సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పేరిట ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరోగ్య బీమా పథకంతో రానున్న నాలుగేళ్లలో లక్షకు పైగా ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల విస్తరణ ద్వారా మరిన్ని ఉద్యోగాలు యువతకు అందివస్తాయని ఆయుష్మాన్ భారత్ సీఈఓ ఇందు భూషణ్ చెప్పారు. ఈ కార్యక్రమం కింద దేశంలోని 10 కోట్ల నిరుపేద కుటుంబాలకు రూ 5 లక్షల ఆరోగ్య బీమా కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించుకుంది. ఈ కార్యక్రమం అమలు ద్వారా రానున్న నాలుగేళ్లలో లక్షకు పైగా నైపుణ్యాలు, తక్కువ నైపుణ్యాలతో కూడిన ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నామని భూషణ్ తెలిపారు.
కేంద్ర స్థాయిలో అమలు పర్యవేక్షక సిబ్బంది, రాష్ట్ర స్ధాయిలో క్లెయిమ్ నిర్వహణ వ్యవస్థ, ట్రస్ట్, క్షేత్రస్థాయిలో బీమా ఏజెన్సీల్లో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు సమకూరుతాయని చెప్పారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ సేవల కోసం దాదాపు 25,000 ఆస్పత్రులను ఈ స్కీమ్‌లో చేరుస్తామని తెలిపారు. ఆ
యుష్మాన్ భారత్‌తో నెలకొనే డిమాండ్‌ను అధిగమించేందుకు కొత్తగా 300 ప్రైవేట్ ఆస్పత్రులు ప్రారంభమైనా ఒక్కో ఆస్పత్రిలో 200 మంది ఉద్యోగులకు చోటు దక్కినా ప్రత్యక్షంగా 60,000 ఉద్యోగాలు ఆస్పత్రుల్లో అందుబాటులోకి వస్తాయని ఆయన అంచనా వేశారు.పరోక్షంగా లక్షలాది మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment