సాక్షి, హైదరాబాద్: ఖాళీల భర్తీల్లో భాగంగా మరో నోటిఫికేషన్‌కు తెలంగాణ సర్కార్ సిద్ధమవుతోంది. పాఠశాల విద్యాశాఖలో 5, 089 పోస్టుల భర్తీకి ఆర్ధిక శాఖ అనుమతి ఇచ్చింది. వివిధి కేటగిరీల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీ కోసం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ముందకు వెళ్లనుంది.
మొత్తం 5,089లో.. 2,575 ఎస్‌జీటీ, 1,739 స్కూల్ అసిస్టెంట్, 611 భాషా పండితులు, 164 పీఈటీ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు.
టీఎస్‌పీఎస్సీ కాదు..
ఈసారి టీఎస్‌పీఎస్సీ ద్వారా ఖాళీలను భర్తీ చేయడం లేదు. గతంలో మాదిరిగా డీఎస్సీ(జిల్లా ఎంపిక కమిటీలు) ద్వారా నియామకాలు ఉంటాయని ఇప్పటికే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. అంటే.. టెట్‌లో అర్హత సాధించిన వాళ్లంతా టీఆర్‌టీకి పోటీ పడేందుకు అర్హులన్నమాట. అందులో అర్హత సాధించిన వాళ్లను డీఎస్సీకి పంపుతారు. ఆయా జిల్లాల డీఎస్సీలు నియమకాలు చేపడతాయి.
టెట్ ఎప్పుడంటే..
ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ సెప్టెంబర్ 15వ తేదీన ఉండనుంది. అదే నెల 27వ తేదీన ఫలితాలు వెల్లడిస్తారు. ఆ తర్వాత వెంటనే ఉపాధ్యాయుల పోస్టుల నోటిఫికేషన్ విడుదల అవుతుంది.
కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణ
సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఒప్పంద టీచర్లను క్రమబద్దీకరించడంపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 567 మంది కాంట్రాక్ట్ టీచర్లను క్రమబద్దీకరిస్తూ ఒకటి రెండు రోజుల్లోనే ఉత్తర్వులు జారీ చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment