సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం పదో తరగతి ఫలితాలు, మార్కుల మెమోలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రేడ్లు కావాలని విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారని, హైపవర్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా.. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా గ్రేడ్లు కేటాయించామని తెలిపారు. రెండు విద్యాసంవత్సరాలకు సంబంధించి గ్రేడ్లు ప్రకటించామన్నారు. ఏ విద్యార్థికీ నష్టం కలగకుండా చర్యలు తీసుకున్నామని, భవిష్యత్‌లో విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. 2020-21 ఫలితాలు, గ్రేడ్‌లతో పాటు 2019-20 గ్రేడ్‌లు కూడా ప్రకటించారు.
ఫలితాల కోసం క్లిక్ చేయండి : https://www.sakshieducation.com/Results2021/Andhra-Pradesh/SSC/2021/ap-ssc-10th-class-results-2021.html
కాగా, గ్రేడ్ల విధానంలో విద్యార్థుల ఉత్తీర్ణతను ప్రకటించారు. 2019–20 విద్యార్థులు రాసిన మూడు ఫార్మేటివ్ పరీక్షల మార్కులకు 50 శాతం వెయిటేజీ, ఒక సమ్మేటివ్ పరీక్ష మార్కులకు 50 శాతం వెయిటేజీ ఇచ్చారు. మొత్తం 100 మార్కులుగా పరిగణనలోకి తీసుకుని గ్రేడ్ ఇచ్చారు. అన్ని సబ్జెక్టులకు ఇదే విధానం అనుసరించారు. వొకేషనల్ కోర్సుల విద్యార్థులకు కూడా ఇదే విధానం. 2017, 2018, 2019 సంవత్సరాల్లో ఫెయిలై ఆ తరువాత పరీక్షలకు హాజరైనవారికి వారి ఇంటర్నల్ మార్కులను పరిగణనలోకి తీసుకున్నారు. 20 అంతర్గత మార్కులను 5తో రెట్టింపుచేసి 100 మార్కులుగా పరిగణించి గ్రేడ్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment