్రలోని 11 కోట్ల ప్రజలు ఆకాంక్షించారు. కాని వీరందరి ఆకాంక్షలు సర్వనాశనం కావడానికి కారకులు మహారాష్ట్ర శతృవులే అవుతారు’ అని సామ్నా ఆరోపించింది. ఇది సంయుక మహారాష్ట్ర ఉద్యమంలో ప్రాణాలర్పించిన 105 మంది మృతవీరులను అవమానించడమేనని పేర్కొంది. హిందూత్వ విధానాలతో 25 ఏళ్ల పాటు కొనసాగిన బంధం ముగిసిపోవడం దురదృష్టకరమని సంపాదకీయం పేర్కొంది. నిన్నటి వరకు ఈ టెంటులో ప్రార్థనలు చేసిన వారు నేడు మరో శిబిరంలో నమాజు చేస్తున్నారని ఆరోపించింది. ఈ వ్యాఖ్య, భారతీయ ముస్లిమ్‌లు దేశభక్తులనిప్రశంసించిన ప్రధాని మోడీని ఉద్దేశించి చేసినట్టు తెలుస్తోంది. పోయిన వారు (బీజేపీ) ‘పిండం’ కోసం ఎగిరిపోయిన కాకులు, మిగిలిన వారు మావ్లే (ఛత్రపతి శివాజీ సైనికులు) అని వ్యాఖ్యానించింది. కాంగ్రెస్ పార్టీపై కూడా సామ్నా విమర్శలు గుప్పించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముంబై నగర ప్రాధాన్యతను తగ్గించేందుకు కుట్ర చేస్తోందని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారని విమర్శించింది. నిజానికి కాంగ్రెస్ రక్తమాంసాలున్న మొరార్జీ దేశాయ్ కాలంలోనే ఆ కుట్ర జరిగిందని గుర్తు చేసింది. సమైక్య ముంబై, మహారాష్ట్రల కోసం కాంగ్రెస్, దాని నాయకులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కాషాయ పతాకం రాష్ట్రాన్ని రక్షించగలదని పేర్కొంది. ఇటు కాషాయ కూటమి, అటు కాంగ్రెస్-ఎన్సీపీల బంధం తెగిపోవడంపై సామ్నా వ్యాఖ్యానిస్తూ అమావాస్య జీవనం ముగిసింది, నవరాత్రి శుభదినాలు ప్రారంభమయ్యాయని తెలిపింది. సామ్నా వ్యాఖ్యలు దురదృష్టకరం: బీజేపీ తమను మహారాష్ట్ర శత్రువులని శివసేన వ్యాఖ్యానించడం దురదృష్టకరమని బీజేపీ పేర్కొంది. ఇకపై ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండగలరని బీజేపీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి రాజీవ్ ప్రతాప్ రూడీ ఆశాభావం వ్యక్తం చేశారు. కూటమిలోని చిన్న పార్టీలను మోసగించే కుట్రలో బీజేపీ భాగం పంచుకోగలదని శివసేన ఆశించరాదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి పదవిపై ఆశతోనే వారు సీట్ల సర్దుబాటును ప్రతిపాదించారని, దానిని ఆమోదించి ఉంటే చిన్న పార్టీలన్నీ కూటమి నుంచి బయటకు వెళ్లిపోయేవని రూడీ పేర్కొన్నారు. శివసేన వాడే పరుష పదజాలంతో కాంగ్రెస్-ఎన్సీపీ కూటమిని ఓడించలేమని ఆయన హితవు చెప్పారు. -
సీట్ల కోసం కొట్లాట వద్దు
సాక్షి, ముంబై: రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ వాతావరణం బాగుందని,అంతా కలిసికట్టుగా పోటీచేసి అధికారం తెచ్చుకుందామని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అనవసరంగా సీట్ల కోసం పోట్లాడడం ఎందుకన్నారు. ఎట్టి పరిస్ధితుల్లోనూ బీజేపీకి 135 స్థానాలిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బీజేపీ, శివసేన కూటమిని అప్పట్లో వాజ్‌పేయి, అద్వానీ, శివసేన దివంగత అధిపతి బాల్‌ఠాక్రే ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ‘25 సంవత్సరాలుగా ఈ కూటమి చెక్కు చెదరకుండా కొనసాగుతోంది. ఇక ముందు కూడా ఇలాగే కొనసాగుతుంది’ అని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఇకమీదట ఆచితూచి మాట్లాడతానన్నారు. మోడీపై వ్యాఖ్యలను సహించబోమని బీజేపీ నేత మాధవ్ భండారీ పేర్కొనడంపై స్పందిస్తూ ఆయన అంటే తనకు ఎంతో గౌరవమన్నారు. అందువల్ల ఈ అంశంపై ఏమీ మాట్లాడదల్చుకోలేదన్నారు. బీజేపీని తానేనాడూ నిర్లక్ష్యం చేయలేదన్నారు. పొత్తు గురించి ప్రశ్నించగా ప్రతి సమస్యకు ఏదో ఒక ప్రత్యామ్నాయ మార్గం ఉంటుందన్నారు. రెండు రోజుల్లో పొత్తు విషయం ఓ కొలిక్కి వస్తుందన్నారు. తమ వల్లనే మోడీ లాభపడ్డారని తానేనాడూ అనలేదన్నారు. దేశ పరిస్థితులపైనే మాట్లాడానన్నారు. -
ఆమ్ ఆద్మీ పార్టీ ఫలితాలు మాకూ ఆందోళనకరమే: రూడీ
ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీపార్టీ ఫలితాలు కాంగ్రెస్‌కే కాక.. తమ పార్టీకి కూడా ఆందోళనకరమేనని బీజేపీ ప్రధాన కార్యదర్శి రాజీవ్ ప్రతాప్ రూడీ అన్నారు. ఇప్పుడు జరిగినది త్రిముఖపోటీ కానిపక్షంలో తమకు స్పష్టమైన మెజారిటీ వచ్చి తీరేదని చెప్పారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని కూడా ప్రజలు బాగా ఆదరించారని, అందుకు చాలా కారణాలున్నాయని ఆయన తెలిపారు. బీజేపీ సరైన సమయంలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేకపోయిందని, జాతీయ చానళ్లు కూడా జాతీయ పార్టీలకు అంత బాగోదని చెప్పినా, తాము మాత్రం ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి తీరుతామని ఆయన వివరించారు. ప్రాంతీయ మేనిఫెస్టోలు జాతీయ ఎజెండాను నిర్దేశిస్తున్నాయని, ఢిల్లీలో కూడా ఇదే జరిగిందని రూడీ అన్నారు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చిన ఓట్లన్నీ వాస్తవానికి బీజేపీకి రావాల్సి ఉందని, అలాగైతే తమకు పూర్తిస్థాయిలో భారీ విజయం దక్కేదని తెలిపారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ బాగా వచ్చిందని, కానీ ఆ పార్టీ లేకపోతే తమకు మరింత మంచి విజయం దక్కేదని రాజ్యసభలో బీజేపీ ఉపనేత రవిశంకర్ ప్రసాద్ అన్నారు. అయతే తమకు ఇప్పుడు కూడా స్పష్టమైన మెజారిటీ వస్తుందని తెలిపారు.