ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీపార్టీ ఫలితాలు కాంగ్రెస్కే కాక.. తమ పార్టీకి కూడా ఆందోళనకరమేనని బీజేపీ ప్రధాన కార్యదర్శి రాజీవ్ ప్రతాప్ రూడీ అన్నారు.
ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీపార్టీ ఫలితాలు కాంగ్రెస్కే కాక.. తమ పార్టీకి కూడా ఆందోళనకరమేనని బీజేపీ ప్రధాన కార్యదర్శి రాజీవ్ ప్రతాప్ రూడీ అన్నారు. ఇప్పుడు జరిగినది త్రిముఖపోటీ కానిపక్షంలో తమకు స్పష్టమైన మెజారిటీ వచ్చి తీరేదని చెప్పారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని కూడా ప్రజలు బాగా ఆదరించారని, అందుకు చాలా కారణాలున్నాయని ఆయన తెలిపారు. బీజేపీ సరైన సమయంలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేకపోయిందని, జాతీయ చానళ్లు కూడా జాతీయ పార్టీలకు అంత బాగోదని చెప్పినా, తాము మాత్రం ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి తీరుతామని ఆయన వివరించారు.
ప్రాంతీయ మేనిఫెస్టోలు జాతీయ ఎజెండాను నిర్దేశిస్తున్నాయని, ఢిల్లీలో కూడా ఇదే జరిగిందని రూడీ అన్నారు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చిన ఓట్లన్నీ వాస్తవానికి బీజేపీకి రావాల్సి ఉందని, అలాగైతే తమకు పూర్తిస్థాయిలో భారీ విజయం దక్కేదని తెలిపారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ బాగా వచ్చిందని, కానీ ఆ పార్టీ లేకపోతే తమకు మరింత మంచి విజయం దక్కేదని రాజ్యసభలో బీజేపీ ఉపనేత రవిశంకర్ ప్రసాద్ అన్నారు. అయతే తమకు ఇప్పుడు కూడా స్పష్టమైన మెజారిటీ వస్తుందని తెలిపారు.