CET
-
TG: ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి,హైదరాబాద్: ఈ ఏడాది తెలంగాణ కామన్ ఎంట్రన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి బుధవారం(జనవరి15) ఒక ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 29, 30 న అగ్రికల్చర్, ఫార్మసీ మే 2 నుంచి 5వరకు ఇంజనీరింగ్(EAPCET), మే 12న ఈ సెట్, జూన్ 1న ఎడ్ సెట్,జూన్ 6న లా సెట్, పీజీ ఎల్.సెట్జూన్ 8,9 న ఐసెట్,జూన్ 16 నుంచి 19 వరకు పీజీ ఈసెట్,జూన్ 11 నుంచి 14 వరకు పీ సెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు జేఎన్టీయూ(హెచ్),ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలు కన్వీనర్లుగా వ్యవహరించనున్నాయి. పలు ఉన్నత విద్య కోర్సుల్లో ప్రవేశానికి ఈ పరీక్షలు ప్రతి ఏటా నిర్వహిస్తారు.ఇదీ చదవండి: మీరు డాక్టరా లేక ఇంజినీరా..? -
సీటు కావాలంటే ‘సీఈటీ’ రాయాల్సిందే
ముంబై సెంట్రల్: ఇంటర్ మొదటి సంవత్సరంలో (11వ తరగతి) అడ్మిషన్ కోసం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (సీఈటీ) పరీక్షలో వచ్చిన మార్కులకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. దీంతో మూల్యాంకనం ఆధారంగా వెలువడ్డ పదో తరగతి పరీక్షా ఫలితాల్లో మంచి మార్కులు సాధించినప్పటికీ కాలేజీల్లో సీట్లు లభించడం కష్టతరం కానుంది. సీఈటీలో మంచి మార్కులు సాధించినవారికి అడ్మిషన్లు ఇచ్చిన తర్వాతే మిగతావారికి అవకాశం లభించనుంది. గతంలో పదో తరగతి పరీక్షల్లో 90 శాతం, ఆపైన మార్కులు సాధించిన విద్యార్థులు ఆన్లైన్ పద్ధతిలో నేరుగా తమకు ఇష్టమైన కాలేజీలో, ఇష్టమైన సబ్జెక్ట్‌లో ప్రవేశం పొందేవారు. కళాశాలలు కూడా 90 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకే ప్రాధాన్యత ఇచ్చేవి. కానీ, కరోనా మహమ్మారి వల్ల ఈసారి పరిస్థితులు మారాయి. పదో తరగతి పరీక్షల ఫలితాలను అంతర్గత మూల్యాంకన పద్ధతిలో వెలువరించారు. దీంతో కళాశాలలు ఆ ఫలితాలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అంతేగాక, ప్రతీ ఏడాదిలా కాకుండా ఈసారి కాలేజీల్లో ప్రవేశాలకు సీఈటీ పరీక్షలు పాస్ కావాలనే మెలిక పెట్టడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. పైగా, సీఈటి పరీక్షలు ఆఫ్‌లైన్‌లో జరగనున్నాయి. రాష్ట్ర సిలబస్ ప్రకారం ఈ సీఈటీ పరీక్షలు నిర్వహించనున్నారు. దీంతో ఆ సిలబస్‌లో చదివిన విద్యార్థులకు ఎక్కువ ఇబ్బంది కలగదు. కానీ, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, కేంద్రీయ విద్యాలయాల్లో చదువుకున్న విద్యార్థులు సీఈటీ పరీక్షలు పాసవ్వాలంటే కష్టపడాల్సి వస్తుందని విద్యా విభాగ పరిశీలకులు భావిస్తున్నారు. నిజానికి సీఈటీ ఆప్షనలే అయినప్పటికీ, ఈ ఏడాది మాత్రం సీఈటీలో పాసైన విద్యార్థులకే ప్రముఖ కాలేజీలు ప్రాధాన్యత ఇవ్వనున్నాయని స్పష్టమవుతోంది. ముందుగా సీఈటీ ద్వారా సీట్లను భర్తీ చేసుకున్నాకే మిగతా విద్యార్థులకు ప్రవేశాలకు అవకాశం కల్పిస్తారు. గత సంవత్సరం ముంబైలో పదకొండో తరగతిలో ప్రవేశాల కోసం మొదటి లిస్ట్‌లో 90 శాతం కంటే ఎక్కువ మార్కులు లభించిన వారికే అవకాశం కల్పించారు. కామర్స్, సైన్స్ విభాగాల్లో ప్రముఖ కాలేజీల్లో మొదటి కట్ ఆఫ్ 95 శాతం మించిపోయింది. 85 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు తమకు ఇష్టమైన కాలేజీల్లో ప్రవేశాల కోసం రెండో లిస్ట్ వరకు ఎదురు చూడక తప్పలేదు. అయితే, ఈ సంవత్సరం మాత్రం మారిన పరిస్థితుల నేపథ్యంలో సీఈటీ పరీక్ష ఫలితాల కట్ ఆఫ్‌నే పరిగణనలోకి తీసుకోనున్నారు. పనిచేయని వెబ్సైట్.. సీఈటీ పరీక్ష కోసం విద్యార్థులు రిజిస్టర్ చేసుకోవాలని సూచించిన వెబ్సైట్ సాంకేతిక కారణాలతో పనిచేయడం లేదు. దీంతో విద్యార్థులలో అయోమయం కనిపిస్తోంది. ముఖ్యంగా ఫలితాల అనంతరం సీఈటీ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెబ్సైట్ ఓపెన్ చేసిన మొదటి రోజే సర్వర్‌లో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో కొందరు మాత్రమే సీఈటీ పరీక్షలకు తమ పేర్లను రిజిస్టర్ చేసుకోగలిగారు. రెండో రోజు మరికొందరు నమోదు చేసుకున్నప్పటికీ జూలై 22వ తేదీ నుంచి వెబ్సైట్లో మరో సమస్య ఏర్పడింది. ఇలా అనేక సమస్యలతో శనివారం కూడా వెబ్సైట్ పనిచేయలేదు. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ కోసం జూలై 26వ తేదీ వరకు ఇచ్చిన గడువును పెంచనున్నారని సమాచారం. ఇదిలావుండగా సీఈటీ పరీక్షలు ఆగస్టు 21వ తేదీన జరగనున్నాయి. అయితే, ఈసారి ఆన్లైన్లో కాకుండా ఆఫ్‌లైన్‌లోనే ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి లాంటి ప్రక్రియలు సెప్టెంబర్ వరకు పూర్తి అవుతాయని, అక్టోబర్‌లో కాలేజీలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. -
అన్ని ఉద్యోగాలకు ఒకటే పరీక్ష..!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్దమయ్యే అభ్యర్థులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు భవిష్యత్తులో అన్నింటికీ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ను నిర్వహించనుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జీతేంద్ర సింగ్ శనివారం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ హాయంలో ఈ నిర్ణయం గొప్ప సంస్కరణగా చెప్పవచ్చునని పేర్కొన్నారు. ఈ సంస్కరణ మహిళలకు, దివ్యాంగ అభ్యర్థులకు మేలుజరగనుంది. అంతేకాకుండా అభ్యర్థులకు పరీక్ష కేంద్రాలకు రావడానిక అయ్యే రవాణా ఖర్చులు, పరీక్ష ఫీజులు తగ్గుతాయి, అందుకుగాను నేషనల్ రిక్రూట్ ఎజెన్సీ (ఎన్ఆర్ఏ) ను ఏర్పాటు చేశామన్నారు. ఎన్ఆర్ఏ సెట్‌ను ఈ ఏడాది సెప్టెంబర్ లో నిర్వహించనున్నట్టు సమాచారం. దీంతో ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఎంతగానో మేలు జరుగుతుందని కేంద్రమంత్రి జీతేంద్ర సింగ్ వివరించారు. ఎన్ఆర్ఏ గ్రూప్-బి, గ్రూప్-సి ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఎన్ఆర్ఏ స్వతంత్ర బోర్ఢ్‌గా వ్యవహరించనుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ , రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నిర్వహించే పరీక్షలను ఈ బోర్డ్ నిర్వహించనుంది. ప్రస్తుతం ఎస్ఎస్సీ , ఆర్ఆర్బీ , ఐబీపీఎస్ నిర్వహించే పరీక్షలకు ఎలాంటి ఆటంకం ఏర్పడదు. -
నేటి నుంచి సీఈటీ
రాష్ట్ర వ్యాప్తంగా 314 పరీక్ష కేంద్రాలు పరీక్ష రాయనున్న విద్యార్థులు 1,40,461 మంది సాక్షి, బెంగళూరు : ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో వైద్య, దంత వైద్య, ఇంజనీరింగ్ తదితర వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీఈటీ) నేటి (గురువారం) నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. ఇందుకు అవ సరమైన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తి చేసినట్లు కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ అధికారులు తెలిపారు. మొత్తం 1,40,461 మంది విద్యార్థులు ఈ ఏడాది సీఈటీ రాయనున్నారు. ఇందులో 36,411 మంది బెంగళూరుకు చెందిన వారు. ఇక సీఈటీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 314 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 70 బెంగళూరులోనే ఉన్నాయి. ఇదిలా ఉండగా ప్రవాస కన్నడిగులకు (హొరనాడు, గడినాడు) కన్నడ భాష పరిజ్ఞానంపై నిర్వహించే పరీక్ష ఈనెల 3న ఉదయం 11:30 నుంచి 12:30 గంటల వరకూ నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు మొత్తం 1,660 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికీ హాల్‌టికెట్లు అందని వారితో పాటు సీఈటీకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం www.kea.kar.nic.in, లేదా 080 23568201,23568202,23468205,23461575 లో సంప్రదించవచ్చు. -
వచ్చే ఏడది కూడా ఉమ్మడి 'సెట్స్'