
సాక్షి, హైదరాబాద్ : త్వరలో రానున్న పదో తరగతి ఫలితాల్లో ఫెయిల్ అవుతానన్న అనుమానంతో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నగరంలోని ఉప్పుగూడకు చెందిన నరేష్(16) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవలె పదో తరగతి పరీక్షలు రాసిన ఆ బాలుడు.. ఫలితాల కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. తాను ఫెయిల్ అవుతానని భయపడ్డ బాలుడు ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకుని తనువు చాలించాడు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంధ్రంలో మునిగిపోయారు. కేసు నమోదు చేసుకున్న ఛత్రినాక పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment