అన్ని ఉద్యోగాలకు ఒకటే పరీక్ష..! | Common Eligibility Test For All Central Govt Jobs | Sakshi
Sakshi News home page

అన్ని ఉద్యోగాలకు ఒకటే పరీక్ష..!

Published Mon, Mar 15 2021 11:39 AM | Last Updated on Mon, Mar 15 2021 12:07 PM

Common Eligibility Test  For All Central Govt Jobs - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్దమయ్యే అభ్యర్థులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు  భవిష్యత్తులో అన్నింటికీ కామన్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ను నిర్వహించనుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జీతేంద్ర సింగ్‌ శనివారం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ హాయంలో ఈ నిర్ణయం గొప్ప సంస్కరణగా చెప్పవచ్చునని పేర్కొన్నారు. ఈ సంస్కరణ మహిళలకు, దివ్యాంగ అభ్యర్థులకు మేలుజరగనుంది.  అంతేకాకుండా అభ్యర్థులకు పరీక్ష కేంద్రాలకు రావడానిక అయ్యే  రవాణా ఖర్చులు, పరీక్ష ఫీజులు తగ్గుతాయి,  అందుకుగాను నేషనల్‌ రిక్రూట్‌ ఎజెన్సీ (ఎన్‌ఆర్‌ఏ) ను ఏర్పాటు చేశామన్నారు.

ఎన్‌ఆర్‌ఏ  సెట్‌ను ఈ ఏడాది సెప్టెంబర్‌ లో నిర్వహించనున‍్నట్టు సమాచారం. దీంతో ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఎంతగానో మేలు జరుగుతుందని కేంద్రమంత్రి జీతేంద్ర సింగ్‌ వివరించారు. ఎన్‌ఆర్‌ఏ గ్రూప్‌-బి, గ్రూప్‌-సి ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఎన్‌ఆర్‌ఏ  స్వతంత్ర బోర్ఢ్‌గా వ్యవహరించనుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ , రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నిర్వహించే పరీక్షలను ఈ బోర్డ్‌ నిర్వహించనుంది. ప్రస్తుతం ఎస్ఎస్‌సీ , ఆర్‌ఆర్‌బీ , ఐబీపీఎస్‌ నిర్వహించే పరీక్షలకు ఎలాంటి ఆటంకం ఏర్పడదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement