జెడ్పీ బాలబాలికల హైస్కూల్లో డీఈఓ శామ్యూల్
పొదలకూరు: జిల్లాలో టెన్త్ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం ముఖ్యం కాదని, ప్రతిభకలిగిన విద్యార్థులను తయారు చేయడమే ముఖ్యమని డీఈఓ కేశామ్యూల్ పేర్కొన్నారు. పొదలకూరు డీఎన్నార్ జెడ్పీ బాలబాలికల హైస్కూల్లోని టెన్త్ పరీక్ష కేంద్రాలను డీఈఓ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఈఓ విలేకరులతో మాట్లాడుతూ పరీక్షలు పగడ్బందీగా జరుగుతున్నట్టు తెలిపారు. పొదలకూరు పరీక్ష కేంద్రాలు సమస్యాత్మక కేంద్రాల జాబితాలో ఉన్నాయన్నారు. అయితే ఇక్కడ ప్రశాంతంగా పరీక్షలను నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఫలితాల కంటే ప్రతిభ ముఖ్యమని, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు టెన్త్ ఉత్తీర్ణత సాధించి ఇంటర్‌లో కూడా రాణించాలన్నారు. టెన్త్‌లో ప్రతిభ లేకుండా ఉత్తీర్ణత సాధించే విద్యార్థులు ఇంటర్‌లో పాఠ్యాంశాలను అందుకోలేక ఇబ్బంది పడుతున్నట్టు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా టెన్త్ పరీక్షల కోసం 45 సిట్టింగ్, 10 ఫ్లయింగ్, 20 స్పెషల్ స్క్వాడ్లను నియమించినట్టు ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment