AP SSC 10th Class Result 2023 Out - Check the Working Links to View the Marksheet
Sakshi News home page

AP SSC Results 2023: పదో తరగతి ఫలితాలు విడుదల..

Published Fri, May 5 2023 7:10 PM | Last Updated on Sat, May 6 2023 1:13 PM

AP SSC Results 2023 - Sakshi

AP SSC Results 2023

సాక్షి, అమరావతి: ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్బంగా మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాల వివరాలను వెల్లడించారు.

ఇక, పదో తరగతి పరీక్షల్లో 72.26 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది. ఫలితాల్లో బాలురు 69.27 శాతం, బాలికలు 75.38 శాతం ఉత్తీర్ణత సాధించారు. టెన్త్‌ పరీక్షల్లో బాలికలే పైచేయి సాధించారు. గతేడాది కంటే ఈసారి 5శాతం ఉత్తీర్ణత పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో 3.47 శాతం ఉత్తీర్ణత పెరిగింది.  

ఫెయిల్‌ అయిన విద్యార్థులకు తల్లి దండ్రులు ధైర్యం చెప్పాలి
ప్రభుత్వ చర్యలతోనే ఉత్తీర్ణత శాతం పెరిగిందన్నారు బొత్స సత్యనారాయణ. సీఎం జగన్‌ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి బొత్స తెలిపారు.రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి 18 రోజుల్లో ఫలితాలు ప్రకటించమని, పరీక్షల నిర్వహణ నుంచి ఫలితాల వరకూ పకడ్బందీగా వ్యవహరించామన్నరు.

తక్కువ ఉత్తీర్ణీత వచ్చిన ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. గతేడాది పేపర్‌ లీక్‌కు పాల్పడిన 70 మందికి పైగా టీచర్లను అరెస్ట్‌ చేశామన్నారు.ఈ ఏడాది ఆరోపణలు రాకుండా టెన్త్‌ పరీక్షలు నిర్వహించమన్న బొత్స.. ఫెయిల్‌ అయిన విద్యార్థులు నిరుత్సాహం చెందవద్దన్నారు. తల్లిదండ్రులు విద్యార్థులకు ధైర్యం చెప్పాలని బొత్స సూచించారు.

- ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా మొదటి స్థానం(87.4 శాతం ఉత్తీర్ణత). 
- నంద్యాల జిల్లా చివరి స్థానంలో ఉంది(60 శాతం). 
- ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌లో 95.25 శాతం మంది విద్యార్థులు పాస్‌ అయ్యారు. 


- జూన్‌ 2 నుంచి 10 వరకు సప్లిమెంటరీ పరీక్షలు. 
- మే 17వ తేదీలోపు సప్లిమెంటరీ పరీక్షల దరఖాస్తులకు ఆహ్వానం. 

ఈ ఏడాది మార్చిలో జరిగిన టెన్త్‌ పరీక్షలకు 6.40 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరిలో 6,05,052 మంది పరీక్ష­లకు హాజర­య్యారు. వీరిలో బాలికలు 2,95,807 మంది.. బాలురు 3,09,245 మంది ఉన్నారు. AP 10th Class Results 2023

కాగా, రాష్ట్రవ్యాప్తంగా 3,349 కేంద్రాల్లో ఏప్రిల్‌ 03 నుంచి 18 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. ఏప్రిల్‌ 19 నుంచి 26 వరకు స్పాట్‌ వ్యాల్యూయేషన్‌ పూర్తి చేశారు.
ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి:

ఫలితాలు ఇలా చెక్‌ చేసుకోండి....

  • BSEAP అధికారిక సైట్‌ bse.ap.gov.in లోకి వెళ్లండి.
  • హోమ్ పేజీలో AP 10వ ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి.
  • మీ హాల్ టికెట్ నంబర్ ని ఎంటర్ చేయండి.
  • సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి 
  • కొన్ని క్షణాల్లో మీ ఫలితం తెరపై కనబడుతుంది 
  • ఫలితాన్ని తనిఖీ చేసి డౌన్‌లోడ్ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement