సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ టెన్త్ ఫలితాలు రేపు(శనివారం) ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలు విడుదల చేయనున్నారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తక్కువ వ్యవధిలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేస్తున్నామని మంత్రి బొత్స తెలిపారు.
గత ఏడాది 28 రోజుల్లో విడుదల చేయగా, ఈ ఏడాది 18 రోజుల్లో ఫలితాలు ప్రకటిస్తున్నామని పేర్కొన్నారు. ఎక్కడా ఏవిధమైన లీకేజీ లేకుండా పూర్తి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించామని మంత్రి తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పది పరీక్షలకు మొత్తం 6,64,152 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో రెగ్యులర్ అభ్యర్థులు 6,09,070 మంది కాగా, మిగిలిన వారు ఓఎస్సెస్సీ రెగ్యులర్, సప్లిమెంటరీ అభ్యర్థులు. 3,349 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు.
చదవండి: అమరావతి పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి..
1) https://results.sakshieducation.com/ దీనిపై క్లిక్ చేయండి
2) హోం పేజీపై కనపడుతున్న ఏపీ టెన్త్ రిజల్ట్స్‌పై క్లిక్ చేయండి
3) మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి
4) మీ మార్క్ షీట్ ఓపెన్ అవుతుంది
5) మీ జాబితాను అక్కడే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
Comments
Please login to add a commentAdd a comment