
న్యూఢిల్లీ : ఉపాధ్యాయుల నియామకాలు సెప్టెంబర్ 4వరకు పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయుల నియామకాల్లో జాప్యం జరుగుతుందని దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అఫిడవిట్ సమర్పించిన ఏపీ ప్రభుత్వం.. ప్రభుత్వ పాఠశాలల్లో సుప్రీం కోర్టు ఆదేశాలు అమలు చేస్తామని పేర్కొంది. మరోవైపు 4,444 పోస్టుల భర్తీపై హైకోర్టులో పిటిషన్ ఉండటంతో నియామకాలు చేపట్టడం ఆలస్యం అవుతుందని తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. అయితే తెలంగాణ అంశాన్ని వచ్చే వారం విచారిస్తామని జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment