మార్చి 27 నుంచి పదో తరగతి పరీక్షలు
రీషెడ్యూల్‌ను ప్రకటించిన ఎస్సెస్సీ బోర్డు
సాక్షి, హైదరాబాద్:
పదో తరగతి పరీక్షలు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 26వ తేదీ నుంచి ఏప్రిల్ 12 వరకు కాకుండా.. మార్చి 27వ తేదీ నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు సవరించిన షెడ్యూల్‌ను సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు బుధవారం వెల్లడించింది. తొలుత ఇంటర్ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని షెడ్యూల్‌ను ప్రకటించారు. అయితే ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుల కారణంగా ఎస్సెస్సీ పరీక్షల షెడ్యూల్‌ను సైతం మార్చారు. కొత్త షెడ్యూల్ ప్రకారం మార్చి 27న ప్రథమ భాష పరీక్షతో పరీక్షలు ప్రారంభమై ఏప్రిల్ 15న ఒకేషనల్ కోర్సు పరీక్షతో ముగుస్తాయి. అన్ని పరీక్షలు ఉదయం 9.30 గంటలకు మొదలవుతాయి. కొత్తషెడ్యూల్ పక్క పట్టికలో...