న్యూఢిల్లీ: అదనంగా 15వేల మెగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని పెంచే ఉద్దేశంతో 2031 ఏడాదికల్లా దేశంలో కొత్తగా 20 అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పనున్నట్లు కేంద్రప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఈ విషయం చెప్పారు. కొత్త వాటిల్లో మొదటిదానిని వచ్చే ఏడాది గుజరాత్‌లోని కాక్రపార్‌లో 700 మెగావాట్ల సామర్థ్యంతో నెలకొల్పుతారు.
2024 ఏడాదిలో కల్పకంలో 50 మెగావాట్ల సామర్థ్యంతో ప్రోటోటైప్ ఫాస్ట్‌బ్రీడ్ రియాక్టర్‌ను, 2025లో చెరో 1,000 మెగావాట్ల సామర్థ్యంతో రెండు యూనిట్లను కుడంకుళంలో నిర్మిస్తారు. రాజస్తాన్‌లోని రావత్‌భటాలో చెరో 700 మెగావాట్ల సామర్థ్యంతో రెండు, 2027లో 1,000 మెగావాట్ల సామర్థ్యంతో మరో రెండు అణువిద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటుచేస్తారు. హరియాణాలోని గోరఖ్‌పూర్‌లో 2029 ఏడాదిలో 700 మెగావాట్ల సామర్థ్యంతో రెండు యూనిట్లు సిద్ధంచేస్తారు. 700 సామర్థ్యంతో మరో పదింటిని వేర్వేరు రాష్ట్రాల్లో.. అంటే హరియాణా, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో నిర్మిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment