సహాయ మంత్రిగా రూడీ ప్రమాణం | Rajiv Pratap Rudy sworn as a union minister of state | Sakshi
Sakshi News home page

సహాయ మంత్రిగా రూడీ ప్రమాణం

Published Sun, Nov 9 2014 2:16 PM | Last Updated on Sat, Apr 6 2019 9:38 PM

సహాయ మంత్రిగా రూడీ ప్రమాణం - Sakshi

సహాయ మంత్రిగా రూడీ ప్రమాణం

బీజేపీ నాయకుడు రాజీవ్ ప్రతాప్ రూడీ కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

బీజేపీ నాయకుడు రాజీవ్ ప్రతాప్ రూడీ కేంద్ర సహాయ మంత్రి(స్వతంత్ర ప్రతిపత్తి)గా ప్రమాణ స్వీకారం చేశారు. బీహార్ లోని శరణ్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 1996లో తొలిసారిగా ఎంపీగా ఎన్నికైయ్యారు. వాజపేయి కేబినెట్ లోనూ సహాయ మంత్రిగా పనిచేశారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాత్ఫుత్ వంశానికి చెందిన రూడీ విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. ఆయనకు కమర్షియల్ పైలట్ లైసెన్స్ కూడా ఉంది.

వ్యక్తిగత, కుటుంబ వివరాలు
పూర్తిపేరు: రాజీవ్ ప్రతాప్ రూడీ
జన్మదినం: 1962 మార్చి 30
జన్మస్థలం: పాట్నా
వయసు: 52
భార్య: నీలం రూడీ
పిల్లలు: ఇద్దరు కుమార్తెలు
పార్టీ: బీజేపీ
రాష్ట్రం: బీహార్

రాజకీయ జీవితం
1990లో బీహార్ ఎమ్మెల్యేగా ఎన్నిక
1996లో తొలిసారిగా లోక్సభకు ఎన్నిక
1999లో రెండో పర్యాయం లోక్సభ ఎంపీగా గెలుపు
2010లో బీహార్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక
2014లో శరణ్ నుంచి లోక్సభ ఎంపీగా గెలుపు
2014, నవంబర్ 9న కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement