AP Tenth Results 2023
-
టెన్త్ ఫలితాల్లో తిరుగులేని ‘మన్యం’.. రాష్ట్రవ్యాప్తంగా 72.26 శాతం ఉత్తీర్ణత
టెన్త్ ఫలితాల్లో ఈ ఏడాది పార్వతీపురం మన్యం జిల్లా తిరుగులేని ఫలితాలు సాధించింది. 87.47 శాతం ఉత్తీర్ణతతో ఈ జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 60.39 శాతం ఫలితాలతో నంద్యాల జిల్లా చివరి స్థానం దక్కించుకుంది. అలాగే, ఈ ఫలితాల్లో బాలుర కంటే బాలికలే పైచేయి సాధించారు. రాష్ట్రం మొత్తం మీద ఈ ఏడాది 6,05,052 మంది పరీక్షలకు హాజరుకాగా.. 4,37,196 మంది అంటే 72.26 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలికల ఉత్తీర్ణత శాతం 75.38 శాతమైతే బాలురది 69.27 శాతం. 933 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించగా, 38 పాఠశాలల్లో ‘జీరో’ ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఫలితాలను విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం విజయవాడలోని ఓ హోటల్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యా రంగంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు సత్ఫలిస్తున్నాయన్నారు. అందుకు ఈ ఏడాది పదో తరగతి ఫలితాలే నిదర్శమన్నారు. గత విద్యా సంవత్సరం ఫలితాల్లో 67.26 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈ ఏడాది ఐదు శాతం అధికంగా ఉత్తీర్ణులయ్యారన్నారు. ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో అత్యధికంగా 95.25 శాతం ఉత్తీర్ణత నమోదైందని చెప్పారు. ఇంగ్లిష్ మీడియంలో సైతం 80.82 శాతం మంది ఉత్తీర్ణత సాధించడం విశేషమని ఆయన తెలిపారు. జీరో శాతం ఉత్తీర్ణత నమోదైన 38 పాఠశాలల్లో కారణాలను విశ్లేషిస్తున్నామని, వచ్చే విద్యా సంవత్సరంలో అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నూరు శాతం ఫలితాలు సాధించిన పాఠశాలల ఉపాధ్యాయులను ప్రోత్సహించే దిశగా కార్యక్రమం నిర్వహిస్తామని మంత్రి బొత్స చెప్పారు. మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులు రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్ కోసం సబ్జెక్టుకు రూ.500 చొప్పున.. జవాబుపత్రాల నకలు కావాల్సిన వారు సబ్జెక్టుకు రూ.వెయ్యి చొప్పున చెల్లించి పొందచ్చని ఆయన తెలిపారు. ఆయా విద్యార్థులు ఈనెల 13వ తేదీలోగా ఠీఠీఠీ. ఛిజఝట. ్చp. జౌఠి. జీn వెబ్సైట్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 2 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ.. ఈ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు ఆందోళన చెందొద్దని, ఈ విద్యా సంవత్సరం వృధా కాకుండా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని.. అధైర్య పడకుండా దీనిని ఒక సవాలుగా తీసుకుని సప్లమెంటరీ పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించాలని మంత్రి బొత్స తెలిపారు. తల్లిదండ్రులు కూడా పిల్లలకు అండగా ఉండాలన్నారు. జూన్ 2 నుంచి 10 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని, టైంటేబుల్‌ను త్వరలో ప్రకటిస్తామని ఆయన చెప్పారు. అలాగే, ఫెయిలైన విద్యార్థుల కోసం సంబంధిత పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించి సప్లిమెంటరీ పరీక్షల్లో విజయం సాధించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. వీటికి హాజరయ్యేవారు ఆదివారం (ఈనెల 7వ తేదీ) నుంచి మే 17వ వరకూ ఫీజు చెల్లించవచ్చని, రూ.50 అపరాథ రుసుంతో మే 22 వరకూ అవకాశం కల్పించామన్నారు. ఇక ఈ పరీక్షా ఫలితాలను ప్రభుత్వ పరీక్షల సంచాలకుల వెబ్సైట్ ఠీఠీఠీ. bట్ఛ. ్చp. జౌఠి. జీnలో పొందుపరిచామని, మరో నాలుగు రోజుల్లో మార్కుల జాబితాలను కూడా వెబ్సైట్లో ఉంచుతామని బొత్స వివరించారు. నిర్ణీత సమయంలో ఎస్సెస్సీ మార్కుల జాబితాలను సంబంధిత పాఠశాలలకు పంపిస్తామన్నారు. మరోవైపు.. సీఎం ఆలోచనల మేరకు మన విద్యార్థులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేలా కృషిచేస్తున్నామన్నారు. పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతూ.. పరీక్షల్లో ఫెయిలైన వారు అధైర్యపడొద్దని హితవు పలికారు. విద్యార్థులు ఉన్నత చదువుల వైపు పయనించేలా రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన విద్యా ప్రమాణాలు అందిస్తోందన్నారు. ఆ ఆరుగురూ పాస్.. దృష్టిలోపం విద్యార్థుల కోసం డిజిటల్ విధానంలో నిర్వహించిన పదో తరగతి పరీక్షలకు హాజరైన ఆరుగురు విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ తరహాలో పరీక్షలు నిర్వహించడం దేశంలోనే తొలిసారి కావడం విశేషం. అనంతపురం జిల్లాలోని పొలిమెర చైత్రిక, చెంచుగారి పావని, యక్కలూరి దివ్యశ్రీ, మేకా శ్రీధాత్రి, యేకుల సౌమ్య, ఉప్పర నాగరత్నమ్మల కోసం డిజిటల్ రూపంలో ఈ పరీక్షలు న్విహించారు. జీరో ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల ఒక్కటే.. ఈసారి జీరో ఫలితాలు వచ్చిన 38 స్కూళ్లలో 29 ప్రైవేటు, ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. మరో 9 మాత్రమే ఇతర యాజమాన్యాల స్కూళ్లు ఉన్నాయి. వీటిల్లో ప్రభుత్వ పాఠశాల ఒక్కటే ఉండడం గమనార్హం. పాఠశాలల వారీగా చూస్తే.. ప్రైవేటువి 22, ప్రైవేటు ఎయిడెడ్వి 7, ప్రభుత్వ 1, జెడ్పీవి 5, ఆశ్రమ పాఠశాలలు మూడు జీరో ఫలితాలు సాధించాయి. ‘ప్రైవేటు’ అనుమతులకు వెబ్సైట్ రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలకు అనుమతులు, గుర్తింపునిచ్చేందుకు తీసుకొచ్చిన సింగిల్ విండో ఆన్లైన్ పోర్టల్‌ను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. కొత్తగా ప్రైవేట్ పాఠశాలలు ఏర్పాటుచేసేవారు, ఇప్పటికే ఉన్న స్కూళ్లకు నిర్ణీత వ్యవధిలో ఆర్ అండ్ బీ, ఫైర్, మున్సిపాలిటీ, పంచాయతీ, రిజిస్ట్రేషన్ శాఖ, పోలీస్ శాఖ నుంచి అనుమతులు పొందాలని ఆయన స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎస్. సురేష్‌కుమార్ ప్రభుత్వ పరీక్షల సంచాలకులు డి. దేవానంద్‌రెడ్డి, డైరెక్టర్ (కో–ఆర్డినేషన్) పి. పార్వతి, ఓపెన్ స్కూల్ డైరెక్టర్ కే. శ్రీనివాసరెడ్డి, కేజీబీవీ కార్యదర్శి మధుసూదనరావు, జాయింట్ డైరెక్టర్ మువ్వా రామలింగం పాల్గొన్నారు. -
AP: టెన్త్‌లో పెరిగిన ఉత్తీర్ణతా శాతం.. ఫస్ట్, లాస్ట్ జిల్లాలు ఇవే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టెన్త్ ఉత్తీర్ణత గత ఏడాదితో పోలిస్తే ఐదు శాతం పెరిగింది.. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తీర్ణతా శాతం 72.26 శాతం వచ్చింది.. అలాగే బాలుర కంటే బాలికలే పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో 75.38 శాతంతో పైచేయి సాధించారు. ఇక ఫెయిలైన విద్యార్ధులు అధైర్య పడవద్దని.. జూన్ మొదటీ వారంలో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నామని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. విజయవాడలో టెన్త్ ఫలితాలను మంత్రి బొత్స ప్రకటించారు. కేవలం 18 రోజుల వ్యవధిలోనే విద్యాశాఖ రికార్డుస్ధాయిలో ఫలితాలని ప్రకటించారు.. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 87.47 శాతం ఉత్తీర్ణత సాధించి పార్వతీపురం మన్యం జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. ఇక 60.39 శాతంతో చివరి స్ధానంలో నంద్యాల జిల్లా నిలిచింది. టెన్త్ పరీక్షలకి రాష్ట్రంలో 6,05,052 మంది పరీక్షకు హాజరు కాగా 4,37,196 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తీర్ణత శాతం 72.26 శాతం కాగా గత ఏడాది 68 శాతం ఉత్తీర్ణత వచ్చింది. అంటే గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత ఐదు శాతం పెరిగింది. వారిలో 69.27 శాతం బాలురు ఉత్తీర్ణులు కాగా 75.38 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించి బాలురు కంటే బాలికలు 6.11 ఎక్కువ శాతంలో ఉత్తీర్ణులై పై చేయిగా నిలిచారు. ఇక 933 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించగా ఏపీ రెసిడెన్సియల్ పాఠశాలల్లో 95.25 శాతం అత్యధికంగా ఉత్తీర్ణత సాధించారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల వివరాలను www.bse.ap.gov.inలో ఉంచారు. దీనికి సంబంధించి పాస్ వార్డ్ CBSE@2025 అని మంత్రి తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతోనే ఉత్తీర్ణత శాతం పెరిగిందన్నారు. గత ఏడాది టెన్త్ ఫలితాలలో 71 పాఠశాలల్లో జీరో శాతం ఫలితాలు రాగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 38 పాఠశాలలకి తగ్గించగలిగారు. ఇందులోనూ ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు 29 ఉండటం విశేషం.. ఇక ఒక ప్రభుత్వ హైస్కూలులో.. మరో ఐదు జెడ్పీ హైస్కూలులో జీరో శాతం ఫలితాలు వచ్చాయి.. జీరో శాతం ఫలితాలపై పాఠశాల వారీగా సబ్జెక్టు వారీగా విశ్లేషించి వచ్చే విద్యా సంవత్సరంలో అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు నూరు శాతం ఫలితాలు సాధించే దిశగా ప్రయత్నించాలని మంత్రి బొత్స అధికారులని ఆదేశించారు. చదవండి: వీరి పొత్తుల ఎత్తులు చూడాల్సిందే! అలాగే నేరుగా పరీక్షలు రాసిన ఆరుగురు అంధ విద్యార్ధులు పాసయ్యారు.. ఇక ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 2 నుండి 10వ తేదీ వరకూ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కొరకు అభ్యర్థులు మే 13వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాసిన 80.80 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని మంత్రి బొత్స తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులు అధైర్య పడకుండా ఒక సవాల్ గా తీసుకుని సప్లిమెంటరీ పరీక్షలు వ్రాసి ఉత్తీర్ణత సాధించాలన్నారు. పిల్లలు అధైర్య పడకుండా తల్లితండ్రులు వారిని ప్రోత్సహించాలని మంత్రి విజ్ఞప్తి చేసారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు సంబంధిత పాఠశాలల్లో ప్రత్యేక క్లాస్‌లు నిర్వహించి సప్లిమెంటరీ పరీక్షకు హాజరయ్యే విధంగా వారిని ప్రోత్సహించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షలు కొరకు హాజరయ్యే విద్యార్థులు మే 7 నుండి 17వ తేదీ వరకూ ఫీజులు చెల్లించవచ్చునన్నారు. టెన్త్ పరీక్షలపై గత ఏడాది జరిగిన సంఘటనలని దృష్టిలో పెట్టుకుని ఈ సారి పరీక్షల నిర్వహణ నుంచి ఫలితాలు ప్రకటించే వరకు ఎటువంటి ఆరోపణలు రాకుండా విద్యా శాఖ పకడ్బందీగా నిర్వహించారు. -
AP 10th Class Results 2023: పదో తరగతి ఫలితాలు విడుదల..
సాక్షి, అమరావతి: ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్బంగా మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాల వివరాలను వెల్లడించారు. ఇక, పదో తరగతి పరీక్షల్లో 72.26 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది. ఫలితాల్లో బాలురు 69.27 శాతం, బాలికలు 75.38 శాతం ఉత్తీర్ణత సాధించారు. టెన్త్ పరీక్షల్లో బాలికలే పైచేయి సాధించారు. గతేడాది కంటే ఈసారి 5శాతం ఉత్తీర్ణత పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో 3.47 శాతం ఉత్తీర్ణత పెరిగింది. ఫెయిల్ అయిన విద్యార్థులకు తల్లి దండ్రులు ధైర్యం చెప్పాలి ప్రభుత్వ చర్యలతోనే ఉత్తీర్ణత శాతం పెరిగిందన్నారు బొత్స సత్యనారాయణ. సీఎం జగన్ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి బొత్స తెలిపారు.రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి 18 రోజుల్లో ఫలితాలు ప్రకటించమని, పరీక్షల నిర్వహణ నుంచి ఫలితాల వరకూ పకడ్బందీగా వ్యవహరించామన్నరు. తక్కువ ఉత్తీర్ణీత వచ్చిన ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. గతేడాది పేపర్ లీక్‌కు పాల్పడిన 70 మందికి పైగా టీచర్లను అరెస్ట్ చేశామన్నారు.ఈ ఏడాది ఆరోపణలు రాకుండా టెన్త్ పరీక్షలు నిర్వహించమన్న బొత్స.. ఫెయిల్ అయిన విద్యార్థులు నిరుత్సాహం చెందవద్దన్నారు. తల్లిదండ్రులు విద్యార్థులకు ధైర్యం చెప్పాలని బొత్స సూచించారు. - ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా మొదటి స్థానం(87.4 శాతం ఉత్తీర్ణత). - నంద్యాల జిల్లా చివరి స్థానంలో ఉంది(60 శాతం). - ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో 95.25 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు. - జూన్ 2 నుంచి 10 వరకు సప్లిమెంటరీ పరీక్షలు. - మే 17వ తేదీలోపు సప్లిమెంటరీ పరీక్షల దరఖాస్తులకు ఆహ్వానం. ఈ ఏడాది మార్చిలో జరిగిన టెన్త్ పరీక్షలకు 6.40 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరిలో 6,05,052 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో బాలికలు 2,95,807 మంది.. బాలురు 3,09,245 మంది ఉన్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 3,349 కేంద్రాల్లో ఏప్రిల్ 03 నుంచి 18 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. ఏప్రిల్ 19 నుంచి 26 వరకు స్పాట్ వ్యాల్యూయేషన్ పూర్తి చేశారు. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి.... BSEAP అధికారిక సైట్ bse.ap.gov.in లోకి వెళ్లండి. హోమ్ పేజీలో AP 10వ ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి. మీ హాల్ టికెట్ నంబర్ ని ఎంటర్ చేయండి. సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి కొన్ని క్షణాల్లో మీ ఫలితం తెరపై కనబడుతుంది ఫలితాన్ని తనిఖీ చేసి డౌన్లోడ్ చేయండి -
రేపే ఏపీ టెన్త్ ఫలితాలు.. ఎన్ని గంటలకంటే?
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ టెన్త్ ఫలితాలు రేపు(శనివారం) ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలు విడుదల చేయనున్నారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తక్కువ వ్యవధిలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేస్తున్నామని మంత్రి బొత్స తెలిపారు. గత ఏడాది 28 రోజుల్లో విడుదల చేయగా, ఈ ఏడాది 18 రోజుల్లో ఫలితాలు ప్రకటిస్తున్నామని పేర్కొన్నారు. ఎక్కడా ఏవిధమైన లీకేజీ లేకుండా పూర్తి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించామని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పది పరీక్షలకు మొత్తం 6,64,152 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో రెగ్యులర్ అభ్యర్థులు 6,09,070 మంది కాగా, మిగిలిన వారు ఓఎస్సెస్సీ రెగ్యులర్, సప్లిమెంటరీ అభ్యర్థులు. 3,349 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. చదవండి: అమరావతి పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి.. 1) https://results.sakshieducation.com/ దీనిపై క్లిక్ చేయండి 2) హోం పేజీపై కనపడుతున్న ఏపీ టెన్త్ రిజల్ట్స్‌పై క్లిక్ చేయండి 3) మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి 4) మీ మార్క్ షీట్ ఓపెన్ అవుతుంది 5) మీ జాబితాను అక్కడే డౌన్లోడ్ చేసుకోవచ్చు