కేంద్ర కొలువులకు... ఎస్‌ఎస్‌సీ- సీహెచ్‌ఎస్‌ఎల్! | SSC CHSL Staff Selection Commission | Sakshi
Sakshi News home page

కేంద్ర కొలువులకు... ఎస్‌ఎస్‌సీ- సీహెచ్‌ఎస్‌ఎల్!

Published Wed, Jun 17 2015 11:52 PM | Last Updated on Tue, Sep 18 2018 8:18 PM

కేంద్ర కొలువులకు... ఎస్‌ఎస్‌సీ- సీహెచ్‌ఎస్‌ఎల్! - Sakshi

కేంద్ర కొలువులకు... ఎస్‌ఎస్‌సీ- సీహెచ్‌ఎస్‌ఎల్!

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ).. తాజాగా కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (10+2) పరీక్ష-2015కు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా పోస్టల్ అసిస్టెంట్లు/సార్టింగ్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, లోయర్ డివిజన్ క్లర్క్స్ మొత్తం 6,578 ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
 
 ఖాళీల వివరాలు:
 పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్: 3,523
 డేటా ఎంట్రీ ఆపరేటర్స్ (డీఈవో): 1006
 లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్‌డీసీ): 2049
 
 అర్హత:2015, ఆగస్టు 1 నాటికి ఇంటర్ లేదా తత్సమాన అర్హత.
 వయసు:2015, ఆగస్టు 1 నాటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు; పీడబ్ల్యూడీ జనరల్ అభ్యర్థులకు పదేళ్లు, ఓబీసీలకు 13 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 15 ఏళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుం ది. వితంతువు, విడాకులు తీసుకున్న మహిళల కేటగిరీలో జనరల్ కేటగిరీ మహిళలకు 35 ఏళ్లు, ఓబీసీ మహిళలకు: 38 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ మహిళలకు 45 ఏళ్ల వరకు వయోపరిమితి ఉంది.
 
 వేతనాలు:
 పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్:
 రూ.5,200-రూ.20,200; గ్రేడ్ పే- 2400.
 ూ.5,200-రూ.20200; గ్రేడ్ పే- 2400/1900.
 లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్‌డీసీ):
 రూ.5,200-రూ.20,200; గ్రేడ్ పే- 1900.

 ఎంపిక ప్రక్రియ: రెండు దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. తొలుత రాత పరీక్ష ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన వారికి స్కిల్ టెస్ట్/టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. రెండింటిలో సాధించిన మార్కుల ఆధారంగా తుది జాబితా రూపొందిస్తారు.
 
 పరీక్ష విధానం:
 రాత పరీక్షలో ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఉంటాయి. 200 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. రెండు గంటల వ్యవధిలో సమాధానాలు గుర్తించాలి.
 సబ్జెక్టు    ప్రశ్నలు    మార్కులు
 జనరల్ ఇంటలిజెన్స్    50    50
 ఇంగ్లిష్ లాంగ్వేజ్    50    50
 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
 (బేసిక్ అర్థమెటిక్ స్కిల్స్)    50    50
 జనరల్ అవేర్‌నెస్    50    50
 మొత్తం     200    200
 
 ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఒకవేళ అనుమతి లభిస్తే పరీక్షను ఆన్‌లైన్లో నిర్వహిస్తారు. స్కిల్ టెస్ట్ (డేటా ఎంట్రీ ఆపరేటర్): గంటకు ఎనిమిది వేల కీ డిప్రెషన్స్; టైపింగ్ టెస్ట్ (పోస్టల్ అసిస్టెంట్లు/సార్టింగ్ అసిస్టెంట్లు, ఎల్‌డీసీ): అభ్యర్థులు దరఖాస్తులో పేర్కొన్న చాయిస్‌ను బట్టి ఇంగ్లిష్ లేదా హిందీలో నిర్వహిస్తారు. కంప్యూటర్‌పై ఇంగ్లిష్ అయితే నిమిషానికి 35 పదాలు, హిందీ అయితే 30 పదాలు టైప్ చేయాలి.
 
 ముఖ్యతేదీలు:
 ఆన్‌లైన్ లేదా పోస్ట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
 దరఖాస్తు ఫీజు: రూ.100; ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మహిళలు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
 దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 13, 2015.
 పార్ట్-1 రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: జూలై 10, 2015.
 పార్ట్-2 రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: జూలై 13, 2015.
 పరీక్ష తేదీలు: 2015, నవంబరు 1, 15, 22
 (ఆదివారాల్లో).
 వెబ్‌సైట్: sscregistration.nic.in/ssc
 
 సిలబస్
 జనరల్ ఇంటెలిజెన్స్: ఈ విభాగం నుంచి వెర్బల్/నాన్ వెర్బల్ ప్రశ్నలు వస్తాయి. సెమాంటిక్ అనాలజీ, సింబాలిక్ ఆపరేషన్స్, సింబాలిక్/నంబర్ అనాలజీ, ట్రెండ్స్, ఫిగరల్ అనాలజీ, స్పేస్ ఓరియెంటేషన్, సెమాంటిక్ క్లాసిఫికేషన్, వెన్ డయాగ్రామ్స్, సింబాలిక్/నంబర్ క్లాసిఫికేషన్, డ్రాయింగ్ ఇన్ఫరెన్సెస్, ఫిగరల్ క్లాసిఫికేషన్, నంబర్ సిరీస్, ఎంబెడెడ్ ఫిగర్స్, ఫిగరల్ సిరీస్, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లం సాల్వింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వర్డ్ బిల్డింగ్, సోషల్ ఇంటెలిజెన్స్, కోడింగ్ అండ్ డీ కోడింగ్, నంబర్ ఆపరేషన్స్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
 
 ఇంగ్లిష్ లాంగ్వేజ్: స్పాట్ ది ఎర్రర్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్/డిటెక్టింగ్స్, మిస్ స్పెల్ట్ వర్డ్స్, ఇడియమ్స్ అండ్ ప్రేజెస్, వన్ వర్డ్ సబ్‌స్టిట్యూషన్, ఇంప్రూవ్‌మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, యాక్టివ్ అండ్ పాసివ్ వాయిసెస్ ఆఫ్ వెర్బ్స్, డెరైక్ట్ అండ్ ఇన్‌డెరైక్ట్ నెరేషన్, క్లోజ్ ప్యాసేజ్, కాంప్రెహెన్షన్ ప్యాసేజ్ నుంచి ప్రశ్నలు వస్తాయి.అర్థమెటిక్: నంబర్ సిస్టమ్స్, ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్, ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్,ట్రిగనోమెట్రీ, స్టాటిస్టికల్ చార్ట్స్ నుంచి ప్రశ్నలుంటాయి.జనరల్ అవేర్‌నెస్: కరెంట్ అఫైర్స్‌తో పాటు సాధారణ పరిజ్ఞానానికి సంబంధించి ప్రశ్నలు ఉంటాయి. చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ, ఎకనామిక్ సైన్స్, జనరల్ పాలసీ, సైంటిఫిక్ రీసెర్చ్ అంశాల నుంచి కూడా ప్రశ్నలు వస్తాయి. దినపత్రికలు చదివి, ముఖ్యమైన అంశాలను నోట్స్‌గా రాసుకోవడం వల్ల ఈ విభాగంలో మంచి మార్కులు సాధించవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement