SSC result
-
Watch Live: పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదల
-
నేడు ఏపీ టెన్త్ ఎగ్జామ్స్ రిజల్ట్స్
-
2023 ఏపీ SSC స్టేట్ ర్యాంకర్ జ్యోత్స్న
-
రేపే ఏపీ టెన్త్ ఫలితాలు.. ఎన్ని గంటలకంటే?
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ టెన్త్ ఫలితాలు రేపు(శనివారం) ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలు విడుదల చేయనున్నారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తక్కువ వ్యవధిలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేస్తున్నామని మంత్రి బొత్స తెలిపారు. గత ఏడాది 28 రోజుల్లో విడుదల చేయగా, ఈ ఏడాది 18 రోజుల్లో ఫలితాలు ప్రకటిస్తున్నామని పేర్కొన్నారు. ఎక్కడా ఏవిధమైన లీకేజీ లేకుండా పూర్తి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించామని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పది పరీక్షలకు మొత్తం 6,64,152 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో రెగ్యులర్ అభ్యర్థులు 6,09,070 మంది కాగా, మిగిలిన వారు ఓఎస్సెస్సీ రెగ్యులర్, సప్లిమెంటరీ అభ్యర్థులు. 3,349 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. చదవండి: అమరావతి పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి.. 1) https://results.sakshieducation.com/ దీనిపై క్లిక్ చేయండి 2) హోం పేజీపై కనపడుతున్న ఏపీ టెన్త్ రిజల్ట్స్‌పై క్లిక్ చేయండి 3) మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి 4) మీ మార్క్ షీట్ ఓపెన్ అవుతుంది 5) మీ జాబితాను అక్కడే డౌన్లోడ్ చేసుకోవచ్చు -
'టెన్'షన్ వద్దు!
మదనపల్లె సిటీ: కోవిడ్ మహమ్మారితో రెండు సంవత్సరాలుగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించలేదు. ఈ ఏడాది కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో పరీక్షలు సజావుగా నిర్వహించారు. ఎలాంటి ఒడిదుడుకులు, ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయగా ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగాయి. అనంతరం మూల్యాంకనాన్ని శరవేగంగా పూర్తి చేశారు. ఈ కసరత్తు పూర్తి కావడంతో జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర స్థాయిలో ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా పది పరీక్షలు 153 కేంద్రాల్లో నిర్వహించగా 23,752 మంది విద్యార్థులు హాజరయ్యారు. దీంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఫలితాలు విడుదలవుతుండటంతో పిల్లలకు మార్కులు ఎలా వస్తాయోనని తల్లిదండ్రులు తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. మరో వైపు జిల్లా ఏ స్థానంలో నిలుస్తుందోనని అ«ధికారుల్లో సైతం ఆసక్తి నెలకొంది. గతంలో పరీక్షలలో మార్కులు తగ్గాయంటూ చాలా మంది పిల్లలు అ«çఘాయిత్యాలకు పాల్పడిన సందర్భాలు ఉన్నాయి. పిల్లలు ఉజ్వల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా క్షణికావేశంలో కఠిన నిర్ణయాలు తీసుకుని కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిన సంఘటనలూ లేకపోలేదు. కనిపెంచిన తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చిన సందర్భాలు కనిపించేవి. ఈ నేపథ్యంలో సోమవారం పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలవుతున్నాయి. విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తల్లిదండ్రుల బాధ్యత తదితర అంశాలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మానసిక వైద్యనిపుణులు, విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఫలితాలు ర్యాంకులే జీవితం కాదు జీవితంలో పరీక్షా ఫలితాలు వాటి ర్యాంకులే ముఖ్యం కాదు. కాలం, ప్రాణాన్ని మించి ఏదీ ముఖ్యం కాదనే విషయాన్ని తెలుసుకోవాలి. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఓటమి గెలుపునకు తుదిమెట్టు అన్న విషయాన్ని విద్యార్థులు గుర్తించుకోవాలి. ఫలితాలు ఎలా ఉన్నా ధైర్యంగా ముందుకు సాగితే ఉజ్వల భవిష్యత్తు సాధ్యపడుతుంది. క్షణికావేశానికి లోనుకావద్దు పది పరీక్షల ఫలితాలు వచ్చిన సమయంలో విద్యార్థులు క్షణికావేశానికి లోనుకాకూడదు. ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా ముందుకు సాగితే జీవిత లక్ష్యాలను చేరుకోవచ్చు. మార్కులు తక్కువ వచ్చాయని ఒత్తిడికి గురై క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని బుగ్గిపాలు చేస్తాయి. ఒక్క నిమిషం ఆలోచిస్తే సమస్య పరిష్కారానికి పలు మార్గాలు లభిస్తాయి. –ఎల్.బి.మహేష్‌నారాయణ, విద్యావేత్త, మదనపల్లె భయాందోళనకు గురిచేయవద్దు పది ఫలితాల వ్యత్యాసం చూపుతూ పిల్లల్ని భయాందోళనలకు గురి చేయరాదు. విద్యార్థులు కూడా ధైర్యంగా ఉండాలి. ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. పది పరీక్షలే జీవితాన్ని నిర్దేశించే పరీక్షలేమి కాదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. –డాక్టర్ ఆంజనేయులు, సూపరింటెండెంట్, జిల్లా ఆస్పత్రి, మదనపల్లె ప్రోత్సహించండి మార్కులు తక్కువ వచ్చాయని అఘాయిత్యాలకు పాల్పడటం సరైన పద్ధతి కాదు. ఉద్యోగాలు సాధించేందుకు, ఉన్నత చదువులకు వెళ్లేందుకు మార్కులు ఎక్కువగా ఉండాల్సిన అవసరం లేదు. నైపుణ్యాలు పెంచుకుని భవిష్యత్తులో మంచి ప్రతిభ కనబరిస్తే సరిపోతుంది. తల్లిదండ్రులు విద్యార్థులను ప్రోత్సహించాలి. వారిలో ధైర్యాన్ని నింపాలి. –ఎం.జయకుమార్, సైకాలజిస్టు, జిల్లా ఆస్పత్రి, మదనపల్లె -
35 మార్కులతో పాసై ఫేమస్ అయిపోయాడు
ముంబాయి : పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల రోజు అందరి దృష్టి మొదటి ర్యాంకు ఎవరికి వచ్చింది.. స్టేట్ టాపర్ ఏ స్కూల్ విద్యార్థి.. ఎంతమంది పాస్ అయ్యారు లాంటి విషయాలపై ఉంటుంది. మీడియా కూడా టాపర్ల గురించే చెబుతుంది. కానీ మహారాష్ట్రలో మాత్రం ఇవన్నీ కాదని బార్డర్ మార్కులతో పాసైన ఓ విద్యార్థి గురించి మీడియా తెగ ప్రచారం చేసింది. టాపర్ల కంటే ఎక్కువగా ఈ విద్యార్థి గురించి చర్చ జరిగింది. కేవలం బార్డర్ మార్కులతో పాసైన వ్యక్తి గురించి ఇంత ప్రచారం ఎందుకు అనుకుంటున్నారా.. మరి అక్కడే ఉంది ట్విస్టు. అతడికి అన్ని సబ్జెక్టుల్లోనూ సమానంగా 35 మార్కులు వచ్చాయి. అంటే.. అన్ని సబ్జెక్టుల్లో అతడు బార్డర్ మార్కులతో పాసయ్యాడన్నమాట. దీంతో అతడు ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు. ముంబైకి చెందిన అక్షిత్ జాదవ్ స్థానికంగా ఉన్న అందరిలాగే టెన్త్ ఎగ్జామ్స్ రాశాడు. గత శనివారం మహారాష్ట్ర టెన్త్ బోర్డు ఫలితాలను రిలీజ్ చేసింది. కానీ రిజల్ట్ చూసే సరికి షాకైపోయాడు. ప్రతి సబ్జెక్ట్‌లో 35 మార్కులు వచ్చాయి. ఇలా బార్డర్ మార్కులతో బయటపడటంతో ఊరంతా అతని గురించే చర్చ జరిగింది. లోకల్ మీడియాకు ఈ విషయం తెలియడంతో రోజు మొత్తం అక్షిత్ గురించే ప్రచారం చేసింది. ఈ సందర్భంగా అక్షిత్ తండ్రి గణేశ్ మాట్లాడూతూ..."మా కుమారుడి ఫలితాలు చూసి ఆశ్చర్యపోయాం. అతడు 55శాతం మార్కులతో పాస్ అవుతాడని అనుకున్నాం. కానీ విచిత్రంగా అన్ని సబ్జెక్టుల్లోనూ 35 మార్కులే వచ్చాయి. అయితే అతడు అన్ని సబ్జెక్టుల్లో పాస్ అవడం ఆనందంగా ఉంది’ అని చెప్పారు. అక్షిత్ తొమ్మిదో తరగతిలో ఫెయిల్ అయ్యాడు. తరువాత ఇక స్కూల్‌కు వెళ్లలేదు. టెన్త్ పరీక్షలు ప్రైవేటుగా రాసి పాసయ్యాడు. ఫుట్‌బాల్ అంటే ఎంతో ఇష్టమనే అక్షిత్...క్రీడలనే కెరీర్‌గా ఎంచుకుంటానని చెప్పాడు. ఇక సోషల్ మీడియాలో ఈ మార్కులపై జోకులు ఓ రేంజ్లో పేలాయి. ఇదో "నేషనల్ రికార్డు" అంటూ కొందరు కామెంట్ చేశారు. -
టెన్త్ ఫెయిల్ అవుతానన్న భయంతో..
సాక్షి, హైదరాబాద్ : త్వరలో రానున్న పదో తరగతి ఫలితాల్లో ఫెయిల్ అవుతానన్న అనుమానంతో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నగరంలోని ఉప్పుగూడకు చెందిన నరేష్(16) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవలె పదో తరగతి పరీక్షలు రాసిన ఆ బాలుడు.. ఫలితాల కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. తాను ఫెయిల్ అవుతానని భయపడ్డ బాలుడు ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకుని తనువు చాలించాడు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంధ్రంలో మునిగిపోయారు. కేసు నమోదు చేసుకున్న ఛత్రినాక పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. -
టెన్త్ క్లాస్ పాసైన టాప్ హీరోయిన్
ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రింకూ రాజ్‌గురూ అలియాస్ ప్రేరణ పదోతరగతి ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణురాలైంది. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘సైరత్’ సినిమాతో వెండితెరకు పరిచయమైన రింకూ.. ఆ సినిమా విడుదల అనంతరం ఓవర్‌నైట్ టాప్ స్టార్‌గా ఎదిగింది. సైరత్‌లో నటనకుగానూ రింకూకు జాతీయ అవార్డు లభించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర షోలాపూర్ జిల్లాలోని అక్లుంజ్ అనే చిన్న పట్టణానికి చెందిన 17 ఏళ్ల రింకూ.. మంగళవారం వెల్లడైన పదోతరగతి ఫలితాల్లో 66.40 శాతం మార్కులు సాధించారు. హిందీ సబ్జెక్టులో అత్యధికంగా 87 మార్కులు రాగా, మాతృభాష మరాఠీలో 83 మార్కులు సాధించింది. సైన్స్ అండ్ టెక్నాలజీలో 42, మ్యాథ్స్ 48, సోషల్ 50, ఇంగ్లీష్ 59 స్కోరింగ్ చేసింది. జజియామాతా కన్యా ప్రశాల స్కూల్లో చదువుకున్న ఆమె.. స్టార్డమ్ కారణంగా పాఠశాలకు వెళ్లలేక ప్రైవేటుగా పరీక్షరాసింది. త్వరలో తెలుగులోకి.. మరాఠీ సినిమా చరిత్రలో 100కోట్ల వసూళ్లు సాధించిన తొలిసినిమాగా రికార్డులకెక్కిన ‘సైరత్’ ను పలు భారతీయ భాషల్లో రీమేక్ చేసేందుకు నిర్మాతలు పోటీపడుతున్నారు. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ హిందీలో సైరత్‌ను రీమేక్ చేయనున్నారు. నటి శ్రీదేవి కూతురు జాన్వీని ఈ సినిమా ద్వారానే వెండితెరకు పరిచయం చేయనున్నారు. ఇక కన్నడలో ‘మనసు మలిగే’ పేరుతో సైరత్ రీమేక్ అయింది. ఇందులో రింకూనే హీరోయిన్గా నటించింది. కన్నడ హక్కులు పొందిన నిర్మాత రాక్‌లైన్ వెంకటేషే.. తెలుగులోనూ సైరత్‌ను రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగులోనూ రింకూనే హీరోయిన్గా నటిస్తుందని సమాచారం.