జోరుగా మాస్‌ కాపీయింగ్‌ | Mass Copying In Tenth Class Exams | Sakshi
Sakshi News home page

జోరుగా మాస్‌ కాపీయింగ్‌

Published Thu, Mar 22 2018 11:39 AM | Last Updated on Wed, Sep 26 2018 3:25 PM

Mass Copying In Tenth Class Exams - Sakshi

నెల్లూరు: పది పరీక్షలను తనిఖీ చేస్తున్న డీఈఓ శామ్యూల్‌

నెల్లూరు(టౌన్‌): గత ఏడాది మార్చి 15వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు జరిగాయి. నారాయణ, శ్రీచైతన్య పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించారు. ఆ సమయంలో 21వ తేదీ స్థానిక ధనలక్ష్మీపురంలోని నారాయణ పాఠశాలలో ఫిజిక్స్‌ పేపర్‌ లీకైంది. ఈ లీక్‌ వ్యవహారంలో శ్రీచైతన్య పాఠశాల నిర్వాహకులు కూడా ఉన్నట్లు అప్పటి విద్యాశాఖాధికారులు తేల్చారు. అయితే నేటి వరకు ఆ పాఠశాలలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. మళ్లీ ఈ ఏడాది నారాయణ, శ్రీచైతన్య పాఠశాలల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాకపోతే గత ఏడాది పేపరు

‘పదో తరగతి పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ జరగకూడదు.. ఉత్తీర్ణత శాతం తగ్గినా ఫర్వాలేదు.. పిల్లలకు స్వచ్ఛందంగా తెచ్చుకున్న మార్కులనే తల్లిదండ్రులు, కలెక్టర్‌కు చెబుతాం.. మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడితే ఇన్విజిలేటర్లదే బాధ్యత. విద్యార్థులను డిబార్‌ చేయడంతో పాటు ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేస్తాం’ ఇది డీఈఓ కె.శామ్యూల్‌ చెప్పిన మాటలు. అయితే ఈ ఆదేశాలు చాలా ప్రాంతాల్లో అమలు కావడం లేదు. మెజార్టీ పరీక్ష కేంద్రాల్లో మాస్‌ కాపీయింగ్‌ జరిగిపోతుంది. చీఫ్‌ సూపరింటెండ్లు, ఇన్విజిలేటర్లు కార్పొరేట్‌ ప్రలోభాలకు తలొగ్గి పనిచేస్తున్నారు. చాలా కేంద్రాల్లో పరీక్షలు ప్రైవే టు పాఠశాలల యాజమాన్యం కనుసన్నల్లో జరుగుతున్నాయి.  ఈ కేంద్రాల్లో ఇన్వి జిలేటర్లే బిట్‌ పేపరకు జవాబులు చెబు తున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నా యి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల యా జమాన్యాల లక్ష్యం ఒక్కటే 10కి10 పాయింట్లు తెచ్చుకోవడమే. జి ల్లా విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి ఎన్ని ఆదేశాలు వచ్చినా, సంబంధిత ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేసినా మా స్‌ కాపీయింగ్‌ ఆగడం లేదు. మాస్‌ కాపీయింగ్‌ను ప్రో త్సహించే వారిని కాకుం డా తమను బలి పశువును చేస్తున్నారంటూ కొందరు ఉపాధ్యాయులు వా పోతున్నారు. ప్రైవేటు ´ ఠశాలల ప్రవేశంతో చూచిరాతలు సాగుతున్నాయి.

నలుగురు విద్యార్థుల డీబార్, ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్‌
ఇప్పటి వరకు జరిగిన పది పరీక్షల్లో నలుగుగురు విద్యార్థులు మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడుతుండగా అధికారులు డిబారు చేశారు. సీతారాంపురంలోని ఏపీ మోడల్‌ హైస్కూల్‌లో ఈనెల 17న మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు విద్యార్థినులను డిబారు చేశారు. వీరితో పాటు ఇద్దరు ఉపాధ్యాయలును సస్పెండ్‌ చేశారు. అదేవిధంగా ఈ నెల 21న ఆత్మకూరులోని జెడ్పీ హైస్కూల్‌ కేంద్రాంలో మరో ఇద్దరు విద్యార్థులను డిబార్‌ చేశారు. ఉపాధ్యాయుల సస్పెన్షన్‌పై ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించడం, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు రిపోర్టులో బాధ్యులుగా లేకపోవడంతో ప్రస్తుతం సస్పెండ్‌ చేయకూడదని నిర్ణయించినట్లు తెలిసింది.

ప్రైవేటు పాఠశాలలే కీలకం
 జిల్లాలో 32 ప్రైవేటు పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. నారాయణ, శ్రీచైతన్య, కేకేఆర్, ఎస్‌ఆర్‌కే తదితర పాఠశాలలు ఉన్నాయి. గతంలో పదో తరగతికి మార్కులు ఉండేవి. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం కొందరను లక్ష్యంగా చేసుకుని ఎక్కువ మార్కులు వచ్చే విధంగా ప్రణాళికలు రచించే వారు. గత ఏడాది నుంచి గ్రేడు విధానాన్ని ప్రవేశపెట్టారు. పాఠశాలలో ఎక్కువ మందికి 10కి10 పాయింట్లు తెచ్చుకోవడమే వారి లక్ష్యం. నెల్లూరురూరల్‌ ప్రాంతంతో పాటు రాజుపాళెం, గూడూరు, నాయుడుపేట, ఉదయగిరి, ఆత్మకూరు, కావలి ప్రాంతాలో ఎక్కువ మాస్‌ కాపీయింగ్‌ జరుగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. సీ  కేంద్రాలుగా ప్రకటించిన 28సెంటర్లల్లో సీసీ కెమెరాలను బిగిస్తామని చెప్పిన అధికారులు ఆ జోలికే పోలేదు. తమకు కావాల్సిన ఇన్విజిలేటర్లను నియమించుకోవడంతో పాటు తమకు నచ్చిన వారని చీఫ్‌సూపరింటెండెంట్‌లు, డిపార్టుమెంట్‌ అధికారులను నియమించుకుంటున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ ఏడాది ఒక్కొ ఇన్విజిలేటరు నాలుగు పరీక్ష కేంద్రాలకు మార్చుతామని చెప్పినా అక్రమాలు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బిట్‌ పేపరుకు జవాబులు
 జిల్లాలోని అన్ని కేంద్రాల్లో బిట్‌ పేపరుకు ఇన్విజిలేటర్లే  జవాబులు చెబుతున్నారనే ఆరోపణలున్నాయి. చాల ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు పరీక్షల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవలంబిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చీఫ్‌ సూపరింటెండెంట్లు ద్వారా ప్రశ్నపత్రం ఉదయం 10 గంటలకు బయటకు వస్తుందనే ఆరోపణలున్నాయి.

కాపీయింగ్‌కు పాల్పడితే చర్యలు తప్పవు
పది పరీక్షల్లో ఎవరు మాస్‌ కాపీయింగ్‌ పాల్పడ్డా చర్యలు తప్పవు. మాస్‌ కాపీయింగ్‌లో ఉపాధ్యాయుని పాత్ర ఉన్నట్లయితే వారిని కూడా సస్పెండ్‌ చేస్తాం. పరీక్షలు చాల పకడ్బందీగా జరుగుతున్నాయి. ఇప్పటికే నలుగురు విద్యార్థులను డిబార్‌ చేశాం ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేశాం. –కె.శామ్యూల్, డీఈఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement