సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శుక్రవారం రాత్రి ఏడు గంటలకు సచివాలయంలోని డీ బ్లాక్‌లో టెన్త్ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 83.78 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మార్చిలో జరిగిన ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 11,103 పాఠశాలలకు చెందిన 5,34,726 మంది హాజరయ్యారు. ఎప్పటిలాగానే ఈసారి కూడా ఉత్తీర్ణతలో బాలికలే పైచేయిగా నిలిచారు. ఇక ఫలితాల్లో మొదటి స్థానంలో జగిత్యాల జిల్లా, చివరి స్థానంలో ఆదిలాబాద్ జిల్లా నిలిచింది.
ఫలితాల్లో బాలికలదే పైచేయి
బాలుర ఉత్తీర్ణత శాతం 82.46
బాలికల ఉత్తీర్ణత శాతం 85.14
21 సూళ్లలో సున్నా శాతం ఫలితాలు
వీటీలో 11 ప్రయివేటు స్కూళ్లు
జూన్ 4 నుంచి 19 వరకూ టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు
అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపుకు మే 21 చివరి తేదీ
ఫలితాల కోసం..
www.sakshieducation.com,
www.bse.telangana.gov.in,
http://results.cgg.gov.in వెబ్‌సైట్లలో పొందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment