tenth result
-
టెన్త్ ఫలితాల్లో తిరుగులేని ‘మన్యం’.. రాష్ట్రవ్యాప్తంగా 72.26 శాతం ఉత్తీర్ణత
టెన్త్ ఫలితాల్లో ఈ ఏడాది పార్వతీపురం మన్యం జిల్లా తిరుగులేని ఫలితాలు సాధించింది. 87.47 శాతం ఉత్తీర్ణతతో ఈ జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 60.39 శాతం ఫలితాలతో నంద్యాల జిల్లా చివరి స్థానం దక్కించుకుంది. అలాగే, ఈ ఫలితాల్లో బాలుర కంటే బాలికలే పైచేయి సాధించారు. రాష్ట్రం మొత్తం మీద ఈ ఏడాది 6,05,052 మంది పరీక్షలకు హాజరుకాగా.. 4,37,196 మంది అంటే 72.26 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలికల ఉత్తీర్ణత శాతం 75.38 శాతమైతే బాలురది 69.27 శాతం. 933 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించగా, 38 పాఠశాలల్లో ‘జీరో’ ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఫలితాలను విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం విజయవాడలోని ఓ హోటల్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యా రంగంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు సత్ఫలిస్తున్నాయన్నారు. అందుకు ఈ ఏడాది పదో తరగతి ఫలితాలే నిదర్శమన్నారు. గత విద్యా సంవత్సరం ఫలితాల్లో 67.26 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈ ఏడాది ఐదు శాతం అధికంగా ఉత్తీర్ణులయ్యారన్నారు. ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో అత్యధికంగా 95.25 శాతం ఉత్తీర్ణత నమోదైందని చెప్పారు. ఇంగ్లిష్ మీడియంలో సైతం 80.82 శాతం మంది ఉత్తీర్ణత సాధించడం విశేషమని ఆయన తెలిపారు. జీరో శాతం ఉత్తీర్ణత నమోదైన 38 పాఠశాలల్లో కారణాలను విశ్లేషిస్తున్నామని, వచ్చే విద్యా సంవత్సరంలో అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నూరు శాతం ఫలితాలు సాధించిన పాఠశాలల ఉపాధ్యాయులను ప్రోత్సహించే దిశగా కార్యక్రమం నిర్వహిస్తామని మంత్రి బొత్స చెప్పారు. మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులు రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్ కోసం సబ్జెక్టుకు రూ.500 చొప్పున.. జవాబుపత్రాల నకలు కావాల్సిన వారు సబ్జెక్టుకు రూ.వెయ్యి చొప్పున చెల్లించి పొందచ్చని ఆయన తెలిపారు. ఆయా విద్యార్థులు ఈనెల 13వ తేదీలోగా ఠీఠీఠీ. ఛిజఝట. ్చp. జౌఠి. జీn వెబ్సైట్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 2 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ.. ఈ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు ఆందోళన చెందొద్దని, ఈ విద్యా సంవత్సరం వృధా కాకుండా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని.. అధైర్య పడకుండా దీనిని ఒక సవాలుగా తీసుకుని సప్లమెంటరీ పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించాలని మంత్రి బొత్స తెలిపారు. తల్లిదండ్రులు కూడా పిల్లలకు అండగా ఉండాలన్నారు. జూన్ 2 నుంచి 10 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని, టైంటేబుల్‌ను త్వరలో ప్రకటిస్తామని ఆయన చెప్పారు. అలాగే, ఫెయిలైన