‘పాక్‌లో భారత బాలికల కిడ్నాప్‌పై నివేదిక’ | Sushma Swaraj Seeks Report On Alleged Kidnapping Of Hindu Girls In Pak | Sakshi
Sakshi News home page

‘పాక్‌లో భారత బాలికల కిడ్నాప్‌పై నివేదిక’

Published Sun, Mar 24 2019 2:25 PM | Last Updated on Sun, Mar 24 2019 7:01 PM

Sushma Swaraj Seeks Report On Alleged Kidnapping Of Hindu Girls In Pak - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్‌లోని సింధ్‌ ప్రావిన్స్‌లో హోలీ సందర్భంగా ఇద్దరు భారత మైనర్‌ బాలికలను అపహరించి వారిని బలవంతంగా ఇస్లాం మతం స్వీకరించేలా చేశారనే ఆరోపణలపై భారత్‌ స్పందించింది. ఈ వ్యవహారంపై నివేదిక పంపాలని పాకిస్తాన్‌లో భారత రాయబారిని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్‌ కోరారు. ఈ ఘటనకు సంబంధించిన మీడియా కథనాలను ట్యాగ్‌ చేస్తూ పాక్‌లో భారత హైకమిషనర్‌కు దీనిపై వివరాలు పంపాలని కోరుతూ ట్వీట్‌ చేశారు.

హోలీ వేడుకల నేపథ్యంలో సింధ్‌ ప్రావిన్స్‌లోని ఘోట్కీ జిల్లా ధర్కి పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు మీడియా కధనాలు వెల్లడించాయి. ఈ ఘటన పట్ల తీవ్ర ఆందోళన చేపట్టిన హిందువులు నేరానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని డివమాండ్‌ చేశారు. పాకిస్తాన్‌లో మైనారిటీలుగా ఉన్న హిందువుల దుస్థితిపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement