పాక్ పర్యటనకు సుష్మా స్వరాజ్ | Sushma Swaraj to visit Pakistan on Tuesday | Sakshi
Sakshi News home page

పాక్ పర్యటనకు సుష్మా స్వరాజ్

Published Mon, Dec 7 2015 12:22 PM | Last Updated on Sat, Mar 23 2019 8:33 PM

Sushma Swaraj to visit Pakistan on Tuesday

న్యూఢిల్లీ: విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మంగళవారం పాకిస్తాన్లో పర్యటించనున్నారని కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ తెలిపారు. న్యూఢిల్లీలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇస్లామాబాద్ వెళ్లి చర్చలు జరిపి భారత్కి ఆమె తిరిగొచ్చాక ఓ ప్రకటన చేస్తారని రాజీవ్ చెప్పారు. పాక్ లో జరగనున్న భద్రతా సదస్సును ముగించుకుని స్వదేశానికి ఆమె విచ్చేసిన తర్వాత పార్లమెంట్ ఉభయసభలలో ఈ విషయంపై చర్చిద్దామన్నారు.

థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ లో భారత్, పాకిస్తాన్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు ఆదివారం సమావేశమైన విషయం అందరికీ విదితమే. నిర్మాణాత్మకమైన సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవాలని ఇరు దేశాల నేతలు ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. ఇస్లామాబాద్ లో మంగళవారం జరగనున్న భద్రతా సదస్సుకు భారత ప్రతినిధిగా సుష్మా స్వరాజ్ హాజరుకానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement