రానున్న రోజుల్లో హెచ్‌సీఎల్ భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనుంది. డిమాండ్ తగ్గట్టుగా వచ్చే ఆర్థిక సంవత్సరం 2023 వరకు సుమారు 30 వేల మంది ఫ్రెషర్‌లను రిక్రూట్ చేసుకొనున్నట్లు కంపెనీ హూమన్ రిసోర్స్ ఆఫీసర్ వీవీ అప్పారావ్ వెల్లడించారు. ప్రతి సంవత్సరం కంపెనీలో సుమారు 40 నుంచి 50 శాతం మేర ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు ఒక ప్రకటనలో వీవీ అప్పారావు పేర్కొన్నారు. గత సంవత్సరంలో హెచ్‌సీఎల్ సుమారు 14 వేల మంది ఫ్రెషర్లను నియామకం చేసింది. 2021 సంవత్సరానికిగాను సుమారు 20 వేల నుంచి 22 వేల మంది ప్రెషర్లను తీసుకోవాలని హెచ్‌సీఎల్ భావిస్తోందని వీవీ అప్పారావు పేర్కొన్నారు.
ప్రతి సంవత్సరం 40-50 శాతం కొత్త నియామాకాలతో 2023 ఆర్థిక సంవత్సరానికి సుమారు 30 వేల మంది కొత్త వారికి ఉద్యోగాలను హెచ్‌సీఎల్ కల్పించనుందని వీవీ అప్పారావు తెలిపారు. కంపెనీలో ప్రస్తుతం సుమారు 1.76లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం హెచ్‌సీఎల్ 35 శాతం కొత్త వారిని, 65 శాతం అనుభవం కల్గిన ఉద్యోగులను నియమిస్తోంది. రాబోయే రెండు సంవత్సరాల్లో ఫ్రెషర్ల సంఖ్యను 70 శాతానికి పెంచాలని కంపెనీ భావిస్తోందని వీవీ అప్పారావు తెలిపారు.
తాజాగా కంపెనీలో అట్రిషన్‌ను ఎదుర్కోవడం కోసం కంపెనీలోని ఉత్తమ ఉద్యోగులకు బెంజ్ కార్లను ఇవ్వాలని హెచ్‌సీఎల్ నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటి ప్రసిద్ధ కాలేజీల నుంచి హెచ్‌సీఎల్ ఎక్కువ ఫ్రెషర్లను నియామాకం చేసుకోనుంది. ఈ ఏడాది ఐఐటీల నుంచి సుమారు 206 మందిని నియమించుకుంది. గత ఏడాది ఐఐటీలనుంచి ఫ్రెషర్ల భర్తీ సంఖ్య 134 గా ఉంది. కాగా దేశవ్యాప్తంగా పలు టాప్ 200 కాలేజీల నుంచి ఫ్రెషర్లను నియమించుకోవడానికి హెచ్‌సీఎల్ సన్నాహాలు చేస్తోందని హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ వీవీ అప్పారావు పేర్కొన్నారు.
ఫ్రెషర్లకు హెచ్‌సీఎల్ బంపర్ ఆఫర్..!
Published Mon, Jul 26 2021 4:37 PM | Last Updated on Mon, Jul 26 2021 6:32 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment