19వేల టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ | West Bengal govt set to recruit 19,000 teachers through SSC | Sakshi
Sakshi News home page

19వేల టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Published Wed, Feb 17 2016 8:18 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

West Bengal govt set to recruit 19,000 teachers through SSC

కోలకతా: రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఓటర్లను ఆకర్షించే పనులకు శ్రీకారం చుట్టింది. ఏకంగా 19 వేల టీచర్ పోస్టుల నియామకం కోసం  నోటిఫికేషన్ జారీ చేసింది. గవర్నమెంట్ ఎయిడెడ్   సెకండరీ, హయ్యర్ సెకండరీ స్కూళ్లలో ఖాళీగా ఉన్న  అసిస్టెంట్ టీచర్ల  భర్తీకి  ఈ నోటిఫికేషన్ విడుదలైంది.  దీనికి సంబంధించి 'వెస్ట్ బెంగాల్ సెంట్రల్  స్కూల్ సర్వీస్ కమిషన్' (ఎస్ఎస్సి) మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని  పరీక్ష తేదీని తొందర్లోనే ప్రకటిస్తామని కమిషన్  తెలిపింది. పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి,  ఇంటర్వ్యూ అనంతరం  తుది ఎంపిక  జరుగుతుందన్నారు. ఈనెల 19 నుండి వచ్చేనెల 15 వ తేదీవరకు దరఖాస్తులను స్వీకరిస్తామని పేర్కొంది. కాగా మరికొన్ని వారాల్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ నిమిత్తం,  ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement