teachers recruitment
-
TS: 5,089 టీచర్ పోస్టుల భర్తీకి అనుమతి
సాక్షి, హైదరాబాద్: ఖాళీల భర్తీల్లో భాగంగా మరో నోటిఫికేషన్‌కు తెలంగాణ సర్కార్ సిద్ధమవుతోంది. పాఠశాల విద్యాశాఖలో 5, 089 పోస్టుల భర్తీకి ఆర్ధిక శాఖ అనుమతి ఇచ్చింది. వివిధి కేటగిరీల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీ కోసం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ముందకు వెళ్లనుంది. మొత్తం 5,089లో.. 2,575 ఎస్జీటీ, 1,739 స్కూల్ అసిస్టెంట్, 611 భాషా పండితులు, 164 పీఈటీ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. టీఎస్పీఎస్సీ కాదు.. ఈసారి టీఎస్పీఎస్సీ ద్వారా ఖాళీలను భర్తీ చేయడం లేదు. గతంలో మాదిరిగా డీఎస్సీ(జిల్లా ఎంపిక కమిటీలు) ద్వారా నియామకాలు ఉంటాయని ఇప్పటికే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. అంటే.. టెట్‌లో అర్హత సాధించిన వాళ్లంతా టీఆర్టీకి పోటీ పడేందుకు అర్హులన్నమాట. అందులో అర్హత సాధించిన వాళ్లను డీఎస్సీకి పంపుతారు. ఆయా జిల్లాల డీఎస్సీలు నియమకాలు చేపడతాయి. టెట్ ఎప్పుడంటే.. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ సెప్టెంబర్ 15వ తేదీన ఉండనుంది. అదే నెల 27వ తేదీన ఫలితాలు వెల్లడిస్తారు. ఆ తర్వాత వెంటనే ఉపాధ్యాయుల పోస్టుల నోటిఫికేషన్ విడుదల అవుతుంది. కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఒప్పంద టీచర్లను క్రమబద్దీకరించడంపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 567 మంది కాంట్రాక్ట్ టీచర్లను క్రమబద్దీకరిస్తూ ఒకటి రెండు రోజుల్లోనే ఉత్తర్వులు జారీ చేయనుంది. -
Education Report 2021: అధ్యాపకుల కొరతే కారణం
పాఠశాల విద్యారంగంలో మౌలిక వసతులతో పాటు మానవ వనరుల కొరత తీవ్రంగా ఉందని యునెస్కో ఆధ్వర్యంలో వెలువడిన ‘విద్యా నివేదిక–2021’ చాటుతోంది. ఆ నివేదిక ప్రకారం దేశంలో మొత్తం 15.51 లక్షల పాఠశాలలు ఉండగా, వాటిలో 21.83 కోట్ల మంది విద్యార్థులు చదువుతున్నారు. 91.30 లక్షల మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. అందులో 7 శాతం ఏకోపాధ్యాయ పాఠశాలలే కావడం గమనార్హం. ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఖ్య ఏటా తగ్గుతూ ఉంది. ప్రాథమికోన్నత పాఠశాలల్లోనే ఉపాధ్యాయుల కొరత అధికంగా ఉంది. ఈ పాఠశాలల్లో గణితం, సైన్స్, సోషల్, భాషా సబ్జెక్టులను బోధించేందుకు తప్పనిసరిగా అధ్యాపకులు ఉండాల్సి ఉంది. కానీ ప్రత్యేకించి సబ్జెక్ట్ టీచర్లు లేకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు. నీతి ఆయోగ్ 2019లో విడుదల చేసిన పాఠశాల విద్యా నాణ్యతా సూచీ ప్రకారం దేశంలో ఎనిమిదో తరగతి చదివే విద్యార్థుల్లో కేవలం 30 శాతానికే గణితంలో ప్రావీణ్యం ఉందని తేలడం వంటి ఉదంతాలే ఇందుకు నిదర్శనం. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉండటం విద్యా వ్యవస్థపై ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. 2,021 లెక్కల ప్రకారం మధ్యప్రదేశ్‌లో 21,077, ఉత్తర ప్రదేశ్‌లో 17,683 బడులు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా పని చేస్తున్నాయి. దేశంలో ఇప్పుడు సుమారుగా 11.16 లక్షల మంది ఉపాధ్యాయుల అవసరం ఉంటుందని యునెస్కో స్పష్టం చేసింది. టీచర్ల నియామకం జరుపకుండా ఏళ్ల తరబడి ఒప్పంద ఉపాధ్యాయులు, విద్యావలంటీర్లతో సరిపెడుతుండటంతో విద్యావ్యవస్థ గాడి తప్పుతోంది. ఈ క్రమంలో సర్కారీ విద్యావ్యవస్థను బలహీనపరుస్తూ, పరోక్షంగా ప్రైవేటు పాఠశాలల విశృంఖల విద్యా వ్యాపారానికి ప్రభుత్వాలే కారణమవుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరగడం గమనార్హం. కరోనా మహమ్మారి కారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని అనేక ప్రైవేట్ పాఠశాలలు మూతపడ్డాయి. ఆయా పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు మరోమార్గం లేకే ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు ముందుకొస్తున్నారు. హరియాణాలో 2020వ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో 20 లక్షల విద్యార్థులు ఉండగా ఈ ఏడాది వారి సంఖ్య 25 లక్షలకు పెరిగింది. ఈ ఏడాది తెలంగాణలో సుమారు రెండు లక్షలకుపైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లోకి అదనంగా వచ్చి చేరారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు చేరుతున్న తరుణంలో టీచర్లు తగ్గి పోతుండటం ఆందోళన కలిగించే అంశం. రాష్ట్రంలో ఇప్పటికీ 18 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తక్షణమే ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం ఎంతైనా అవసరం. (క్లిక్ చేయండి: దేశభక్తి అంటే తిరంగా సెల్ఫీ కాదు!) – మోటె చిరంజీవి, వరంగల్ -
బొల్లారం ఆర్మీ పబ్లిక్ స్కూల్లో ఉద్యోగాలు
సికింద్రాబాద్‌లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ, రక్షణ విభాగానికి చెందిన బొల్లారంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్(ఏపీఎస్).. టీచర్, ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 33 ► పోస్టుల వివరాలు: పీజీటీ, టీజీటీ, పీఆర్టీ, కంప్యూటర్ సైన్స్ టీచర్లు, లైబ్రేరియన్ తదితరాలు. ► విభాగాలు: హిస్టరీ, సైన్స్, జాగ్రఫీ, ఎకనామిక్స్, సైకాలజీ, మ్యాథ్స్, ఇంగ్లిష్, హిందీ, సోషల్ సైన్స్ తదితరాలు. ► పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు(పీజీటీ): అర్హతలు: సంబంధిత విభాగాన్ని అనుసరించి 50శాతం మార్కులతో పోస్టు గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: ఫ్రెషర్స్ అభ్యర్థులు 40 ఏళ్లు మించకూడదు. అనుభవం ఉన్నవారు 57 ఏళ్లు మించకూడదు. ► ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు(టీజీటీ): అర్హతలు: సంబంధిత విభాగంలో 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: ఫ్రెషర్స్ అభ్యర్థులు 40 ఏళ్లు మించకూడదు. అనుభవం ఉన్నవారు 57 ఏళ్లు మించకూడదు. ► ప్రైమరీ టీచర్లు(పీఆర్టీ): అర్హతలు: సంబంధిత విభాగంలో 50శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: ఫ్రెషర్స్ అభ్యర్థులు 40 ఏళ్లు మించకూడదు. అనుభవం ఉన్నవారు 57 ఏళ్లు మించకూడదు. ► లైబ్రేరియన్: అర్హతలు: బ్యాచిలర్ డిగ్రీ(లైబ్రరీ సైన్స్)/డిప్లొమా(లైబ్రరీ సైన్స్) ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 3 ఏళ్లు పని అనుభవం ఉండాలి. ► సెక్యూరిటీ సూపర్వైజర్: అర్హతలు: ఎంఎస్ ఆఫీస్ పరిజ్ఞానం ఉండాలి. 55ఏళ్లు నిండిన ఎక్స్సర్వీస్మెన్లకు ప్రాధాన్యం ఇస్తారు. ► కంప్యూటర్ ల్యాబ్ టెక్నీషియన్: అర్హతలు: ఇంటర్మీడియట్, డిప్లొమా(కంప్యూటర్ సైన్స్) ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 35 ఏళ్లు మించకూడదు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఆర్మీ పబ్లిక్ స్కూల్, బొల్లారం, జేజే నగర్, సికింద్రాబాద్–500087 చిరునామాకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 05.06.2021 ► వెబ్సైట్: http://www.apsbolarum.edu.in/index.html మరిన్ని నోటిఫికేషన్లు: టీటీడబ్ల్యూఆర్‌డీసీఎస్‌లో పార్ట్‌టైం టీచింగ్ పోస్టులు డీఎస్ఎస్ఎస్బీలో 7236 ఉద్యోగాలు -
సీఎం చిత్తశుద్ధికి నిదర్శనం టీచర్ల నియామకాలు
గుంటూరు ఎడ్యుకేషన్: పెండింగ్‌లో ఉన్న డీఎస్సీ–2018 ఉపాధ్యాయ నియామకాలకు మోక్షం లభించటం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధికి నిదర్శనమని ఏపీ టీచర్స్ రిక్రూట్మెంట్ కన్వీనర్ కె.రవీంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. గుంటూరులోని జిల్లా పరీక్షా భవన్లో శనివారం జరిగిన డీఎస్సీ–2018 కౌన్సెలింగ్ ప్రక్రియను రవీంద్రనాథ్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ–2018 ప్రక్రియ పరీక్షలకే పరిమితమైందన్నారు. న్యాయపరమైన వివాదాలతో నిలిచిపోయిన నియామక ప్రక్రియ సీఎం వైఎస్ జగన్ చొరవతో ఎట్టకేలకు పరిష్కారానికి నోచుకుందని తెలిపారు. శనివారం రాష్ట్రంలోని 13 జిల్లాల వారీగా చేపట్టిన కౌన్సెలింగ్‌లో 3,524 ఎస్జీటీ పోస్టులను భర్తీ చేస్తున్నట్టు తెలిపారు. నాలుగు రోజుల వ్యవధిలోనే జాబితాల విడుదల, సర్టిఫికెట్ల పరిశీలనతో పాటు కౌన్సెలింగ్ చేపట్టి నియామకాలను పూర్తి చేశామన్నారు. -
‘వచ్చే నెల 4లోగా టీచర్ల నియామకాలు పూర్తి’
న్యూఢిల్లీ : ఉపాధ్యాయుల నియామకాలు సెప్టెంబర్ 4వరకు పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయుల నియామకాల్లో జాప్యం జరుగుతుందని దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అఫిడవిట్ సమర్పించిన ఏపీ ప్రభుత్వం.. ప్రభుత్వ పాఠశాలల్లో సుప్రీం కోర్టు ఆదేశాలు అమలు చేస్తామని పేర్కొంది. మరోవైపు 4,444 పోస్టుల భర్తీపై హైకోర్టులో పిటిషన్ ఉండటంతో నియామకాలు చేపట్టడం ఆలస్యం అవుతుందని తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. అయితే తెలంగాణ అంశాన్ని వచ్చే వారం విచారిస్తామని జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం పేర్కొంది. -
టీచర్లు లేరు; పిల్లలు వంట సామగ్రితో రోడ్డెక్కారు..!
సాక్షి, జనగామ: జనగామ జిల్లా కేంద్రంలోని పసరమడ్ల శివారులో ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు శనివారం ఆందోళనకు దిగారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన నాటి నుంచి ఉపాధ్యాయుల నియామకం లేకపోవడంతో బోధన జరగడం లేదంటూ జోరు వానలో నినాదాలు చేశారు. విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ, టీఎస్ఎఫ్ విద్యార్థి సం ఘాల నాయకులు ధర్మభిక్షం, చందూ నాయక్ మ ద్దతు పలికారు. వంట సామగ్రితో సిద్దిపేట హైవే పై బైఠాయించడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న ఎస్సై శ్రీనివాస్ అక్కడకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ విద్యాసంవత్సరం ప్రారంభమై నెలరోజులు గడిచి పోతున్నా ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుల నియామకం లేకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ విషయంలో గిరిజన మంత్రి స్పందించకపోవడం విచారకరమని పేర్కొన్నారు. పేద గిరిజన విద్యార్థులకు చదువు అందని ద్రాక్ష చేస్తున్నారని, పాలకులకు ఇక్కడి దయనీయ పరిస్థితి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఉపాధ్యాయులను నియమించాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లినా ఫలితం లేదని పేర్కొన్నారు. అధికారులు స్పదించని పక్షంలో కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. విద్యార్థులతో మాట్లాడుతున్న ఎస్సై శ్రీనివాస్ -
టీఆర్టీపై అపోహలు వద్దు
సాక్షి, సిద్దిపేట: టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ)పై వస్తున్న వదంతులు నమ్మవద్దని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి అన్నారు. మంగళవారం సిద్దిపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభంలోపే పాఠశాలలకు కొత్త ఉపాధ్యాయులు చేరేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ మూడేళ్లలో 14 వేల పోస్టులు భర్తీ చేశామని చెప్పారు. మరో నెలలో గురుకుల టీచర్లకు సంబంధించిన 6 వేల పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. గురుకుల టీజీటీ పోస్టుల భర్తీకి సంబంధించి నెలలో నియామక జాబితా ప్రకటిస్తామన్నారు. గ్రూపు–2 పోస్టులకు సంబంధించిన కోర్టు కేసు త్వరలో క్లియర్ అవుతుందన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశామని, ఏఎన్ఎం, స్టాఫ్ నర్సుల పోస్టులకు, గ్రూప్–4, వీఆర్వో, పంచాయతీ సెక్రటరీ పోస్టులకు కూడా నోటిఫికేషన్ త్వరలో వస్తుందని చైర్మన్ వెల్లడించారు. ఇప్పటివరకు ప్రభుత్వం 31 వేల పోస్టుల భర్తీ బాధ్యత తమపై పెట్టిందని, నియామకాలను పారదర్శకంగా చేపట్టడం వల్లే జాప్యం జరుగుతోం దని తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణం దృ ష్ట్యా పోస్టులు భర్తీ చేస్తున్నామని చక్రపాణి పేర్కొన్నారు. విభజన తర్వాత ఏపీ కన్నా తెలంగాణలోనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎక్కువ పోస్టులు భర్తీ అయ్యాయన్నారు. -
ప్రత్యేక బీఈడీ, డీఈడీలకు టీఆర్టీలో అవకాశమివ్వాలి
సాక్షి, హైదరాబాద్: వినికిడి, దృష్టి లోపాలతో పాటు బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలకు విద్యను అందించేందుకు ప్రత్యేక బీఈడీ, డీఈడీ చదివిన అభ్యర్థులకు టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ)లో అవకాశం కల్పించకపోవడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రత్యేక బీఈడీ, డీఈడీ చేసిన వారికి అవకాశం కల్పించే విషయంలో ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకునేంత వరకు టీఆర్టీకి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోపై స్టే విధించాలని పిటిషన్లో కోరారు. ఈ మేరకు తెలంగాణ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రీసోర్స్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధి బి.శ్రీనివాసులు హైకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి ప్రకారం ప్రత్యేక బీఈడీ, డీఈడీ చేసిన వారు సాధారణ బీఈడీ కోర్సు చేసిన వారితో సమానమని పిటిషన్లో వివరించారు. అయితే ప్రభుత్వం ఈ విషయాన్ని విస్మరించిందని, టీఆర్టీ జీవో 25లో ప్రత్యేక బీఈడీ, డీఈడీ వారికి అవకాశం కల్పించలేదని తెలిపారు. అలాగే వీరికి ప్రత్యేక పాఠశాలల్లోనే కాకుండా సాధారణ పాఠశాలల్లో కూడా పనిచేసే అవకాశం ఇవ్వాలని, ఆ దిశగా ప్రభుత్వానికి తగిన ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరావు చట్ట నిబంధనలను పిటిషనర్ సవాలు చేసినందున దీనిపై ధర్మాసనం విచారించడమే సబబుగా ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో ఈ వ్యాజ్యంపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ జరపనుంది. -
మూడు నెలల్లో భర్తీ చేయండి
-
మూడు నెలల్లో భర్తీ చేయండి
- ప్రభుత్వ టీచర్ పోస్టులపై రాష్ట్రానికి సుప్రీం ఆదేశం - భర్తీకి చర్యలు, మౌలిక వసతులపై అఫిడవిట్ ఇవ్వాలని - ఏపీకి సూచన.. విచారణ జూలై 24కు వాయిదా సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఖాళీగా ఉన్న దాదాపు 8,700 ఉపాధ్యాయ పోస్టులను మూడు నెలల్లోగా భర్తీ చేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఈ ఆదేశాలను మాండమస్‌గా పరిగణించాలని స్పష్టం చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ల భర్తీకి తీసుకుంటున్న చర్యలు, మౌలిక వసతుల ఏర్పాటు చర్యలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. తెలంగాణ, ఏపీల్లోని ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతుల లేమిపై జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం కొద్ది నెలలుగా విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ఈ అంశంపై మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ తరఫున రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది కౌల్ ధర్మాసనానికి అఫిడవిట్ అందజేశారు. 371డి, ఇతర సాంకేతిక కారణాలతో ఇబ్బందుల్లేకుండా పాత జిల్లాల లెక్కల ప్రకారమే టీచర్ల పోస్టులను భర్తీచేస్తామనిఅందులో వివరించారు. ఈ భర్తీ ప్రక్రియను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)కి అప్పగించామని తెలిపారు. అయితే భర్తీకి ఎన్ని రోజులు పడుతుందని ధర్మాసనం ప్రశ్నించగా... 6 నెలల సమయం పడుతుందని, 8,700 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నామని న్యాయవాది వివరించారు. దీనిపై నిరుద్యోగులు, విద్యార్థుల తల్లిదండ్రుల సంక్షేమ సంఘం తరఫున న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్ అభ్యంతరం చెప్పారు. ఖాళీ పోస్టుల సంఖ్య 16 వేల వరకు ఉన్నా... తక్కువగా చూపిస్తున్నారని, ఆరు నెలలు అంటే విద్యా సంవత్సరం సగం పూర్తవుతుందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. మూడు నెలల్లో సుమారు 8,700 టీచర్ పోస్టులు భర్తీచేయాలని, ఈ ఆదేశాలను మాండమస్‌గా పరిగణించాలని స్పష్టం చేసింది. విచారణను జూలై 24వ తేదీకి వాయిదా వేసింది. -
టీఎస్పీఎస్సీ ద్వారానే టీచర్ల నియామకం
- భర్తీ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు - డీఎస్సీల నేతృత్వంలో ఎంపిక విధానం రద్దు - ‘విద్యాశాఖ, మోడల్ స్కూళ్ల’ భర్తీ కూడా కమిషన్ ద్వారానే... - హేతుబద్ధీకరణపై విద్యాశాఖ కసరత్తు, ఆ తర్వాతే తేలనున్న ఖాళీల లెక్కలు - పాఠశాలల రేషనలైజేషన్‌తో తగ్గనున్న పోస్టులు - అసెంబ్లీకిచ్చిన నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటే కష్టమే.. 4 వేల స్కూళ్లు మూతపడే ప్రమాదం - జిల్లాకు నాలుగైదు వందల పోస్టులు మాత్రమే వచ్చే అవకాశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీ బాధ్యతలను ప్రభుత్వం టీఎస్పీఎస్సీకి అప్పగించింది. జిల్లా ఎంపిక కమిటీల (డీఎస్సీ) నేతృత్వంలో ఇప్పటివరకు కొనసాగుతున్న భర్తీ విధానాన్ని రద్దు చేసింది. ఇకపై జిల్లా ఎంపిక కమిటీల స్థానంలో టీఎస్పీఎస్సీ ఉపాధ్యాయ పోస్టుల నియామకాలు జరుగుతాయని వెల్లడించింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆచార్య బుధవారం జీవో 19 జారీ చేశారు. పాఠశాల విద్యా డెరైక్టర్ అధీనంలోని అన్ని రకాల డెరైక్ట్ రిక్రూట్మెంట్ ఉపాధ్యాయ పోస్టులను (స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, సెకండరీ గ్రేడ్ టీచర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్) టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అలాగే తెలంగాణ మోడల్ స్కూళ్లలోని ప్రిన్సిపల్స్, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టులను కూడా టీఎస్పీఎస్సీ ద్వారానే భర్తీ చేయాలని పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన చర్యలు టీఎస్పీఎస్సీ కార్యదర్శి, పాఠశాల విద్యా డెరైక్టర్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ డెరైక్టర్ కలిసి చేపట్టాలని అందులో వివరించారు. రాష్ట్రంలోని వివిధ గురుకుల విద్యాలయాల సొసైటీల పరిధిలోని గురుకుల టీచర్ పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారానే భర్తీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పాఠశాల విద్యా డెరైక్టరేట్, రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ), జిల్లాల డీఈవోలపై కొంత మేరకు పని ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. అయితే పోస్టింగ్‌ల కౌన్సెలింగ్ ప్రక్రియ మాత్రం పాఠశాల విద్యా డెరైక్టర్ నేతృత్వంలో జిల్లాల వారీగా జిల్లా కలెక్టర్లు, జిల్లాల డీఈవోలే చేపట్టాల్సి ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి. హేతుబద్ధీకరణపై ఏం చేద్దాం? రాష్ట్రంలో విద్యార్థుల్లేని పాఠశాలలను మూసివేయడం, విద్యార్థులు ఎక్కువ మంది ఉన్న చోటికి ఉపాధ్యాయులను పంపించేందుకు చేపట్టాల్సిన హేతుబద్ధీకరణపై విద్యాశాఖ తర్జనభర్జన పడుతోంది. పాఠశాలలను మూసివేయడంపై సుప్రీంకోర్టు సీరియస్ కావడంతో ఆందోళనలో పడింది. ఈ నేపథ్యంలో హేతుబద్ధీకరణ ఎలా చేపట్టాలన్న అంశాన్ని ఇంకా తేల్చుకోలేకపోతోంది. టీచర్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలన్నా.. ముందుగా టీచర్లు, స్కూళ్ల హేతుబద్ధీకరణ చేపట్టాల్సి ఉంది. ఆ తర్వాతే భర్తీ చేయాల్సిన ఉపాధ్యాయ ఖాళీలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గతంలో విద్యాశాఖ తేల్చిన లెక్కల ప్రకారం 10,961 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవి కాకుండా ఈ నాలుగైదు నెలల్లోనూ ఖాళీ అయిన పోస్టులు ఉన్నాయి. అయితే హేతుబద్ధీరణ చేపడితే అన్ని పోస్టుల అవసరం ఉండకపోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాకు నాలుగైదు వందలే? 20 మందిలోపు పిల్లలున్న స్కూళ్లను టీచర్లను ఇవ్వాలా? వద్దా? ఇస్తే ఎంత మంది పిల్లలున్న స్కూళ్లకు టీచర్లను ఇవ్వాలి? పిల్లలు అసలే లేని స్కూళ్లను మూసేలా? వద్దా? అన్న అంశాలను విద్యాశాఖ తేల్చాల్సిన అవసరం ఉంది. 20 మందిలోపు పిల్లలున్న స్కూళ్లను కొనసాగించడం కష్టమని, ఇది ఆర్థికంగా భారం కూడా అవుతోందని విద్యాశాఖ ఇటీవల అసెంబ్లీకి సమర్పించిన వివరణ పత్రంలో పేర్కొంది. ప్రాథమికోన్నత పాఠశాలల వ్యవస్థను రద్దు చేయాలని కూడా ప్రతిపాదించింది. ఇవన్నీ చేస్తే దాదాపు 4 వేల స్కూళ్లు మూతపడనుండగా, మరో వేయి ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం విద్యాశాఖ ఈ అంశాలన్నింటిపై హేతుబద్ధీకరణ మార్గదర్శకాల్లో స్పష్టత ఇచ్చి రేషనలైజేషన్ చేపట్టాలి. అప్పుడే వాస్తవంగా భర్తీ చేయాల్సిన ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య తేలనుంది. అసెంబ్లీకి ఇచ్చిన వివరణ పత్రం ఆధారంగా చేస్తే మాత్రం ప్రతి జిల్లాలో నాలుగైదు వందలకు మించి పోస్టులు రాకపోవచ్చని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. పోస్టుల భర్తీలో డిస్క్రిప్టివ్, డెమాన్‌స్ట్రేషన్! విద్యాశాఖ రూపొందించిన వివరణ పత్రం ప్రకారం ఉపాధ్యాయ నియామకాల విధానంలో మార్పులు రానున్నాయి. దాని ప్రకారం ఇప్పటివరకు ఉన్న ఆబ్జెక్టివ్ విధానంలో ఉన్న ప్రశ్నపత్రాన్ని డిస్క్రిప్టివ్ విధానంలో ఇచ్చే అవకాశం ఉంది. దీనికితోడు క్లాస్రూమ్ డెమాన్‌స్ట్రేషన్ కూడా అమలు చేయాలని పేర్కొంది. అయితే ఈ మార్పులను ఇప్పుడే తెస్తారా? మున్ముందు తీసుకు వస్తారా? అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు గురుకుల పాఠశాలల పోస్టుల భర్తీలో డెమాన్‌స్ట్రేషన్ విధానం అమల్లోకి తెచ్చే కసరత్తు జరుగుతోంది. దాని ప్రకారం చూస్తే విద్యాశాఖలోనూ అమలు చేసే అవకాశం ఉంది. కేబినెట్ ఆమోదించిన పోస్టులు ఇవీ.. (హేతుబద్ధీకరణ తర్వాత ఈ సంఖ్య మారనుంది) విభాగం పోస్టులు గిరిజన సంక్షేమ గురుకుల స్కూళ్లలో 350 గిరిజన సంక్షేమ గురుకుల కాలేజీల్లో 65 విద్యాశాఖ గురుకులాల స్కూళ్లలో 267 విద్యాశాఖ గురుకుల కాలేజీల్లో 6 సాంఘిక సంక్షేమ గురుకుల స్కూళ్లలో 889 బీసీ సంక్షేమ గురుకుల స్కూళ్లలో 249 బీసీ సంక్షేమ గురుకుల కాలేజీల్లో 57 డైట్ కాలేజీల్లో 78 బీఎడ్ కాలేజీల్లో 18 మోడల్ స్కూళ్లలో ప్రిన్సిపల్స్ 86 మోడల్ స్కూళ్లలో పీజీటీ 331 మోడల్ స్కూళ్లలో టీజీటీ 300 ప్రభుత్వ/జిల్లా పరిషత్ స్కూళ్లలోని ఖాళీలివీ జిల్లా ఖాళీలు అదిలాబాద్ 1,818 నిజామాబాద్ 944 కరీంనగర్ 666 మెదక్ 1,257 హైదరాబాద్ 763 రంగారెడ్డి 1,442 మహబూబ్‌నగర్ 2,024 నల్లగొండ 689 వరంగల్ 634 ఖమ్మం 724 మొత్తం 10,961 -
19వేల టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
కోలకతా: రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఓటర్లను ఆకర్షించే పనులకు శ్రీకారం చుట్టింది. ఏకంగా 19 వేల టీచర్ పోస్టుల నియామకం కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. గవర్నమెంట్ ఎయిడెడ్ సెకండరీ, హయ్యర్ సెకండరీ స్కూళ్లలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ టీచర్ల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించి 'వెస్ట్ బెంగాల్ సెంట్రల్ స్కూల్ సర్వీస్ కమిషన్' (ఎస్ఎస్సి) మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని పరీక్ష తేదీని తొందర్లోనే ప్రకటిస్తామని కమిషన్ తెలిపింది. పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి, ఇంటర్వ్యూ అనంతరం తుది ఎంపిక జరుగుతుందన్నారు. ఈనెల 19 నుండి వచ్చేనెల 15 వ తేదీవరకు దరఖాస్తులను స్వీకరిస్తామని పేర్కొంది. కాగా మరికొన్ని వారాల్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ నిమిత్తం, ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. -
టీచర్ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన శనివారం జరిగిన కేబినెట్ సమావేశంలో 15,628 టీచర్ పోస్టుల భర్తీకి ఓకే చెప్పారు. టీచర్ పోస్టుల్లో పదోన్నతులు పోగా ఏర్పడే ఖాళీలు, భవిష్యత్తులో రిటైర్మెంట్ ద్వారా ఖాళీ అయ్యేవి కాకుండా ఇప్పటివరకు ఖాళీ అయిన క్లియర్ వేకెన్సీలను మాత్రమే పరిగణనలోకి తీసుకొని ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. నియామకాల విధి విధానాలను విద్యాశాఖ ప్రకటించనుంది. డీఎస్సీ నోటిఫికేషన్ జారీ నాటికి ఈ పోస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. -
ఒకటే పరీక్ష.. ఒకటే ప్రశ్నపత్రం
-
ఒకటే పరీక్ష.. ఒకటే ప్రశ్నపత్రం
- వేర్వేరు మేనేజ్మెంట్ల పరిధిలోని టీచర్ పోస్టుల భర్తీపై సర్కారు నిర్ణయం - ఏప్రిల్ నెలాఖరుకు నోటిఫికేషన్ - ఖాళీల సేకరణపై కసరత్తు - విద్యాశాఖ అధికారులతో డిప్యూటీ సీఎం కడియం సమీక్ష - ‘టెట్’ దరఖాస్తులపై సందిగ్ధం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఖాళీ ల భర్తీలో సరికొత్త విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఏ మేనేజ్మెంట్ (గిరిజన, సాంఘిక సంక్షేమ, విద్యాశాఖ, మోడల్ స్కూళ్ల)లోని ఉపాధ్యాయ ఖాళీలను ఆ మేనేజ్మెంట్ పరిధిలోనే భర్తీచేసే విధానం ఉండగా... ఇకపై మేనేజ్మెంట్ ఏదైనా ఒకే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని భావిస్తోంది. దీంతోపాటు ఒకే కేటగిరీ పోస్టులకు ఒకే ప్రశ్నపత్రం ద్వారా పరీక్ష నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ అంశంపై సోమవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విద్యాశాఖ అధికారులతో చర్చించినట్లు తెలిసింది. రాష్ట్రంలో 20 వేల వరకు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తామని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. భర్తీలో అమలు చేయాల్సిన నిబంధనలు, శాఖల వారీగా పోస్టింగ్‌ల విధానం తదితర అంశాలపై మార్గదర్శకాలను రూపొందించి, ఏప్రిల్ నెలాఖరుకు నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని స్కూళ్లకు, విద్యాశాఖ పరిధిలోని గురుకులాల్లో పోస్టులకు, మోడల్ స్కూళ్లలోని పోస్టులకు, సాంఘిక సంక్షేమ స్కూళ్లలోని ఖాళీల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయి. దీంతో ఆయా శాఖలపై భారం పడటమే కాకుండా పలు సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అన్ని శాఖలు, అన్ని విభాగాల పరిధిలోని స్కూళ్లలో పోస్టుల భర్తీకి ఒకే నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఆలోచనకు వచ్చింది. దీనిపై ఇదివరకే ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి... గిరిజన సంక్షేమ, బీసీ సంక్షేమ, సాంఘిక సంక్షేమ, విద్యాశాఖ, తెలంగాణ గురుకులాల విభాగాలకు చెందిన అధికారులతో సమీక్షించారు. ఆయా విభాగాలకు చెందిన పాఠశాలల్లోని ఖాళీలన్నింటిని గుర్తించి అందజేయాలని ఆదేశించారు. ఒకే రకమైన పోస్టులు.. పాఠశాల విద్యా శాఖ పరిధిలో స్కూళ్లలో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ), సబ్జెక్టుల ప్రకారం స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ), పండిట్, పీఈటీ, ఫిజికల్ డెరైక్టర్ వంటి పోస్టులు ఉన్నాయి. సంక్షేమ, విద్యాశాఖల పరిధిలోని గురుకులాలు, మోడల్ స్కూళ్లలో పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) కేటగిరీలుగా పోస్టులు ఉన్నాయి. వివిధ శాఖల గురుకులాలు, మోడల్ స్కూళ్లలో ఒకే రకమైన పోస్టులున్నందున వేర్వేరు నోటిఫికేషన్లు, పరీక్షలు అక్కర్లేదన్న భావనకు ప్రభుత్వం వచ్చింది. ఈ మేరకు చేపట్టాల్సిన చర్యలపై ఆయా శాఖలు నిమగ్నమయ్యాయి. త్వరలోనే ఇది ఓ కొలిక్కి రానుంది. టెట్ దరఖాస్తులు ఇంకెప్పుడో? మరోవైపు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్), జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ) నేతృ త్వంలో జరిగే ఉపాధ్యాయ నియామక పరీక్షలను వేర్వేరుగానే నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. గత నెల 14 నే టెట్ నోటిఫికేషన్ జారీ చేసినా.. వరంగల్ ఉప ఎన్నికల నేపథ్యంలో దరఖాస్తుల స్వీకరణ వాయిదా పడింది. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎమ్మెల్సీల నోటిఫికేషన్ రావడంతో.. ఎన్నికల కమిషన్ ఆమోదం కోసం లేఖ రాశారు. ఈసీ నుంచి ఇంకా ఆమోదం రాలేదని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 24న టెట్ జరుగుతుందా, లేదా? మార్చుతారా అన్నదానిపై స్పష్టత కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఒకేలా సర్వీసు రూల్స్.. ఒకేలా వేతనాలు ప్రస్తుతం వివిధ సొసైటీల పరిధిలోని గురుకులాలు, మోడల్ స్కూళ్లలోని ఒకే కేటగిరీ పోస్టులై న ప్రిన్సిపాళ్లు, పీజీటీ, టీజీటీ పోస్టులకు పరిగణనలోకి తీసుకునే విద్యార్హతల్లో తేడాలు ఉన్నారుు. అంతేకాదు సర్వీసు రూల్స్, వేతనాల విధానాల్లోనూ వ్యత్యాసాలు ఉన్నారుు. ప్రస్తుతం వాటన్నింటినీ సరిదిద్దాలని కూడా ప్రభుత్వం నిర్ణయూనికి వచ్చింది. ఒకే నోటిఫికేషన్, ఒకే రకమైన ప్రశ్నపత్రంతో పాటు ఒకే కేటగిరీకి చెందిన ఉద్యోగులకు సర్వీసు రూల్స్, పదోన్నతులు, వేతనాల్లో వ్యత్యాసాలు కూడా ఒకేలా ఉండేలా చర్యలు చేపట్టాలని భావిస్తోంది.