విద్యార్థుల కోసం సంబంధిత పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించి సప్లిమెంటరీ పరీక్షల్లో విజయం సాధించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. వీటికి హాజరయ్యేవారు ఆదివారం (ఈనెల 7వ తేదీ) నుంచి మే 17వ వరకూ ఫీజు చెల్లించవచ్చని, రూ.50 అపరాథ రుసుంతో మే 22 వరకూ అవకాశం కల్పించామన్నారు. ఇక ఈ పరీక్షా ఫలితాలను ప్రభుత్వ పరీక్షల సంచాలకుల వెబ్సైట్ ఠీఠీఠీ. bట్ఛ. ్చp. జౌఠి. జీnలో పొందుపరిచామని, మరో నాలుగు రోజుల్లో మార్కుల జాబితాలను కూడా వెబ్సైట్లో ఉంచుతామని బొత్స వివరించారు. నిర్ణీత సమయంలో ఎస్సెస్సీ మార్కుల జాబితాలను సంబంధిత పాఠశాలలకు పంపిస్తామన్నారు. మరోవైపు.. సీఎం ఆలోచనల మేరకు మన విద్యార్థులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేలా కృషిచేస్తున్నామన్నారు. పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతూ.. పరీక్షల్లో ఫెయిలైన వారు అధైర్యపడొద్దని హితవు పలికారు. విద్యార్థులు ఉన్నత చదువుల వైపు పయనించేలా రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన విద్యా ప్రమాణాలు అందిస్తోందన్నారు. ఆ ఆరుగురూ పాస్.. దృష్టిలోపం విద్యార్థుల కోసం డిజిటల్ విధానంలో నిర్వహించిన పదో తరగతి పరీక్షలకు హాజరైన ఆరుగురు విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ తరహాలో పరీక్షలు నిర్వహించడం దేశంలోనే తొలిసారి కావడం విశేషం. అనంతపురం జిల్లాలోని పొలిమెర చైత్రిక, చెంచుగారి పావని, యక్కలూరి దివ్యశ్రీ, మేకా శ్రీధాత్రి, యేకుల సౌమ్య, ఉప్పర నాగరత్నమ్మల కోసం డిజిటల్ రూపంలో ఈ పరీక్షలు న్విహించారు. జీరో ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల ఒక్కటే.. ఈసారి జీరో ఫలితాలు వచ్చిన 38 స్కూళ్లలో 29 ప్రైవేటు, ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. మరో 9 మాత్రమే ఇతర యాజమాన్యాల స్కూళ్లు ఉన్నాయి. వీటిల్లో ప్రభుత్వ పాఠశాల ఒక్కటే ఉండడం గమనార్హం. పాఠశాలల వారీగా చూస్తే.. ప్రైవేటువి 22, ప్రైవేటు ఎయిడెడ్వి 7, ప్రభుత్వ 1, జెడ్పీవి 5, ఆశ్రమ పాఠశాలలు మూడు జీరో ఫలితాలు సాధించాయి. ‘ప్రైవేటు’ అనుమతులకు వెబ్సైట్ రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలకు అనుమతులు, గుర్తింపునిచ్చేందుకు తీసుకొచ్చిన సింగిల్ విండో ఆన్లైన్ పోర్టల్‌ను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. కొత్తగా ప్రైవేట్ పాఠశాలలు ఏర్పాటుచేసేవారు, ఇప్పటికే ఉన్న స్కూళ్లకు నిర్ణీత వ్యవధిలో ఆర్ అండ్ బీ, ఫైర్, మున్సిపాలిటీ, పంచాయతీ, రిజిస్ట్రేషన్ శాఖ, పోలీస్ శాఖ నుంచి అనుమతులు పొందాలని ఆయన స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎస్. సురేష్‌కుమార్ ప్రభుత్వ పరీక్షల సంచాలకులు డి. దేవానంద్‌రెడ్డి, డైరెక్టర్ (కో–ఆర్డినేషన్) పి. పార్వతి, ఓపెన్ స్కూల్ డైరెక్టర్ కే. శ్రీనివాసరెడ్డి, కేజీబీవీ కార్యదర్శి మధుసూదనరావు, జాయింట్ డైరెక్టర్ మువ్వా రామలింగం పాల్గొన్నారు. -
రేపే ఏపీ టెన్త్ ఫలితాలు.. ఎన్ని గంటలకంటే?
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ టెన్త్ ఫలితాలు రేపు(శనివారం) ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలు విడుదల చేయనున్నారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తక్కువ వ్యవధిలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేస్తున్నామని మంత్రి బొత్స తెలిపారు. గత ఏడాది 28 రోజుల్లో విడుదల చేయగా, ఈ ఏడాది 18 రోజుల్లో ఫలితాలు ప్రకటిస్తున్నామని పేర్కొన్నారు. ఎక్కడా ఏవిధమైన లీకేజీ లేకుండా పూర్తి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించామని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పది పరీక్షలకు మొత్తం 6,64,152 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో రెగ్యులర్ అభ్యర్థులు 6,09,070 మంది కాగా, మిగిలిన వారు ఓఎస్సెస్సీ రెగ్యులర్, సప్లిమెంటరీ అభ్యర్థులు. 3,349 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. చదవండి: అమరావతి పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి.. 1) https://results.sakshieducation.com/ దీనిపై క్లిక్ చేయండి 2) హోం పేజీపై కనపడుతున్న ఏపీ టెన్త్ రిజల్ట్స్‌పై క్లిక్ చేయండి 3) మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి 4) మీ మార్క్ షీట్ ఓపెన్ అవుతుంది 5) మీ జాబితాను అక్కడే డౌన్లోడ్ చేసుకోవచ్చు -
AP: టెన్త్ ఫెయిల్ అయ్యారా?.. అయితే ఇది మీకోసమే..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో ఫెయిలైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంసిద్ధం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈమేరకు రాష్ట్రంలోని ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్జేడీలు), జిల్లా విద్యాధికారులకు (డీఈవోలకు) పాఠశాలవిద్య కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్ మార్గదర్శకాలు జారీచేశారు. రోజూ రెండు సబ్జెక్టులపై విద్యార్థులకు బోధన సాగేలా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ‘ఈనెల 6వ తేదీన ఫలితాలు విడుదలైన టెన్త్ పబ్లిక్ పరీక్షలకు హాజరైన 6,15,908 మంది విద్యార్థుల్లో 2,01,627 మంది ఫెయిలయ్యారు. చదవండి: ఐఆర్సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీలు.. వివరాలు ఇదిగో.. రెండేళ్లుగా కరోనా వల్ల పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన లేక విద్యార్థుల్లో అభ్యాస నష్టం వల్ల వారంతా ఫెయిలైనట్లు విశ్లేషణలో తేలింది. వీరికి జూలైలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి. ఫెయిలైన విద్యార్థులు ఈ పరీక్షల్లో రాణించేలా వారికి ప్రత్యేక తర్ఫీదు ఇవ్వాల్సిన అవసరముంది. ఇందుకోసం సబ్జెక్టు, టాపిక్స్ వారీగా స్పెసిఫిక్ కోచింగ్‌ను చేపట్టాలి. ఈనెల 13వ తేదీనుంచి పరీక్షలు పూర్తయ్యేవరకు రోజుకు రెండు సబ్జెక్టుల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలను రూపొందించాలి. విద్యార్థులతో సబ్జెక్టులను పునశ్చరణ చేయించాలి. వారు ఆత్మవిశ్వాసంతో పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధించేలా వారిని తీర్చిదిద్దాలి..’అని వివరించారు. విద్యార్థులు, తల్లి దండ్రుల ప్రయోజనార్థం ఈ కోచింగ్ తరగతులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రాంతీయ సంయు క్త సంచాలకులు, జిల్లా విద్యాధికారులు శ్రద్ధ తీసుకుని ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీనికి సం బంధించిన ప్రణాళికలను రూపొందించుకోవాలని పేర్కొన్నారు. రెమిడియల్ తరగతులు అవసరమైన స్కూళ్లలో సబ్జెక్టు టీచర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. స్కూళ్ల వారీగా ప్రణాళికలను, టైమ్‌టేబుళ్లను రూపొందించుకోవాలని పేర్కొన్నారు. ఏ టీచర్ ఏ సమయంలో స్కూల్లో ఆయా సబ్జెక్టులపై తర్ఫీదు ఇవ్వాలో కూడా జాబితా రూపొందించాలని సూచించారు. ఈ ప్రణాళికలను ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్‌కు సమర్పించాలని నిర్దేశించారు. చదవండి: ఆర్ఆర్బీ అభ్యర్థులకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్.. తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు పాఠశాలవిద్య కమిషనర్ మార్గదర్శకాలు అందిన వెంటనే జిల్లాల్లో క్షేత్రస్థాయి అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేపట్టారు. కొన్ని జిల్లాల విద్యాధికారులు ఈ ఏర్పాట్లపై డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోలు, హెడ్మాస్టర్లకు సూచనలిచ్చారు. క్షేత్రస్థాయి అధికారులతో స్కూళ్ల వారీగా తరగతుల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా జిల్లాల్లోని స్థానిక పరిస్థితుల ఆధారంగా ఎవరు ఏ బాధ్యత నెరవేర్చాలో సూచనలు జారీచేస్తున్నారు. కొందరు డీఈవోలు జారీచేసిన సూచనలు.. ►సంబంధిత ప్రధానోపాధ్యాయుడు తప్పనిసరిగా తన పాఠశాలలో టెన్త్ ఫెయిలైన విద్యార్థులంతా ఈ ప్రత్యేక తరగతులకు హాజరయ్యేలా చూడాలి. ►షెడ్యూల్ ప్రకారం తరగతులకు హాజరుకావాలని ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులకు తెలియజేయడంతో పాటు వారి సబ్జెక్టు విభాగం ప్రకారం బాధ్యత ఇవ్వాలి. ►సంబంధిత సీఆర్పీ సహాయంతో గూగుల్ ఫారం ద్వారా రోజువారీ హాజరు నివేదికను డీసీఈబీ సెక్రటరీకి సమర్పించాలి. ►సబ్జెక్టు టీచర్లందరూ తమ సబ్జెక్టుల్లో ఫలితాల మెరుగుదల కోసం సొంత కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుని అమలు చేయాలి. ►సబ్జెక్టు వారీగా ప్లాన్‌తో పాటు టైమ్‌టేబుల్, దానికోసం రూపొందించిన ఉపాధ్యాయుల జాబితాను గూగుల్ ఫారం ద్వారా ప్రధానోపాధ్యాయులు జూన్ 11వ తేదీ నాటికి డీసీఈబీలకు తెలియజేయాలి. ►రెమిడియల్ తరగతులు ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉంటాయి. ►ఈ కార్యక్రమాలు సమర్థంగా అమలయ్యేలా డిప్యూటీ డీఈవోలు పర్యవేక్షించాలి. ►తక్కువ పనితీరు కనబరుస్తున్న పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాలి. -
ఏపీ: టెన్త్ మార్కుల మెమోలు విడుదల
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం పదో తరగతి ఫలితాలు, మార్కుల మెమోలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రేడ్లు కావాలని విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారని, హైపవర్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా.. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా గ్రేడ్లు కేటాయించామని తెలిపారు. రెండు విద్యాసంవత్సరాలకు సంబంధించి గ్రేడ్లు ప్రకటించామన్నారు. ఏ విద్యార్థికీ నష్టం కలగకుండా చర్యలు తీసుకున్నామని, భవిష్యత్‌లో విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. 2020-21 ఫలితాలు, గ్రేడ్లతో పాటు 2019-20 గ్రేడ్లు కూడా ప్రకటించారు. ఫలితాల కోసం క్లిక్ చేయండి : https://www.sakshieducation.com/Results2021/Andhra-Pradesh/SSC/2021/ap-ssc-10th-class-results-2021.html కాగా, గ్రేడ్ల విధానంలో విద్యార్థుల ఉత్తీర్ణతను ప్రకటించారు. 2019–20 విద్యార్థులు రాసిన మూడు ఫార్మేటివ్ పరీక్షల మార్కులకు 50 శాతం వెయిటేజీ, ఒక సమ్మేటివ్ పరీక్ష మార్కులకు 50 శాతం వెయిటేజీ ఇచ్చారు. మొత్తం 100 మార్కులుగా పరిగణనలోకి తీసుకుని గ్రేడ్ ఇచ్చారు. అన్ని సబ్జెక్టులకు ఇదే విధానం అనుసరించారు. వొకేషనల్ కోర్సుల విద్యార్థులకు కూడా ఇదే విధానం. 2017, 2018, 2019 సంవత్సరాల్లో ఫెయిలై ఆ తరువాత పరీక్షలకు హాజరైనవారికి వారి ఇంటర్నల్ మార్కులను పరిగణనలోకి తీసుకున్నారు. 20 అంతర్గత మార్కులను 5తో రెట్టింపుచేసి 100 మార్కులుగా పరిగణించి గ్రేడ్ ఇచ్చారు. -
రేపు టెన్త్ ఫలితాలు విడుదల
హైదరాబాద్: తెలంగాణ పదో తరగతి ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సాయంత్రం 4 గంటలకు పదోతరగతి ఫలితాలను విడుదల చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మార్చి 14 నుంచి 30 వరకు ఎస్సెస్సీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. 5.35 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తులు చేసుకోగా దాదాపు ఐదు లక్షల మంది హాజరయ్యారు. ఈ నెల 5న ఫలితాలు విడుదల చేయాలనుకున్నా రెండు రోజుల ముందుగానే ఫలితాలు వెల్లడిస్తున్నారు. -
మార్కులు తక్కువగా వచ్చాయని..
గుడిపాల: పదో తరగతి పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చాయని ఓ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్ఐ లక్ష్మీకాంత్ కథనం ప్రకారం... చిత్తపార జెడ్పీ హైస్కూల్లో కుసుమ(15) పదో తరగతి చదివి పరీక్షలు రాసింది. మంగళవారం వెలువడిన ఫలితాల్లో 8.2 పాయింట్లు రావడంతో మనస్తాపానికి గురైంది. తన అవ్వగారి ఊరైన ముట్టుకూరుపల్లె గ్రామానికి వచ్చిన ఆమె మంగళవారం రాత్రి ఉరేసుకుంది. కుటుంబ సభ్యులు చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.