
శివసేన సభ్యులు చేరడం లేదు: రూడీ
ముంబై: మహారాష్ట్రలో బీజేపీ, శివసేన మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగలేదు. బీజేపీ ఏర్పాటు చేయబోయే ప్రభుత్వానికి శివసేన మద్దతు ఇస్తుందా, లేదా అనేది ఇంకా తేలలేదు.
అయితే శివసేన పార్టీతో జరుపుతున్న చర్చలు సానుకూలంగా ముగుస్తాయన్న విశ్వాసాన్ని బీజేపీ నాయకుడు రాజీవ్ ప్రతాప్ రూడీ వ్యక్తం చేశారు. శుక్రవారం ఏర్పడబోయే మహారాష్ట్ర ప్రభుత్వంలో శివసేన సభ్యులు చేరడంలేదని ఆయన స్పష్టం చేశారు.
రేపు జరగనున్న ప్రమాణ స్వీకారోత్సవానికి శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే హాజరుకాకపోవచ్చని మీడియాలో వార్తలు వస్తున్నాయి. రేపటిలోగా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయేనని రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా చూస్తున్నారు.